Janaki Kalaganaledu May 11th: జ్ఞానాంబ కుటుంబంలో కొత్త సంతోషం.. జానకి మాత్రం బాధలోనే..

జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కథాంశంతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 578 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

మల్లిక తల్లి కాబోతున్నట్లుగా చెప్పడంతో..: డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తన భర్తను మొత్తానికి జానకి నిర్దోషిగా బయటకు తీసుకువస్తుంది. ఈ క్రమంలో అందరూ కూడా ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. అయితే రామచంద్ర తిరిగి వచ్చిన సంతోషంలో ఉండగా అప్పుడే ఒక శుభవార్త కూడా అందుతుంది. మల్లికా వాంతులు చేసుకోవడంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తారు. అయితే డాక్టర్ వచ్చి మల్లిక తల్లి కాబోతున్నట్లుగా చెప్పడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడతారు. ఈ శుభ సందర్భంలో మనందరం ఒక పండగ చేసుకోవాలి అని గోవిందరాజులు కూడా అనుకుంటాడు. అయితే అప్పుడే లీలావతి మాత్రం చెడుగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంది.

Janaki Kalaganaledu May 11th

కరెక్ట్ కాదు అన్నట్లుగా: జానకి ఇక్కడ ఎందుకు లేదు అని అడగడంతో అందరూ కూడా కొంత షాక్ అవుతారు. అయితే మల్లిక నెలతప్పడం వలన తట్టుకోలేకపోతోంది అని ఈ విషయంలో జానకి ఆలోచించే విధానం ఏ మాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అయితే మరోవైపు రామచంద్ర మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక బయట నిలబడి ఉన్న జానకి కాస్త ఆవేదన చెందుతూ ఉంటుంది. అయితే ఇంతలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ జానకిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఏమాత్రం బాధపడవద్దు అని నీకు కూడా తల్లి అయ్యే భాగ్యం త్వరలోనే దక్కుతుంది అని అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది అంటూ అత్తగారు చెప్పడంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది.

Janaki Kalaganaledu May 11th

మల్లిక మరో గోల: అయితే మల్లిక తల్లి అయిన సందర్భంగా అందరూ కూడా సంతోషంగా స్వీట్స్ తింటూ ఉంటారు. ఈ క్రమంలో గుడి దగ్గర ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని అంటారు. కానీ ఆ భోజనాలు ఏర్పాటు చేసింది రామచంద్ర జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చినందుకు అని లీలావతి గొడవ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మల్లిక కూడా అదే విషయాన్ని అడుగుతుంది. అవును ఇక్కడ అందరినీ సమానంగా చూడరు అని, నాకు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అని బాధపడుతున్నట్లుగా మాట్లాడుతుంది. ఇక్కడ జానకికి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు అని అనడంతో గోవిందరాజులు మాత్రం అలా ఎవరికీ జరగదు అని అందరూ ఇక్కడ సమానమే అని అంటాడు.

Janaki Kalaganaledu May 11th

గొడవ అలా కొనసాగుతున్న సమయంలోనే..: ఇక మళ్ళీ ఆ తర్వాత జానకి వచ్చి మల్లిక చెప్పినట్లుగా అన్నదానం జరిపించండి అని అనడంతో, మళ్లీ ఇప్పుడు వచ్చి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్లుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక వీరి గొడవ అలా కొనసాగుతున్న సమయంలోనే గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా మరొక నిర్ణయం తీసుకుంటారు. మాకు ఏదైనా సరే అన్ని సంతోషమైన వేడుకలు అంటూ.. మళ్లీ మరోసారి మల్లిక కోసం భారీ స్థాయిలో అన్నదానం జరిపిస్తాము అని చెబుతారు. అయితే ఈ క్రమంలో నీలావతిని అనవసరంగా గొడవలు సృష్టించవద్దు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ మల్లిగా ఆమెను ఆపేసి ఇక్కడ నా కోసం మాట్లాడే ఒకే ఒక్క ఒక్కరు నీలావతి పెద్దమ్మ అంటూ.. ఆమెను కూడా బయటికి పంపించేస్తారా అని అడుగుతుంది. ఇక ఆ విషయంలో అందరూ కూడా మళ్లీ మౌనంగా ఉంటారు.

Janaki Kalaganaledu May 11th

జానకి కంటే ముందు తల్లి అవుతున్నందుకు..: ఇక మల్లికతో చాలా ప్రత్యేకంగా మాట్లాడిన నీలావతి ఈసారి కూడా నువ్వు గర్భవతి అయినట్లుగా నాటకం ఆడుతున్నావేమో అని అనుకున్నాను. కానీ మొత్తానికి సాధించావు అని, నువ్వు తల్లి అయినందుకంటే కూడా జానకి కంటే ముందు తల్లి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నిలావతి మాట్లాడుతుంది. అంతే కాకుండా మల్లిక కూడా అదే విధంగా మాట్లాడుతూ.. జానకి కంటే ముందుగానే పిల్లలను కనాలని అనుకున్నాను అంటూ ఆమెకు అసలు పిల్లలు కావద్దు అని నువ్వు ఆ దేవుడిని గుడికి వెళ్లి పూజలు చేయించు అనే మల్లికా మాట్లాడుతుంది. దీంతో జానకి వారి మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అయితే జానకి రామచంద్ర ఇద్దరినీ కూడా ఒక రెండు మూడు రోజులు వేరే ఊరికి వెళ్లాల్సిందిగా జ్ఞానాంబ ఆదేశిస్తుంది. మీ పెద్దమ్మ దగ్గర పూజ జరుగుతుంది అని మీరు ఇద్దరు కూడా అక్కడికి వెళ్లాలి అని రామచంద్రకు చెబుతుంది. మరి రామచంద్ర జానకి ఎక్కడికి వెళతారో తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X