Janaki Kalaganaledu March 30th: పండగ సమయంలో కూడా స్వీట్ రొమాన్స్.. మల్లికలో ఆగని కోరికలు

జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. మళ్ళీ ఐపీఎస్ పరీక్షలు రాసి మీ కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 540 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఆలస్యంగా రావడంతో

ఆలస్యంగా రావడంతో

అఖిల్ ఆఫీస్ నుంచి రెండు గంటలు ఆలస్యంగా రావడంతో తండ్రి గోవిందరాజులు కారణంగానే అతను అలిగి ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండవచ్చు అని ముందుగా అందరూ అనుమానిస్తారు. అయితే అఖిల్ రెండు గంటల ఆలస్యంగా తర్వాత ఇంటికి వచ్చి అసలు విషయం చెబుతాడు. ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాను అని అందుకే ఆలస్యమైంది అని చెబుతాడు. అయితే గోవిందరాజులు అంతకు ముందు రోజు అఖిల్ను ఇంట్లో డబ్బులు తక్కువగా ఇస్తున్నాడు అని కాస్త గట్టిగా అడగడంతో అఖిల్ హర్ట్ అయినట్లుగా అందరూ భావిస్తారు. అఖిల్ కూడా ఆ విషయంలో తండ్రిపై కాస్త కోపంగానే ఉంటూ ఎదురుమాట చెబుతూ ఉంటాడు.

మేము ఉన్నంతవరకు విడిపోదు

మేము ఉన్నంతవరకు విడిపోదు

ఇక ఈ విషయంలో తల్లి జ్ఞానాంబ తన భర్త గోవిందరాజులుకు సర్ది చెబుతూ కొడుకు తప్పులు చేస్తే మనమే సర్దుకోవాలి అని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెబుతుంది. ఇక ఎక్కడ విడిపోతారేమో అని కూడా ఆమె కాస్త బాధపడుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబం మేము ఉన్నంతవరకు విడిపోదు అని జానకి రామచంద్ర ఇద్దరు కూడా జ్ఞానాంబకు చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆలస్యమైంది అని వెళ్లి భోజనం చేసి పడుకోండి అని గోవిందరాజులు అందరికీ చెబుతాడు.

అలా మాట్లాడాల్సింది కాదు

అలా మాట్లాడాల్సింది కాదు

ఇక ఆ తర్వాత అఖిల్ విషయంలో అతని భార్య జెస్సి కాస్త అసంతృప్తిగా ఉంటుంది. నువ్వు అలా మాట్లాడాల్సింది కాదు అని అతనికి నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే నువ్వు కూడా నాకు నీతులు చెబుతున్నావా అంటూ అఖిల్ మరింత కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అఖిల్ ఆ విషయంలో మరోవైపు జానకి రామచంద్ర మాట్లాడుకుంటూ అఖిల్ అలా తండ్రికి ఎదురు సమాధానం చెప్పకూడదు అని జానకి చెబుతుంది. ఈ విషయంలో మనం ఏదో ఒకటి ఆలోచించాలి అని కూడా ఆమె తన భర్తకు చెబుతుంది.

అబద్ధం చెబుతున్న అఖిల్

అబద్ధం చెబుతున్న అఖిల్

అంతేకాకుండా అఖిల్ జీతం 30,000 వస్తున్నా 15000 మాత్రమే వస్తున్నాయని అబద్ధం చెబుతున్నాడు. ఇంట్లో 2000 ఇవ్వడానికి కూడా అతను చాలా ఇబ్బంది ఎందుకు పడుతున్నాడో అర్థం కావడం లేదు అని జానకి అంటుంది. అయితే రామచంద్ర మాత్రం తన తమ్ముడు ఎదుగుదలను చూసి మాత్రమే సంతోషిస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉగాది కావడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అనే జ్ఞానాంబ తన భర్తకు చెబుతుంది. ఎలాంటి గొడవలు రాకుండా చూడాలి అని కూడా మాట తీసుకుంటుంది. అయితే గోవిందరాజులు సరే అంటూ పూజా కార్యక్రమాలు నువ్వు చూసుకో అని, ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు.

అఖిల్ తో అలా..

అఖిల్ తో అలా..

ఇక విష్ణు కూడా ఇంటి గుమ్మానికి తోరణాలు కడుతూ హడావిడిగా కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అఖిల్ రావడంతో అతని భార్య జెస్సి నువ్వు కూడా వెళ్లి సహాయం చేయవచ్చు కదా అని చెబుతుంది. కానీ అఖిల్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోడు. ఇక నువ్వు బాబు డైపర్ మార్చు నేను వెళ్లి అత్తయ్య వాళ్ళకి సహాయం చేస్తాను అని అంటుంది. అవసరం లేదు నేనే వెళ్లి పని చేస్తాను అని అఖిల్ ఆ తర్వాత మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్తాడు. ఇక మరోవైపు ఉగాది పచ్చడి చేయాలి అని వేప పువ్వు తీసుకురమ్మని గోవిందరాజులు మలయాళంకు చెబుతాడు అయితే మలయాళం ను మల్లికా చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఇక అతను చెట్టు ఎక్కుతుంటే మల్లిక మరో వైపు తన మాటలతో మరింతగా చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఇక అతను ఆ పనిచేయలేక ఒక్కసారిగా కింద పడిపోతాడు. అయితే మల్లికా మళ్ళీ సైలెంట్ గా వెళ్లి నేను బయటికి వెళ్లి వేపపువ్వు తీసుకు వస్తాను అని నువ్వు రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి జంప్ అవుతుంది.

 జానకి రామ రొమాన్స్

జానకి రామ రొమాన్స్

ఇక వారి గదిలో జానకి రామ ముస్తాబవుతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి ఎంతో చక్కగా చీరకట్టుకోవడంతో రామచంద్ర అలా చూస్తూ ఉండిపోతాడు. అంతేకాకుండా ఆమెపై కవిత్వం కూడా విసురుతాడు. ఈరోజు ఉగాది కాబట్టి మీ పెదవులు తీయదనం, కారం నీ కోపం అంటూ కవిత్వం చెబుతూ ఉంటాడు. ఇక అతని ప్రేమకు జానకి కూడా ఎంతగానో సిగ్గుపడుతుంది అంతేకాకుండా రామచంద్ర చేతితో తన జడలో మల్లెపూలు పెట్టించుకుంటుంది.

మల్లికలో కలిగిన కోరిక

మల్లికలో కలిగిన కోరిక

అనంతరం రామ జానకి ఇద్దరు కౌగిలించుకోవడంతో వారిని మల్లిక చూస్తుంది. వీరి స్పీడ్ చూస్తుంటే వచ్చే ఉగాదికి ముగ్గురు అయ్యేలా ఉన్నారు అని మల్లికా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత తన భర్త ద్వారా కూడా అదే తరహాలో ప్రేమను చూపించి ఒక పిల్లాడిని కనాలని అనుకుంటుంది. అయితే భర్త రెడీ అవుతుండగా మల్లికా అతనితో కూడా మల్లెపూలు పెట్టించుకోవాలని అనుకుంటుంది. సిగ్గుపడుతూ మల్లిక భర్త దగ్గర మల్లెపూలు పెడుతుంది. ఇది నా జడలో పెట్టండి అవి నేను మహా ప్రసాదం అనుకుంటాను అని ఆమె చెప్పడంతో విష్ణు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. మరి విష్ణు మల్లికకు ఎలాంటి సమాధానం చెబుతాడో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X