Janaki Kalaganaledu March 4th: జానకి ఐపీఎస్ అయ్యే తరుణం.. ఊహల్లో షాక్ అయిన మల్లిక!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరమైన కథనంతో కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు విడిపోవాలని అనుకుంటారు. కానీ రామ అందరు కలిసే ఉండాలని కోరుకుంటాడు. మరోవైపు జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 519 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కిడ్నీ మార్పిడి కోసం
అత్తగారి ఆరోగ్యం బాగోలేకపోవడం ఆమె కిడ్నీ మార్పిడి కావాలి అని డాక్టర్లు చెప్పడంతో జానకి తన కిడ్నీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఎలాగైనా అత్తగారిని బ్రతికించుకుంటాను అని కూడా చెబుతుంది. అయితే ఆమె కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో మిగతా కుటుంబ సభ్యులు మాత్రం అసలు ఒప్పుకోరు. ముఖ్యంగా మామ గోవిందరాజులు కూడా నువ్వు ఐపిఎస్ కావాలని అనుకుంటున్నావు అని ఇప్పుడు నువ్వు కిడ్నీ దానం చేస్తే నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేవు అని చెబుతాడు. కానీ మొత్తానికి జానకి మాత్రం తన కిడ్నీ ఇవ్వడానికి ముందడుగు వేస్తుంది. మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకుంటారు.

ఎమోషనల్ మూమెంట్
అయితే ఊహించని విధంగా జ్ఞానాంబ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత జానకి కిడ్నీ ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె స్థానంలో గోవిందరాజులు తన భార్యకు కిడ్నీ ఇస్తాడు. మొదట జానకి కిడ్నీ ఇచ్చిందేమో అని అనుకుంటుంది ఇక ఆ తర్వాత గోవిందరాజులు రావడంతో ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. అంతేకాకుండా నీకోసం అందరికంటే ఎక్కువగా జానకి బాధపడింది అని గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక జ్ఞానాంబ కోడలి ప్రేమను చూసి ఎంతగానో సంతోషిస్తుంది.

గుడికి వెళ్లిన రామ
ఇక తర్వాత ఇంటికి వెళ్లి పోదామని కూడా అందరూ అంటారు. కానీ ఇప్పుడే ఆపరేషన్ చేశారు కాబట్టి ఒక వారం రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండాలి అని రామచంద్ర అంటాడు. ఇక తర్వాత రామచంద్ర గుడికి వెళ్లి కుటుంబం కోసం పూజ చేయిస్తాడు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత రామచంద్ర మళ్లీ గుడికి వెళ్లి తన భార్య పరీక్షా ఫలితాలు రాబోతున్న సందర్భంగా ప్రత్యేకంగా పూజ చేయించాలని అనుకుంటాడు. ఇక రామచంద్ర ఆ విషయంలో ఎంతో సంతోషంగా ఉంటాడు.

తప్పకుండా జానకి పాస్ అవుతుంది
తప్పకుండా జానకి పాస్ అవుతుంది అని పూజారి కూడా చెబుతాడు. భార్య కోసం ఈ విధంగా కృషి చేస్తున్న నీలాంటి భర్త దొరకడం జానకి అదృష్టం అని కూడా పూజారి అనడంతో రామ సంతోషిస్తాడు. ఇక మరోవైపు ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈరోజు జానకి ఐపిఎస్ కు సంబంధించిన ఫైనల్ పరీక్షా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా జానకి పాస్ అవుతుంది అని ఇంట్లో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని గోవిందరాజులు అంటాడు. అంతేకాకుండా పనివాడు మలయాళంకు చెప్పి ప్రత్యేకంగా వంటలు చేయాలని అంటాడు.

రామ సంతోషంగా
అయితే అతను కూడా ప్రయోగాలు చేస్తాను అని అంటాడు కానీ అలా ఏమీ చేయకు అని మరికొందరు చెబుతారు. ఇక జెస్సీతో పాటు జ్ఞానాంబ జానకి తప్పకుండా పాస్ అవుతుంది అని నమ్మకంగా చెబుతూ ఉంటారు. ఇక మరోవైపు రామచంద్రా ఊళ్లో వాళ్లకు కూడా జానకి పరీక్ష ఫలితాల గురించి చెబుతూ ఉంటాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎదురుపడి ఏంటి రామచంద్ర ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు అని అంటాడు. ఈరోజు జానకి గారు ఐపీఎస్ పరీక్షలు రాబోతున్నాయి అని తప్పకుండా పాస్ అవుతుంది అని చెబుతూ ఉంటాడు. అయితే రేపటి నుంచి నీకు కూడా సెల్యూట్ చేయాలి అని సరదాగా చెబుతూ ఉంటాడు.

ఊహల్లో షాక్ తిన్న మల్లిక
ఇక రామచంద్ర ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చినట్లుగా చిన్న కోడలు మల్లిక కల కంటుంది. అతను వచ్చి ఇంట్లో వాళ్లందరికీ కూడా జానకి పాస్ అయినట్లుగా చెప్పి సంతోషంగా ఉంటాడు అని అనుకుంటుంది. అంతే కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ కూడా జానకిపై ప్రశంసలు కురిపిస్తూ ఆమెకు గౌరవంగా సన్మాన సభను కూడా సిద్ధం చేసినట్లుగా మల్లికకు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత వెంటనే ఆమె ఊహ నుంచి బయటకు వచ్చి షాక్ అవుతుంది. వామ్మో నిజంగా జానకి ఈ పరీక్ష పాస్ అయితే నన్ను చాలా తిడతారు అని అనుకుంటుంది. ఇక రామచంద్ర పెద్దగా హడావిడి లేకుండా ఇంట్లోకి వస్తాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయా తండ్రి గోవిందరాజులు అడుగుతాడు. కానీ ఇంకా రాలేదు అని ప్రిన్సిపాల్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెబుతాను అని చెప్పినట్లుగా రామచంద్ర చెబుతాడు. ఇక ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్లు కూడా అందరూ చెబుతారు. మరి జానకి ఈ పరీక్ష ఫలితాల్లో నిజంగా పాస్ అవుతుందో లేదో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











