Janaki Kalaganaledu May 12th: దెబ్బ తిన్న పులిలా మారుతున్న మనోహర్.. జానకి జీవితానికి మరో ఛాలెంజ్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు విభిన్నమైన కథాంశంతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 577 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

ఉద్యోగానికి అడ్డుగా ఉంది అని..:జానకి తన ఉద్యోగానికి అడ్డుగా ఉంది అని ఆమె న్యాయం అంటూ చాలా ఇబ్బంది పెడుతోంది అని అందుకే ఉద్యోగంలో నుంచి తీసివేయాలి అని మనోహర్ అనుకుంటాడు. ఇక అంతేకాకుండా హత్య చేసిన బిల్డర్ ను కూడా కేసు నుంచి కాపాడాలని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో జానకి అడ్డుగా ఉంది అని ఆమె భర్తను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించి ఇబ్బంది పడుతూ ఉంటాడు. నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి అంటే ఈ ఉద్యోగాన్ని వదిలేయాలి అని ఎస్ఐ మనోహర్ చెప్పడంతో జానకి కొంత భయపడుతుంది. ఇక జానకి అత్తగారు కూడా ఈ విషయంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నీ కారణంగా కుటుంబం ఇబ్బంది పడుతోంది అని రామచంద్ర చాలా కష్టాలు పడుతున్నాడు అని చెప్పడంతో జానకి కాస్త ఆలోచిస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 12th Episode 577

మీరు న్యాయం ప్రకారం ముందుకు సాగాలి:అయితే ఆమె భర్త రామచంద్ర మాత్రం జానకికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా మీరు న్యాయం ప్రకారం ముందుకు సాగాలి అని చెప్పడంతో జానకి ధైర్యంగా ముందడుగు వేస్తుంది. ఇక కోర్టు వరకు వెళ్లి అక్కడ భర్తను నిర్దోషిగా నిరూపిస్తుంది. అంతేకాకుండా మర్డర్ చేసిన మధుకర్ కు సంబంధించిన వీడియోను కూడా కోర్టుమందు సాక్షాలుగా చూపిస్తూ అతనిని అరెస్టు అయ్యేలా చేస్తుంది. ఇక ఎస్ఐ మనోహర్ మధుకర్ కు సపోర్ట్ చేసినందుకు గాను మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మొత్తానికి తన భర్త రామచంద్రను జానకి ఇంటికి తీసుకువస్తుంది. ఇక కొడుకును చూడగానే తల్లి ఎంతగానో సంతోషపడుతుంది. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో రామచంద్ర జానకి గొప్పతనం గురించి చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 12th Episode 577

జానకి గొప్పతనం:జానకి వల్ల ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అని తను కోర్టులో మాట్లాడిన విధానం చూస్తే మీరు ఆశ్చర్యపోయేవారు అని, అంతేకాకుండా తప్పు చేసిన వారికి ఆమె శిక్ష పడేలా చేసింది అని రామచంద్ర చెబుతూ ఉంటాడు. ఇక ఇక గోవిందరాజులు కూడా జానకి గొప్పతనం గురించి నాకు ముందే తెలుసు అంటూ తప్పకుండా తన భర్తను కాపాడుకుంటుంది అని నమ్మకం ఉందని, ఇప్పుడు అది రుజువయింది అని గోవిందరాజులు అంటాడు. ఇక రామచంద్ర తల్లి జానకి కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఇన్ని రోజులు నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమీ అనుకోకు అని ఆమె కృతజ్ఞతలు చూపిస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 12th Episode 577

మనోహర్ దెబ్బతిన్న పులి:అయితే నేను కూడా మీ బిడ్డలాంటి దాన్నే అని ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబానికి ఇబ్బంది కలగనివ్వను అని ఆమె చెబుతుంది. ఇక మరోవైపు మల్లిక మాత్రం జానకి గెలుపును చూసి తట్టుకోలేక పోతుంది. ఈ తరుణంలో జానకి భర్తను బాగానే కాపాడుకుంది. కాకపోతే ఇప్పుడు ఎస్ఐ మనోహర్ దెబ్బతిన్న పులి అని, అసలే ఇతను రాక్షసుడు అని జానకిని ఏమాత్రం విడిచిపెట్టడు అని మల్లిక చెబుతూ ఉంటుంది. ఇక నిజంగానే ఎస్ఐ మనోహర్ జానకిపై పగను తీర్చుకోవాలని కసిగా ఉంటాడు. అతను అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఎంతగా దెబ్బ కొట్టిందో అంతకంతకు ఎక్కువ రివెంజ్ తీసుకుంటాను అని చెబుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 12th Episode 577

చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ..:అయితే ఇప్పుడు మీ టైం బాగోలేదు అని కాస్త సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని అతను చెప్పడంతో మనోహర్ మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు అంటూ సీరియస్ అవుతూ ఉంటాడు. తనను ఉద్యోగం నుంచి తొలగించాలి అనుకుంటే ఇప్పుడు నాకు ఉద్యోగం లేకుండా చేసింది అని అంత ఈజీగా జానకిని వదిలిపెట్టను అని తన కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెడతాను అని చెబుతాడు. ఇక మరోవైపు జానకి తన భర్తను కౌగిలించుకొని ఏమాత్రం వదలకుండా అలానే పట్టుకుంటుంది. ఇక రామచంద్ర కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే జానకి మాత్రం తనకు ఇన్ని రోజులు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడకండి అని అంతా మంచి జరుగుతుంది అని ఎలాంటి కష్టాలు వచ్చిన కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెబుతాడు. మరి జానకి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X