Janaki Kalaganaledu March 8th: లక్ష్యం కోసం జానకి మరో కొత్త అడుగు.. బాధపెట్టేలా మల్లిక మాటలు

జానకి కలగనలేదు ఊహించని కథనంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ మధ్య గొడవల కారణంగా విడిపోవాలని అనుకున్నప్పటికి రామ అందరు కలిసే ఉండాలని కోరుకుంటాడు. ఇక జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 522 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

రామచంద్రకు షాక్

రామచంద్రకు షాక్

జానకి తన చిన్నప్పటి నుంచి కూడా ఐపీఎస్ కావాలి అని ఎన్నో కలలు కంటుంది. ఆమె తల్లిదండ్రుల ఆఖరి కోరిక కూడా అదే. ఇక రామచంద్ర కూడా తన భార్య ఐపీఎస్ చదువుకునేందుకు ఎంతగానో సహాయపడతాడు. ఇక అత్తగారు కూడా జానకికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అయితే జానకి మాత్రం ఊహించని విధంగా మొదటి సారి రాసిన ఐపిఎస్ పరీక్షల్లో ఫెయిలవుతుంది. అందరూ పాస్ అవుతుందేమో అని అనుకుంటే జానకి మాత్రం అలా చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.

 బాధపెట్టేలా మల్లిక మాటలు

బాధపెట్టేలా మల్లిక మాటలు


అదే అవకాశంగా భావించిన రెండవ కోడలు మల్లిక మాత్రం జానకిని మరింత బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. ఐపీఎస్ కావాలి అని అనుకున్న జానికి ఇప్పుడు ఉద్యోగం రాకుండా పోయింది అని మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడు అఖిల్ అని తన చిన్న మరదికి చెబుతుంది. అయితే ఆమె తక్కువ చేసి మాట్లాడడంతో అఖిల్ భార్య జెస్సీ మాత్రం జానకికి సపోర్ట్ చేస్తుంది. అనవసరంగా అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని జానకి అక్క ఎంతగానో హార్డ్ వర్క్ చేసింది అని తప్పకుండా భవిష్యత్తులో తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది అని చెబుతుంది.

జెస్సి సపోర్ట్

జెస్సి సపోర్ట్

అంతేకాకుండా జానకికి కూడా జెస్సి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక తర్వాత జానకి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఆ తర్వాత ఒంటరిగా కూడా బాధపడుతూ ఉంటుంది. అయితే ఐపీఎస్ పరీక్షల్లో పాస్ కాకపోవడంతో జానకి మళ్ళీ అటువైపు వెళ్ళకూడదు అని అనుకుంటుంది. తన పుస్తకాలను తీసి ఒక బాక్స్ లో పక్కన పెట్టాలని అనుకుంటుంది. మొత్తంగా జానకి మళ్ళీ కాదువుకోకూడదని ఆలోచిస్తుంది.

ఒప్పించిన రామ

ఒప్పించిన రామ

ఇక ఇంతలోనే రామచంద్ర వచ్చి జానకి పుస్తకాన్ని పట్టుకుంటాడు. మీరు ఫెయిల్ అయ్యారు కదా అని బాధపడకూడదు అని ఓడిపోయిన చోటే మళ్లీ గెలుపు బాటలు కనిపిస్తాయి అని నిరాశ చెందకూడదు అని స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడుతాడు. మీరు ఐపీఎస్ పరీక్షలు మళ్ళీ రాయవచ్చు అయితే అంతకంటే ముందు ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయాలి అని అంటాడు. అయితే మొదట జానకి కొంత ఆలోచనలో పడుతుంది. అది కూడా ఒక పోలీస్ ఉద్యోగం కాబట్టి దాన్ని నిర్వర్తించిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం కోసం కష్టపడవచ్చు అని రామచంద్రా అంటాడు.

కొడలితో అత్త చర్చలు

కొడలితో అత్త చర్చలు


ఇక అదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పాలని అనుకుంటాడు. అయితే అత్త జ్ఞానాంబ మాత్రం అలా ఎందుకు అని అడుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే అంత సాధారణమైన విషయం కాదు అని ఆ డ్యూటీ చాలా కష్టతరమైంది అని సమయానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఎదురవుతాయని ఎన్నో రాత్రులు కూడా డ్యూటీలు చేయాల్సి వస్తుంది అని అత్తగారు చెబుతారు. అంతేకాకుండా జానకి కారణంగా కుటుంబంలో కూడా సమస్యలు రావచ్చు అని ఆమె చెబుతోంది. అయితే రామచంద్ర మాత్రం ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇక మొత్తానికి అందరూ ఒప్పుకోవడంతో జానకి పోలీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతోంది.

 కానిస్టేబుల్ గా జానకి

కానిస్టేబుల్ గా జానకి

ఇక మళ్ళీ మరోసారి మల్లిక ఆ విషయంలో అనవసరంగా గొడవలు క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉండటంతో మామ గోవిందరాజులు ఆమె కౌంటర్ ఇచ్చి నోరుమూయిస్తాడు. ఇక తర్వాత మొత్తానికే జానకి కానిస్టేబుల్ పరీక్షల కోసం సిద్ధమయిన తరువాత కొన్నిరోజులకు పరీక్షలు రాస్తుంది. ఇక అందులో ఆమె అనుకున్నట్లే పాస్ అవుతుంది. ఇక అందరూ కూడా ఇంట్లో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక జానకి కానిస్టేబుల్ ట్రైనింగ్ కు వెళ్లి తిరిగొస్తుంది. ఆమె ప్రత్యేకంగా పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో రామచంద్ర తో పాటు అత్తగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ముందు మీరు ఈ డ్యూటీలో ఒక న్యాయంగా వర్క్ చేయాలి అని ఆ తర్వాత మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రామచంద్ర చెబుతాడు. మరి ఈ క్లిష్టమైన పరిస్థితులలో జానకి తన అనుకున్న లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X