Janaki Kalaganaledu May 11th: భర్తను నిర్దోషి అని నిరూపించిన జానకి... ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 576 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.
ఎంతో బాధ్యతగా ఉన్నప్పటికీ:జానకి కోడలిగా తన అత్తగారింట్లో ఎంతో ఎంతో బాధ్యతగా ఉన్నప్పటికీ సమస్యలు అన్నీ కూడా ఆమెను చుట్టుముడతాయి. రామచంద్ర మాత్రమే ఆమెను ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు ఇక అత్తగారు అలాగే తోడికోడలు ఇద్దరు కూడా జానకి కోడలుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. జానకి పోలీసు ఉద్యోగంలోకి వెళ్లడం కారణంగానే ఇంట్లో సమస్యలు కూడా వస్తున్నాయని, అనవసరపు కేసులో రామచంద్ర కూడా దోషిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మల్లికా చాలా సార్లు చెబుతుంది. అయితే రామచంద్ర ఎలాంటి తప్పు చేయలేదు అని అతన్ని తప్పకుండా నేను బయటకు తీసుకు వస్తాను అని జానకి అందరికీ మాట ఇస్తుంది.

ఉద్యోగాన్ని వదులుకుంటేనే..:ఈ పోలీస్ ఉద్యోగాన్ని వదులుకుంటేనే రామచంద్ర ఇంటికి వస్తాడు అని ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడడంతో జానకి ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటుంది. రామచంద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ జాబ్ వదిలేయకండి అని మీరు చట్టపరంగా నన్ను నిర్దోషిగా బయటకు తీసుకురండి అని మాట కూడా తీసుకుంటాడు. ఇక జానకి మొదట పోలీస్ జాబ్ వదిలేయాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఎలాగైనా కోర్టుకు వెళ్లకముందే పోలీస్ జాబ్ వదిలేయాలి అని ఎస్ఐ మనోహర్ ఆమెకు చాన్స్ ఇస్తాడు.

ఎలాగైనా సాక్షాధారాలు సంపాదించి:అయితే జానకి మాత్రం ఎలాగైనా సాక్షాధారాలు సంపాదించి తన భర్తను బయటకు విడిపించడమే కాకుండా మర్డర్ చేసిన మధుకర్ అలాగే అతనికి సహాయపడిన ఎస్సై మనోహర్ ను గుట్టు బయటపెట్టాలి అని జానకి అనుకుంటుంది. ఇక జానకి మధుకర్ మర్డర్ చేసిన రోజున సిసి ఫుటేజ్ సంపాదించాలని అనుకుంటుంది. అయితే అందుకు సంబంధించిన వీడియోలు ఎస్ఐ మనోహర్ పెన్ డ్రైవ్ లో ఉన్నాయని ఆమె దొంగతనం గా అతని ఇంటికి వెళ్లి మరి ఆ పెన్ డ్రైవ్ ను సంపాదిస్తుంది.

రామచంద్రాను కోర్టు వరకు..:ఇక జానకి కోర్టులో అదే విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. ఇక ఆఖరి నిమిషం వరకు ఎస్ఐ మనోహర్ ఆమెకు అవకాశం ఇవ్వాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం రామచంద్రాను కోర్టు వరకు తీసుకు వెళుతుంది. అయితే అక్కడ మొదట మనోహర్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామచంద్రది తప్పు అన్నట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. ఇక డ్రగ్స్ అమ్మాడు అని కూడా ఒక వ్యక్తితో అబద్ధం చెప్పిస్తారు. అయితే ఈ క్రమంలో జానకి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని జడ్జిని కోరుతుంది. అయితే మొదట ఆమె మాటలను పెద్దగా పట్టించుకోరు. కానీ జానకిపై నమ్మకంతో ఆ తర్వాత జడ్జి ఆమెకు మాట్లాడే అవకాశం ఇస్తాడు. ఆమె జరిగిన విషయాన్ని మొత్తం చెబుతుంది. మొదట మర్డర్ చేసిన మధుకర్ పెన్ డ్రైవ్ వీడియోలు చూడండి అని అంటుంది.

భర్తను నిర్దోషిగా తీసుకువచ్చిన జానకి:దీంతో జడ్జి ఈ మర్డర్ కి రామచంద్ర డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం ఉంది అని అడగడంతో కావాలని నన్ను ఇరికించడానికి ఎస్సై మనోహర్ అలాగే బిల్డర్ కలిసి నా భర్తను ఇరికించారు అని చెప్పడంతో జడ్జి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రామచంద్రపై అబద్ధం సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు అని చెబితే ఈ అబద్ధం ఆడాను అని రామచంద్ర బండిలో డ్రగ్స్ ఎస్సై గారు చెబితేనే పెట్టాను అని నిజం చెప్పడంతో చివరికి జడ్జి రామచంద్ర నిర్దోషి అని చెబుతాడు. ఇక ఎస్ఐ మనోహర్ ను సస్పెండ్ చేస్తూ మర్డర్ చేసిన మధుకర్ పై కూడా కేసు నమోదు చేయాలి అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తారు. ఇక జానకి ఎంతో సంతోషంగా భర్తను ఇంటికి తీసుకు వెళుతుంది. ఇక అత్తగారు ఆమెను చూసి చాలా సంతోషపడతారు. నేను కూడా ఇకనుంచి మీ బిడ్డనే అంటూ జానకి ఆప్యాయంగా మాట్లాడుతుంది. దీంతో జ్ఞానాంబ జానకిని దగ్గరకు తీసుకొని సంతోషపడుతుంది. మరి ఈ పరిస్థితుల తర్వాత మల్లిక ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











