Janaki Kalaganaledu March 9th: జానకి ముందు మరో సవాల్.. డ్యూటీలో మొదటి రోజే ఊహించని టాస్క్!
జానకి కలగనలేదు సీరియల్ కథ సరికొత్త ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి పరీక్షలో ఫెయిల్ కావడం వలన ఆమె మళ్ళీ ఒక్కసారిగా వెనుకడుగు వేస్తుంది. ఇక రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మధ్యలో అత్త జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 523 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

నిరాశచెందిన రామ
ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా జానకి మాత్రం చదువుపై దృష్టి మరల్చకుండా ఏకగ్రతతో చదువుకుంటూ ఉంటుంది. ఒకవైపు కోడలిగా ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే మరోవైపు తన చదువును కొనసాగిస్తుంది. అయితే ఆమె ఐపిఎస్ మెయిన్ పరీక్షలలో మాత్రం ఫెయిల్ అవుతుంది. అయితే అంతకు ముందు వరకు కూడా జానకి తప్పకుండా పాస్ అవుతాను అని నమ్మకంతో ఉంటుంది. రామచంద్ర కూడా తన భార్య పాస్ అవుతుంది అని ఊళ్లో అందరికీ కూడా ఎంతో సంతోషంగా చెబుతాడు. అయితే ఈ తరుణంలో జానకి ఫెయిల్ అవ్వడంతో రామచంద్ర ఒక్కసారిగా నిరాశ చెందుతాడు.

కానిస్టేబుల్ ఉద్యోగంలో జానకి
ఇక జానకి బాధపడుతుంటే మళ్ళీ ఎలాగైనా ఆమె సంతోషంగా ఉండాలి చేయాలి అని రామ అనుకుంటాడు. అయితే రామచంద్ర ముందుగానే కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయిస్తాడు. అయితే ఆ విషయంలో జానకి కొంత సంతృప్తితోనే ఉంటుంది. మొత్తానికి కానిస్టేబుల్ ఉద్యోగం అయితే వస్తుంది. ఇక పోలీస్ డ్రెస్ లో కనిపించిన జానకి నిరాశతో ఉన్నప్పటికీ కూడా రామచంద్ర చెప్పిన మాటలతో మళ్ళీ ఆమె ధైర్యం తెచ్చుకుంటుంది. మీరు తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ కానిస్టేబుల్ ఉద్యోగంలో ముందుకు వెళ్లాలి అని రామచంద్ర చెబుతాడు.

సైకిల్ మీద జానకితో రామ
ఇక మొదటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళుతూ ఉండడంతో జానకి ఇంట్లో అందరినీ కలుసుకుంటుంది. ముందుగా తన అత్తగారి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక ఈ క్రమంలో మల్లిక మాత్రం తన మాటలతో మరింత బాధపడేలా చేయాలని అనుకుంటుంది. అయినప్పటికీ ఆ మాటలు పట్టించుకోకుండా జానకి మొదటి రోజు రామచంద్రతో సంతోషంగా పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. ఇద్దరూ కూడా అలా సైకిల్ మీద వెళుతూ ఉండడంతో జనాలు అందరూ చూసి చూడ చక్కనైన జంట అని మెచ్చుకుంటారు. ఇతను గుడికి వెళ్ళిన జానకి అక్కడ డ్యూటీ బాగా చేయాలని కోరుకుంటాడు.

మొదటి రోజు పోలీస్ డ్యూటీ
మీరు పోలీస్ స్టేషన్ కి మొదటి రోజు వెళ్తున్నారు కాబట్టి అక్కడితో అందరితో కూడా స్నేహంగా ఉండండి అని ముఖ్యంగా ఎస్ఐ గారితో చాలా మంచిగా ఉండాలి అని రామ జానకితో అంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మనోహర్ మాత్రం అందరిలాగా సాధారణంగా ఉండడు. ఆయన చాలా కోపదారి మనిషి అని అర్థమవుతూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మనోహర్ అందరినీ తిడుతూ ఉంటాడు. ఒక లేడీ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ ఫైల్ మీద పొరపాటున కాఫీ పడేసింది అని తెలియడంతో ఆయన చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అసలు ఆడవాళ్ళను ఈ ఫీల్డ్ కు రానివ్వకూడదు అని కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు.

దొంగతనం కేసు
ఇక అప్పుడే జానకి పోలీస్ స్టేషన్లోకి అడుగుపెడుతుంది. ఆమెను చూసిన ఎస్ఐ మనోహర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మరొక లేడీ కానిస్టేబుల్ వచ్చిందా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అతనికి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఊర్లో ఒక టెంపుల్ దగ్గర అమ్మవారి నెక్లెస్ దొంగతనం చేసినట్లుగా ఫోన్ వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండడంతో ఎస్సై జానకిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడ ఎస్సై మనోహర్ అందరినీ ప్రశ్నిస్తాడు. ఇక వాచ్మెన్ ఎవరు అని కూడా అడుగుతాడు. అయితే అతను మాత్రం నేను గత వారం రోజుల నుంచి ఇక్కడ లేను అని మా భార్య పుట్టింటికి వెళ్తే ఆమెను తీసుకురావడానికి వెళ్లాను అని అంటాడు. ఇక మరోవైపు మనోహర్ అనుమానిస్తూ ఉండడంతో ఎమ్మెల్యే మాత్రం స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాడు. అతడు అమాయకుడు అని చెబుతాడు.

జానకి అనుమానం
ఇక మనోహర్ ఏమి చేసేదిలేక దొంగల్ని పట్టుకోవాలి అని బయలుదేరుతాడు. ఈ క్రమంలో జానకిని పోలీస్ స్టేషన్కు వెళ్ళమని అంటారు. ఇక రామచంద్ర స్వీట్ బండి పై రోడ్డు మీద ఉండగా...మురికి నీళ్లు పడేలా ఎస్సై మనోహర్ కారు నడుపుకుంటూ వెళతాడు. అయితే రామ గట్టిగా అరవడంతో ఏంటి సీరియస్ అవుతున్నావు అంటూ మనోహర్ వచ్చి గల్లా పట్టుకుంటాడు. ఇక రామచంద్ర మళ్ళి సైలెంట్ అయిపోవడంతో మనోహర్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మళ్ళీ ఎప్పుడైనా దొరకవా అని అంటాడు. ఇక జానకి ఆ నెక్లెస్ ను ఎవరు దొంగతనం చేసి ఉంటారా అని పోలీస్ స్టేషన్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఎస్ఐ మనోహర్ కు కోపం తెప్పించకుండా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











