Janaki Kalaganaledu March 7th: ఐపీఎస్ పరీక్షల వలన బాధలో జానకి.. మరో సలహాతో రామ హ్యాపీ
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ఘట్టంతో కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాల కారణంగా విడిపోవాలని అనుకున్నప్పటికి రామ అందరు కలిసే ఉండాలని కోరుకుంటాడు. జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.
ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 521 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అలా జరగడంతో..
చిన్నప్పటినుంచి ఐపిఎస్ కావాలి అని జానకి ఎన్నో కలలు కంటూ ఉంటుంది. ఇక భర్త రామచంద్ర ద్వారా ఆ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. రామచంద్ర కూడా ఆమెకు ఎంతగానో సహకరిస్తాడు. ఇక వారి కుటుంబ సభ్యులకు కూడా జానకి చదువుకునేందుకు మద్దతు ఇస్తారు.
ఇక ఒకవైపు కోడలిగా ఇంటి బాధ్యతలను కుటుంబ పరిస్థితులను చూసుకుంటూనే జానకి తన ఐపిఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే అసలు పరీక్షలో మాత్రం జానకి ఫెయిల్ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న జానకి మొదటి సారి రాసిన పరీక్షలో తప్పడంతో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు.

తప్పకుండా పాస్ అవుతుంది అని..
ముఖ్యంగా రామచంద్ర జానకి తప్పకుండా పాస్ అవుతుంది అని ఊరందరికీ ముందే చెప్పుకుంటాడు. కానీ జానకి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో అత్తగారు కూడా బాధకు గురి అవుతారు.
అయితే ప్రిన్సిపల్ మాత్రం జానకికి ముందే చెప్పాను అని కుటుంబాన్ని చదువును ఒకేసారి బ్యాలెన్స్ చేయడం కష్టమని ఎంత చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు అని అంటారు. ఇక అదే విషయం గురించి అత్తగారు జ్ఞానాంబ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక మల్లిక మాత్రం జానకి ఫెయిల్ అయినందుకు ఎంతగానో సంతోషిస్తుంది.

సంతోషంగా పాయసం తిన్న మల్లిక
ఆమె పరీక్షల్లో పాస్ అయి ఉంటే తన రేంజ్ ఇంకా తగ్గేది అని ఇప్పుడు జానకి ఫెయిల్ అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది. అంతే కాకుండా వంటగదిలోకి వెళ్లి జానకి ఫెయిల్ అయింది కాబట్టి సంతోషంగా పాయసం తింటుంది. ఇక అప్పుడే మామ గోవిందరాజులు వచ్చి చూస్తాడు. కానీ మామగారి ముందు మల్లిక బాధపడుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ నోటికి పాయసం అడ్డుకోవడంతో ఆయన గుర్తించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.

మరోసారి ప్రయత్నం చేయాలి
ఇక ఆ తర్వాత జానకి భోజనం కూడా చేయడానికి రాదు. ఇక జ్ఞానాంబ ప్రత్యేకంగా వెళ్లి జానకికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి పరీక్షల్లో తప్పిపోయిన తర్వాత ఏమి జరగదు అని మళ్లీ మరోసారి ప్రయత్నం చేయాలి అని అత్తగారు చెబుతారు. అయితే జానకి మాత్రం చిన్నప్పటి నుంచి ఎంతగానో ఆశలు పెట్టుకున్నాను కానీ ఈరోజు ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు తట్టుకోలేకపోతున్నాను అని జానకి బాధపడుతుంది.
ఇక ఆ తర్వాత అత్తగారు ధైర్యం చెప్పి ఆమెను మళ్లీ అందరి ముందుకు తీసుకు వస్తారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర జానకికి భోజనం చేయమని చెబుతారు. అయితే ఈ క్రమంలో మల్లిక మాత్రం తన సూటిపోటి మాటలతో జానకిని మరింత బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె నోరు మూయించే విధంగా అత్తగారు అలాగే మామగారు కూడా కౌంటర్ ఇస్తారు.
రామచంద్రను హత్తుకొని ఏడ్చిన జానకి
ఇక మల్లికా మాటలకు కూడా జానకి మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా ప్రిన్సిపల్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. అసలు జానకి ఫెయిల్ అవుతుంది అని అనుకోలేదని కూడా ఆమె అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని గుర్తు చేసుకున్న జానకి పదేపదే ఏడుస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర బెడ్ మీద పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. రామచంద్ర కూడా ఆ విషయంలో చాలా బాధపడతాడు. తన భార్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.

మరో సలహా
ఇక రామచంద్ర బయటకు సైకిల్ మీద వెళుతూ ఉండగా ఊళ్లో వారందరూ కూడా అతన్ని అడుగుతూ ఉంటారు. జానకి పరీక్షల్లో పాస్ అయ్యిందా అని అడుగుతుంటే రామచంద్ర మంత్రం ఇంకా ఫలితాలు రాలేవు అని అంటాడు. ఇక తెలిసిన కానిస్టేబుల్ రామచంద్రను అడుగుతాడు. పరీక్ష ఫలితాలు ఏమయ్యాయి అని అంటాడు.
పాస్ అవ్వలేదు అని చెప్పడంతో ఒకసారి తప్పితే ఏమీ కాదు అని మరోసారి రాసుకోవచ్చు అని అంటాడు. అంతేకాకుండా అప్పటివరకు కానిస్టేబుల్ కైనా పరీక్షకైనా అప్లై చేయమని సలహా ఇస్తాడు. దీంతో రామచంద్ర అందుకు ఒప్పుకుంటాడు. అయితే మరోవైపు ఇంటిదగ్గర జానకి ఒంటరిగా కూర్చుని ఉండగా మల్లిక తన చిన్న మరిది అఖిల్ తో మాట్లాడుతూ మరింత బాధ పెట్టేలా మాట్లాడుతుంది.
మీ ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఉంటే చూడు అని.. పాపం జానకి బాధపడుతోంది అని అంటాడు. అయితే జానకికి మాత్రం అఖిల్ భార్య జెస్సి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి రామచంద్ర వచ్చిన తర్వాత జానకికి ఎలాంటి సలహా ఇస్తాడు చూడాలి.


Click it and Unblock the Notifications











