Janaki Kalaganaledu May 17th: తోటలో రామ, జానకి స్వీట్ రొమాన్స్.. మల్లికకు అత్తగారి చివాట్లు

జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 580 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

చాలా ఇబ్బందుల తర్వాత..:ఇంటి కోడలిగా జానకి ఒకవైపు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే మరోవైపు పోలీస్ బాధ్యతలో కూడా చాలా న్యాయంగా నడుచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన ఐపీఎస్ చదువును కూడా కొనసాగించాలని అనుకుంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది. అయితే ఆమెకు భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహాయపడుతూ ఉంటాడు. ఇక చాలా ఇబ్బందుల తర్వాత రామా జానకి సంతోషంగా గడిపే సమయం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా అత్తగారు కొడుకు కోడలిని మరొక ఊరికి పంపిస్తారు. రామచంద్ర చిన్నప్పుడు తన పెద్దమ్మ బానమ్మ దగ్గర పెరిగాడు కాబట్టి అక్కడే ఒక రెండు రోజులు ఉండి వస్తాడు అని ఆమె నిర్ణయం తీసుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 17th Episode 580

దాన్ని కొడితే మీరు ఐపీఎస్ అయిపోయినట్లే:ఇక రామచంద్ర తన పెద్దమ్మ దగ్గరికి వెళ్లిన తర్వాత జానకితో ఎంతో సంతోషంగా ఉంటాడు. మధ్య మధ్యలో ఆటలు ఆడుతూ చాలా రొమాంటిక్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరోవైపు జానకి కూడా అదే తరహాలో భర్తను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక తోటలో ఉన్న మామిడికాయ కావాలి అని జానకి తన భర్త రామని అడుగుతుంది. అయితే తనకు కింద ఉన్న మామిడికాయ వద్దు అని, పైన ఆ చివరలో ఉన్న మామిడికాయ కావాలి అని చెబుతోంది. దీంతో రామచంద్ర జానకికి ఒక టార్గెట్ ఇస్తాడు. ఆ మామిడికాయను మీరు ఒక ఐపీఎస్ టార్గెట్ అనుకోండి. కింద ఉన్న రాయితో దాన్ని కొడితే మీరు ఐపీఎస్ అయిపోయినట్లే అని ఆమెను ఉత్తేజపరుస్తూ ఉంటాడు. దీంతో జానకి మొదట రెండు రాళ్లతో కొడుతుంది. కానీ తగలదు. ఫైనల్ గా మూడోసారి కొట్టండి అని అడగడంతో జానకి ఎంతో ఫోకస్ చేసి కొడుతుంది. అప్పుడు ఆ రాయి తగలడంతో మామిడి పండు కింద పడుతుంది. ఇక ఆ విషయంలో జానకి తన భర్తతో ఎంతో సంతోషపడుతూ మాట్లాడుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 17th Episode 580

నువ్వే వండి పెట్టాలి:ఇక తర్వాత సరదాగా నవ్వుకుంటూ వాళ్లు వారి పెద్దమ్మ ఇంటికి వస్తారు. అయితే అక్కడ వారి కోసం ఎదురు చూస్తున్న బానమ్మ వారిని చూసి ఎంతో ముచ్చట పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పనస పండు ఇచ్చి దీనితో కూర చేయాలి అని కూడా ఆమె చెబుతుంది. అయితే తనకు పనసపొట్టు కూడా తీయడం రాదు అని ఇక కూర ఏమి చేస్తాను అని అంటుంది. ఇక తప్పనిసరిగా చేయాల్సిందే అని అది రామచంద్ర కు ఎంతో ఇష్టమని ఆమె చెబుతుంది. ఇక జానకి కి రామచంద్ర సహాయం చేసి పనసపొట్టు తీయడం నేర్పిస్తాడు. ఇక తర్వాత వారి పెద్దమ్మ ప్రత్యేకంగా ఆ వంటకాన్ని వండి పెడుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 17th Episode 580

మల్లికకు చివాట్లు:అయితే మరోవైపు జ్ఞానాంబ ఇంట్లో చిన్న కోడలు మల్లికా లిమిట్స్ దాటి వర్తించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఆమెను ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని ముందుగానే ఇంట్లో పనివాడు అయిన మలయాళం కు ఆదేశాలు జారీ చేస్తారు. ఇక మలయాళం కూడా తన బాధ్యత అంటూ కామెడీగా ఆమెకు ఫోకస్ చేస్తూ ఉంటాడు. అయితే మల్లికా ఎవరికి తెలియకుండా చికెన్ ఆర్డర్ చేసుకుంటుంది. అయితే దాన్ని చూసిన మలయాళం వెంటనే ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెబుతాడు. ఇక ఆమె వచ్చి మల్లికపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 17th Episode 580

తోటలో రొమాంటిక్ గా మారిన రామ:నీకు ప్రత్యేకమైన ఒక మందు ఇచ్చాను ఒక రోజు వరకు కూడా ఎలాంటి మాంసం ముట్టుకోవద్దని చెప్పాను కదా అయినా కూడా నువ్వు లెక్క చేయడం లేదు అని అసలు నువ్వు కడుపుతో ఉన్నావని ఇలాంటి సమయంలో ఇలా చెప్పిన మాట తప్పడం కరెక్ట్ కాదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇక మరోవైపు బాణమ్మ రామచంద్ర జానకి ఇద్దరిని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటుంది. వారికి ప్రత్యేకంగా వంట చేసి వడ్డించి పెడుతుంది. ఇక ఆ సమయంలో రామచంద్ర జానకి తో ఎంతో సరదాగా ఉంటాడు. ఇక ప్రత్యేకంగా వారు తోటలో పడుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో రామచంద్ర చాలా రొమాంటిక్ గా కూడా మారిపోతాడు. మరి జానకి అత్తగారికి ఎలాంటి శుభవార్త చెబుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X