Janaki Kalaganaledu March 31st: పండగ రోజు స్పెషల్ గేమ్ సెట్ చేసిన గోవిందరాజులు.. మల్లికకు కౌంటర్

జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. మళ్ళీ ఐపీఎస్ పరీక్షలు రాసి మీ కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 541 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ప్రత్యేకంగా పూజ

ప్రత్యేకంగా పూజ

ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక అత్తగారు జ్ఞానాంబ ఇంట్లో ప్రత్యేకంగా పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా గోవిందరాజులు ఉగాది పచ్చడి తయారు చేసే పనిలో బిజీగా ఉంటాడు. అయితే ఈ క్రమంలో ఉగాదికి సంబంధించిన ఎన్నో విశేషాలతో అత్తగారు అందరికీ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఉగాది పచ్చడి తీసుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా గోవిందరాజులు ఒక ఆట ఆడించాలని అనుకుంటాడు.

 ఉగాది ఆట

ఉగాది ఆట

అందరికీ చీటీలు ఇచ్చి అందులో ఏది వస్తుందో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది అని ముఖ్యంగా ఉగాది రోజు కాబట్టి వగరు తీపి చేదు కారం ఉప్పు ఇవన్నీ పదాలు అందులో ఉంటాయి అని గోవిందరాజులు అందరికీ వివరంగా చెబుతాడు. అయితే అలాంటి ఆట వద్దు అని జ్ఞానాంబ చెప్పినప్పటికీ కూడా మల్లిక మాత్రం ఆడదామంటూ ముందుకు వస్తుంది. అంతే కాకుండా ముందుగానే జానకి కూడా సరదాగా ఉంటుంది అని చెబుతుంది. ఇక గోవిందరాజులు కూడా ముందుగానే ఆ విషయం గురించి చెప్పి ఆటను మొదలు పెడతాడు.

పొగరు, కోపం తగ్గాలి

పొగరు, కోపం తగ్గాలి

అయితే ముందుగా విష్ణు అందులోని ఒక పేపర్ ని తీస్తాడు. అయితే అతనికి వగరు వస్తుంది. దీంతో మల్లిక గురించి మాట్లాడుతూ గోవిందరాజు కాస్త పొగరు తక్కువ చేసుకుని ఉంటే జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అని అర్థం వచ్చేలా చెబుతాడు. ఇక తర్వాత చిన్న కుమారుడు అఖిల్ కు ఒక చీటీ ఇచ్చిన గోవిందరాజులు ఏమి వచ్చిందో చెప్పాలని అంటాడు. అతనికి కారం అనే అర్థం వచ్చింది అని చెప్పడంతో అంటే కోపం అని కూడా తగ్గించుకొని ముందుకు సాగితే జీవితాలు బాగుంటాయి అని కొడుకుకి తండ్రి వివరణ ఇస్తాడు.

రామ చాలా అవసరం

రామ చాలా అవసరం

ఇక ఆ తరువాత మరొక చీటీని రామచంద్రకు ఇవ్వగా అతనికి ఉప్పు అనే పదం వస్తుంది. ఉప్పు లేకుండా ఈ ఇంట్లో ఏ వంటకం ఉండదు కాబట్టి రామచంద్ర లేకుండా ఈ కుటుంబం కూడా ఉండదు అని అతను ప్రతి దాంట్లో కూడా అవసరం వస్తాడు అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక చివరికి కేవలం రెండే రెండు ఉంటాయి. ఇక వాటిని మల్లిక జానకి తీసుకోవాల్సి ఉంటుంది అని గోవిందరాజులు చెబుతారు. ఇక మల్లిక తొందరపడి ముందుగానే ఒక చీటీ తీసుకుంటుంది.

 జానకి తీపి అంటూ..

జానకి తీపి అంటూ..


అయితే ఆ చీటీ ఓపెన్ చేసి చూడగానే అందులో చేదు అనే పదం ఉంటుంది. అందరూ కూడా మల్లిక మొహాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. దాన్ని చూపించక ముందే గోవిందరాజులు కూడా గుర్తుపట్టేస్తాడు. ఇక చివరికి ఒకే ఒక్క చీటీ ఉండడంతో అందులో తీపి ఉంది అని గోవిందరాజులు చెబుతాడు. అదే జానకికే వర్తిస్తుంది అని ఎప్పుడూ తీయగా జానకిలా ఉండాలి అని చెబుతాడు. ఇక ఈ ఆట అర్థం ఏమిటి అంటే జీవితంలో ఇవి లేకుండా మనిషి జీవితం గడవదు కాబట్టి మన ఇంట్లో కూడా అందరూ ఉండాలి అనే గోవిందరాజులు చెబుతాడు.

ఆ ఫొటో చూసి సిగ్గుపడిన జానకి

ఆ ఫొటో చూసి సిగ్గుపడిన జానకి


అయితే ఉగాది గొప్పతనం గురించి కూడా అత్తగారు ఎంతగానో చెబుతారు. మన కుటుంబం ఎల్లప్పుడూ కూడా కలిసికట్టుగా ఉంటేనే అందంగా ఉంటుంది అని అలాగే ఇంట్లో దేవుడి పటాలు కూడా పెట్టుకోవడం చాలా ముఖ్యమని అందరికీ చెబుతుంది. అయితే జానకికి మాత్రం ప్రత్యేకంగా ఒక ఫోటో ఇస్తుంది దాన్ని చూస్తే పిల్లలు పుడతారు అంటూ చెప్పడంతో జానకి ఆ ఫోటోను చూస్తుంది. ఒక పసిపాప బొమ్మ ఇవ్వడంతో జానకి దాన్ని చూసి ఎంత ప్రేమగా నవ్వుతుందు.

వెనుకడుగు వేసిన మల్లిక

వెనుకడుగు వేసిన మల్లిక

ఇక ఆ తర్వాత చిన్న కోడలు మల్లికా కూడా అత్తగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అయితే గతంలో నువ్వు ఒకసారి గర్భం దాల్చి అనవసరంగా పోగొట్టుకున్నావు ఇప్పుడు అలా జరగకుండా చూసుకొని అత్తగారు చెబుతారు. అంతేకాకుండా ఒకసారి నిన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లాలి అని చెకప్ చేయిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది అని అత్తగారు చెబుతారు. అయితే గతంలో మల్లిక కడుపు వచ్చింది అని అబద్ధం చెబుతుంది. ఇప్పుడు హాస్పిటల్ కి వెళితే ఆ నిజం అత్తగారికి తెలుస్తుందేమో అని కంగారుపడుతుంది. అందుకే మళ్ళీ వెనకడుగు వేస్తుంది. మరి మల్లిక విషయంలో జ్ఞానాంబ గరాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X