Janaki Kalaganaledu March 2nd: బాధలో కూడా జానకి శోభనం.. ఎంత బ్రతిమాలినా వినని జ్ఞానాంబ!

జానకి కలగనలేదు విభిన్నమైన ఎమోషన్స్ తో మాత్రమే కాకుండా మంచి కామెడీ కథనంతో ఆకట్టుకుంటోంది. అప్పుల సమస్యల వలన విబేధాలు రావడంతో కుటుంబ సభ్యులు విడిపోవాలని అనుకుంటారు. కానీ పెద్ద కుమారుడు రామ అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే మరోవైపు జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది.

జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 517 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అత్తగారి కోసం త్యాగం చేయాలని

అత్తగారి కోసం త్యాగం చేయాలని

జ్ఞానాంబ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోవడంతో రామచంద్ర మళ్ళి ఆలోచనలో పడుతూ ఉంటాడు. కిడ్నీ మార్పిడి చేయకపోతే తల్లి చనిపోతుంది అనే ఆలోచన అతన్ని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇక రామచంద్ర బాధని చూసి అతని భార్య జానకి కూడా చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటుంది.

అయితే ఇంట్లో జ్ఞానాంబకు ఎవరి కిడ్నీ కూడా సెట్ కాదు. ఇక ఫైనల్ గా జానకి కిడ్నీ సెట్ అవుతుంది అని తెలుస్తుంది. కానీ ఇక ఆమె కూడా అత్తగారి కోసం త్యాగం చేయాలని ఆశపడుతుంది. అదే విషయాన్ని రామచంద్రకు చెహుతుంది.

టెన్షన్ పడకండి

టెన్షన్ పడకండి

మీరు ఈ విషయంలో టెన్షన్ పడకండి అని నా కిడ్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జానకి చెబుతుంది. అయితే ఆమె ఎంత చెప్పినా కూడా రామచంద్ర మాత్రం కాస్త సందేహంగానే ఉంటాడు.

మీరు ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు మీరు ఆ విధంగా చేస్త అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు అని అంటాడు. నాకు తల్లితో సమానమైన అత్తగారి కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే అర్థం ఉండదు అని, లక్ష్యం కంటే అత్తగారే ముఖ్యమని జానకి మాట్లాడుతూ ఉంటుంది.

వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు

వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు

ఇక జానకి ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్తగారితో మాట్లాడుతూ ఉంటుంది. మీరు కిడ్నీ మార్పిడి కోసం ఒప్పుకోవాలి అని అంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో మొండిగానే మాట్లాడుతుంది. నా కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు.

నేను ఇప్పటికే జీవితంలో చాలా చూశాను. కానీ నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది నాకోసం నువ్వు నీ కిడ్నీని దానం చేస్తే నేను బ్రతికున్నంత కాలం కూడా అది నాకు వెలితిగానే ఉంటుంది అని బాధపడిన రామ నా మరణం గురించి మీరు ఎవరు కూడా బాధపడవద్దు అని జ్ఞానాంబ చెబుతుంది.

జానకి మాటలు వినదు

జానకి మాటలు వినదు

అయితే ఎంత బ్రతిమాలిన కూడా జ్ఞానాంబ మాత్రం జానకి మాటలు వినదు. మరోసారి ఈ విషయం నాతో మాట్లాడడానికి వీలు లేదు అని కూడా ఆమె చెబుతుంది. అంతే కాకుండా జ్ఞానాంబ.. నేను చనిపోయే లోపు ఇంటికి వారసుడిని ఇవ్వాలి అని రామచంద్రకు కొడుకు పుట్టాలి అని ఆ కోరిక తీర్చు అని జ్ఞానాంబ జానకిని అడుగుతుంది.

దీంతో మళ్ళీ జానకి ఆలోచనలో పడుతుంది. అంతేకాకుండా అత్తగారిని ఎలాగైనా కాపాడుకోవాలి అని ఏదైనా ఒక దారి దొరుకుతుందేమో అని కూడా ఆమె ఆలోచిస్తుంది.

పనివాడిని కాపాడిన గోవిందరాజులు

పనివాడిని కాపాడిన గోవిందరాజులు

ఇక మరోవైపు ఇంట్లో ఈ విషయం ఎవరికీ తెలియదు. మల్లికను చిన్న అత్త ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమెను చీరలు కూడా ఉతకమని చెబుతుంది. అయితే ఈ క్రమంలో మల్లిక, తిలోత్తమ చీరను ఆరేస్తూ ఉండగా అది చినిగిపోతుంది. దీంతో వెంటనే ఆ తప్పు పని వాడి మీద వేయాలని అనుకుంటుంది.

అయితే అతన్ని పిలిచి ఈ చీర ఆరేయమని కూడా అంటుంది. అయితే అతను చినిగిపోయిన చీరను చూసి నాకు ఏమి సంబంధం లేదు అని అంటాడు. మల్లిక మాత్రం నువ్వే ఈ పని చేశావు అని దబాయించడంతో అప్పుడే గోవిందరాజులు వచ్చి పనివాడి మలయాళం సేవ్ చేస్తాడు. నేను అంతా చూసాను అని నువ్వే ఆ పని చేసి అతని మీద వేయాలని అనుకుంటున్నావు అని వాదిస్తాడు.

లక్ష్యం కంటే ఆరోగ్యం ముఖ్యం

లక్ష్యం కంటే ఆరోగ్యం ముఖ్యం

ఇక మరోవైపు జానకి అత్తగారిని ఎలాగైనా ఒప్పించాలి అని ఎంతగానో బ్రతిమాలుతుంది. అయినప్పటికీ కూడా ఆమె జానకి మాటలు అస్సలు పట్టించుకోదు. తల్లి అయిన తండ్రి అయిన ఇప్పుడు అన్ని మీరే. కాబట్టి ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. నా లక్ష్యం కంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు లేకపోతే ఇక్కడ చాలామంది తట్టుకోలేరు అని కూడా జానకి తన అత్తకు చెబుతుంది.

బాధలో కూడా శోభనం

కానీ జ్ఞానాంబ మాత్రం జానకి మాటలను పట్టించుకోకుండా నువ్వు నా కోసం త్యాగం చేయొద్దు. అంతేకాకుండా నువ్వు నాకు మనవడిని ఇవ్వాలి అని జానకిని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుంది. అంతేకాకుండా ఆమెను రామచంద్ర గదిలోకి పాలతో పంపిస్తుంది. ఇక మల్లెపూలు తెల్ల చీరతో జానకి గదిలోకి వెళుతుంది.

మరోవైపు జ్ఞానాంబ తీరుని చూసిన గోవిందరాజులు నీకు ఏమయ్యింది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అంటాడు. ముహూర్తాలు చూడకుండా ఎందుకు ఇలా చేశావు అని అంటాడు. కానీ జ్ఞానాంబ దీనికి ముహూర్తంతో సంబంధం లేదని నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

ఇక రోజులు దగ్గర పడే కొద్ది బాధ్యతలు తీర్చుకోవాలి కదా అని జ్ఞానాంబ మాట్లాడడంతో గోవిందరాజులుకు అనుమానం వస్తుంది. మరి ఈ విషయంలో గోవిందరాజులు ఆమెను ఏ విధంగా ప్రశ్నిస్తాడో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X