Janaki Kalaganaledu March 3rd: అత్తగారి కోసం కిడ్నీ ఇవ్వడానికి జానకి సిద్ధం.. చివరి క్షణంలో మరో ట్విస్ట్

జానకి కలగనలేదు ఆసక్తికరమైన కథనంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అప్పుల వలన విబేధాలు రావడంతో మొదట కుటుంబ సభ్యులు విడిపోవాలని అనుకుంటారు. కానీ రామ అందరు కలిసే ఉండాలని కోరుకుంటాడు. మరోవైపు జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 518 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

లక్ష్యానికి దూరం కాకూడదు

లక్ష్యానికి దూరం కాకూడదు

జ్ఞానాంబ హఠాత్తుగా అనారోగ్యానికి గురి అవుతుంది. అయితే డాక్టర్లు ఆమె కిడ్నీలు పాడయ్యాయి అని వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రతకదు అని కిడ్నీ మార్పిడి తప్పనిసరిగా చేయాలి అని అంటారు. అయితే జానకి త్యాగం చేసేందుకు సిద్ధమవుతోంది తన కిడ్నీ అత్తగారి కోసం దానం చేయాలని అనుకుంటుంది. కానీ ఆ విషయంలో రామచంద్ర ఏమాత్రం ఒప్పుకోడు. అంతేకాకుండా జ్ఞానాంబ కూడా నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దు అని నువ్వు ఒక ఐపీఎస్ కావాలని అనుకుంటున్నావు అని.. నా కారణంగా నువ్వు నీ లక్ష్యానికి దూరం కాకూడదు అని ఆమె అంటుంది.

శోభనం గదిలోకి జానకి

శోభనం గదిలోకి జానకి


అంతేకాకుండా జ్ఞానాంబ తన చావు గురించి ఎవరు కూడా ఆలోచించకూడదు అని ఇంట్లో ఈ విషయం కూడా మిగతా వాళ్లకు తెలియకూడదు అని అనుకుంటుంది. అయితే తాను చనిపోయే లోపు కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది అని అనుకున్న జ్ఞానాంబ జానకి రామచంద్ర పుట్టబోయే కొడుకును చూడాలని అనుకుంటుంది. ఇక వారు శోభనానికి ఆమె ముందుగానే ఏర్పాట్లు చేస్తుంది. రామచంద్ర వారసుడిని ఎత్తుకునే అదృష్టం ఇవ్వు అని జానకిని జ్ఞానాంబ కోరుతుంది. ఇక జానకి అత్తగారు ప్రాణాలు పోతున్న సమయంలో అలాంటి నిర్ణయంపై ఏమాత్రం ఆసక్తి చూపించదు. ఇక గదిలో ఉండి రామచంద్రతో ఆమె అత్తగారి గురించి బాధపడుతూ ఉంటుంది.

కుప్పకూలిన జ్ఞానాంబ

కుప్పకూలిన జ్ఞానాంబ

ఇక గోవిందరాజులు కూడా జ్ఞానాంబ ఇంత హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తుంది అని అడుగుతాడు. కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంది అని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ తరుణంలో జ్ఞానాంబ హఠాత్తుగా ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక ఆమెకు ఏం జరిగిందో అని ఒక్కసారి గోవిందరాజులు కంగారు పడతాడు. ఇక రామచంద్ర జానికి కూడా గదిలో నుంచి బయటకు వస్తారు. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకు వెళతారు.

అందుకే చెప్పలేదు

అందుకే చెప్పలేదు

ఇక వైద్యులు జ్ఞానాంబను చూసిన తర్వాత ఇప్పటికే ఆలస్యం అయింది అని వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలి అని అంటారు. ఇక అప్పుడే మిగతా వాళ్లకు కూడా అసలు నిజం తెలుస్తుంది. అమ్మకు ఇంత జరిగింది అని మాకు ఎందుకు చెప్పలేదు అని చిన్న కుమారుడు అఖిల్ రెండవ తమ్ముడు విష్ణు రామచంద్ర కూడా అడుగుతారు. మీరు బాధపడతారు అని తట్టుకోలేరు అని ఆ విషయాన్ని చెప్పలేదు అని అంటాడు. ఇక గోవిందరాజులు అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నా భార్యకు అంత కష్టం వచ్చింది అంటే నేను తట్టుకోలేను అని తనకు ఏదైనా అయితే మీకు ఈ నాన్న కూడా మిగలడు అని చాలా ఏడుస్తూ చెబుతాడు.

త్యాగం చేసేందుకు సిద్ధమైన జానకి

త్యాగం చేసేందుకు సిద్ధమైన జానకి


గోవిందరాజులు అలా ఏడుస్తూ ఉండడంతో జానకి మామగారిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అత్తయ్య గారికి ఏమి కాదు అని నేను కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుంటాను అని చెబుతుంది. దీంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అలాగే గోవిందరాజులు మాత్రం నా భార్య కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని నీ లక్ష్యం కోసం నువ్వు ఎంతగానో కష్టపడ్డావు అని ఇప్పుడు కిడ్నీ ఇస్తే నీ చిరకాల కోరిక ఐపీఎస్ అవ్వడం నెరవేరదు అని అంటాడు. అయితే లక్ష్యం కంటే కుటుంబమే గొప్పది అని అత్తయ్య గారి కోసం నేను దేనికైనా సిద్ధమే అని జానకి చెబుతుంది.

 చివరలో ట్విస్ట్

చివరలో ట్విస్ట్

ఇక జానకి తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా మొదట అంగీకరించరు. ఇక అత్తయ్య గారికి ఒకవేళ మీ కిడ్నీ సెట్ అయ్యి ఉంటే మీరైనా ఇచ్చేవారు కదా అని ఆ స్థానంలో మా అమ్మ ఉన్నా కూడా నేను ఇలానే చేసేదాన్ని కదా అని జానకి చెబుతుంది. ఇక మొత్తానికి జానకి ఆపరేషన్ కు వెళుతుంది. అయితే జ్ఞానాంబ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మొదట జ్ఞానాంబ కూడా జానకి కిడ్నీ ఇచ్చింది అని అనుకుంటుంది. కానీ నిజానికి జానకి కాకుండా ఆ స్థానంలో గోవిందరాజులు కిడ్నీ ఇస్తాడు. మన కోసం జానకి తన లక్ష్యాన్ని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధమయింది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని గోవిందరాజులు అంటాడు. మరి తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X