Janaki Kalaganaledu May 16th: ప్రయాణంలో జానకి రొమాంటిక్ అల్లరి.. టెన్షన్ పడిన రామచంద్ర!
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథాంశంతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 579 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

జానకి, రామ ఊరికి వెళ్ళాలి: రామచంద్ర డ్రగ్స్ కేసు నుంచి బయటపడడంతో తల్లి జ్ఞానాంబతో పాటు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే అదే సమయంలో జానకి రామచంద్ర ను బానమ్మ ఊరికి పంపించాలి అని జ్ఞానాంబ అనుకుంటుంది.
మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం జరుగుతోంది అని అందుకోసం జానకి నువ్వు తప్పకుండా వెళ్లాలి అని రామచంద్ర కు చెబుతుంది. అయితే వాళ్లు మాత్రమే ఎందుకు వెళ్లాలి మేము ఎందుకు వెళ్ళకూడదు అంటూ మల్లికా అత్తగారిని ప్రశ్నిస్తుంది. ఇది పెద్దవాళ్ళు చేసేది అని అయినా నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు కాబట్టి ఎక్కడికి వెళ్లకూడదు అని అంటాడు.

తన నోరు ముయిస్తారని: అయితే ఈ క్రమంలో మల్లికకు అడ్డుపడేందుకు గోవిందరాజులు ప్రయత్నం చేస్తారు. దీంతో హర్ట్ అయిన మల్లిక ప్రతీసారి తన నోరు ముయిస్తారని అసలు తనకు ఇంట్లో విలువ లేదు అని అలిగినట్లుగా మల్లికా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అయితే రామచంద్ర కూడా మల్లిక చెప్పినట్లుగానే చేయమని తన తల్లికి చెపుతాడు.
అయినప్పటికీ కూడా ఇది తప్పనిసరిగా మీరు మాత్రమే చేయాలి అని వెంటనే ఊరికి బయలుదేరండి అని తల్లి చెబుతుంది. దీంతో రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా వారి పెద్దమ్మ ఇంటికి బయలుదేరుతారు. అయితే మధ్యలో రామచంద్ర జానకి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు తిరుగుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు.

ఆట పట్టించే ప్రయత్నం: ముఖ్యంగా జానకి రామచంద్రను ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. ఇక రామచంద్ర మాత్రం తన అమాయకత్వపు మాటలతో జానకిపై కాస్త చిరాకు తెప్పించే ప్రయత్నం చేస్తాడు.
అయినప్పటికీ కూడా ప్రేమగా జానకి తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమె ఒక కొండపైకి ఎక్కి ఐ లవ్ యు రామచంద్ర గారు అంటూ చెప్పడంతో రామచంద్ర ఎంతగానో హ్యాపీగా ఫీలవుతూ ఉంటాడు. అయితే వెళ్లి జానకిని కలవాలని అనుకున్నప్పటికీ అక్కడ ఆమె కనిపించదు. దీంతో కొంతసేపటి వరకు రామచంద్ర కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెనకాల నుంచి వచ్చిన జానకి రామచంద్రను కాస్త భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.

నా కొడుకు రామచంద్ర వస్తున్నాడు: ఇక ఆ సరదా మూమెంట్స్ తర్వాత దానికి రామచంద్ర మెల్లగా బానమ్మ ఇంటికి బయలుదేరుతారు. అయితే ఈ క్రమంలో రామచంద్ర కోసం ఆమె పెద్దమ్మ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి వచ్చి ఎవరికోసమే ఎదురు చూస్తున్నావు అంటూ అడుగుతాడు. అయితే చిరాకుల్లో ఉన్న ఆమె ఎవరికోసమైతే నీకెందుకు అని ఊరి నుంచి నా కొడుకు రామచంద్ర వస్తున్నాడు అని ఆమె చెబుతుంది.
ఎప్పుడో పండగకు గాని రాని నీ రామచంద్ర కోసం ఇంతగా ఎదురు చూస్తున్నావా అంటూ అతను కొంత తక్కువ చేసి మాట్లాడడంతో వెంటనే బానమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీ మూతి మొగలిరేకంతా అవుతుంది అంటూ అతనికి హెచ్చరిస్తోంది. దీంతో అతను అక్కడి నుంచి బయపడి పారిపోతాడు.
కావాలని అలా మాట్లాడిన రామ: ఇక ఆ తర్వాత ఆమె రామ కోసం అటూ ఇటూ నడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రామచంద్రా దూరం నుంచి బాణమ్మను చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు. అంతేకాకుండా ఆమెను ఆటపట్టించాలని అనుకుంటాడు. అయితే బానమ్మను చూసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. ఇక బానమ్మా వెంటనే పరిగెత్తుకుంటూ రామచంద్రను ఆపే ప్రయత్నం చేస్తుంది.
ఇక ఆగిన రామచంద్ర ఎవరు నువ్వు అంటూ అడగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిన్ను చిన్నప్పుడు పెంచిన దాన్ని అప్పుడే మర్చిపోయావా అని అడగడంతో రామచంద్ర మళ్లీ ఆలోచిస్తున్నట్లుగా నాటకం ఆడుతాడు. అప్పుడు రామచంద్ర గుర్తుపట్టినట్లుగా మాట్లాడుతూ కాస్త మారిపోయావు అని అందుకే గుర్తుపట్టలేదు అని అనడంతో బానమ్మ ఒక్కసారిగా అలుగుతుంది.
ముద్దు కావాలి అంటూ: నన్ను మర్చిపోతావులే.. అసలు నన్ను ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అని ఆమె అలక చెందడంతో రామచంద్ర బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర జానకిని ఇద్దరినీ కూడా ఆప్యాయంగా లోపలికి పిలిచిన బానమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒక దగ్గర కూర్చున్న రామ, జానకి ఇద్దరు కూడా రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రామచంద్ర అయితే జానకి ముద్దు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. కానీ దానికి మాత్రం కొంటె చూపులతో అతని కవ్విస్తూ ఉంటుంది.
ఇక చివరికి ముద్దు ఇస్తున్న సమయంలో అప్పుడే బానమ్మా పిలుస్తుంది. ఇద్దరు కూడా రెస్ట్ తీసుకోండి అని రేపు మన ఊర్లో జాతర ఉంది అని అమ్మవారి కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రసాదాలు కూడా సిద్ధం చేయాలి అని చెబుతుంది. ఇక జానకి అందుకు సిద్ధమవుతుంది. మరోవైపు మల్లిక వలన ఇంటిదగ్గర జ్ఞానాంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పటికే ఆమె కింద పడి ఒకసారి కడుపు పోగొట్టుకుంటుంది. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుతూ ఆమె చూసుకోకుండా నడుస్తుంది. అయితే కింద పడిపోతున్న సమయంలోనే జ్ఞానాంబ గట్టిగా అరుస్తుంది. మరి మల్లిక పరిస్థితి ఎలా ఉందో తెలియాలి అంటే తదిపురి ఎపిసోడ్లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











