Janaki Kalaganaledu May 19th: మల్లెపూల మంచంపైన జానకి.. రొమాంటిక్ మూడ్ లో రామ!

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.82 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 583 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

అల్లరిగా ప్రేమగా ఉండాలి: జానకి రామచంద్ర ఇద్దరు కూడా వారి పెద్దమ్మ బానమ్మ ఇంటి దగ్గర ఎంతో అందంగా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఆ జంటను చూసిన బానమ్మ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. భార్యాభర్తలు అన్న తర్వాత ఇలా అల్లరిగా ప్రేమగా ఉండాలి అని చెబుతూ ఉంటుంది. జానకి కూడా అత్తగారి మీద ప్రేమతో ఇష్టంగా తన చేతితో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె అందుకు మరింత ఆనందపడుతూ ఉంటుంది. అయితే మరోవైపు ఇంటిదగ్గర కొడుకు రామచంద్ర విషయంలో తల్లి జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. రామచంద్ర కు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తన ఇద్దరి తమ్ముళ్లకు కూడా ఇప్పుడు తండ్రి అయ్యే భాగ్యం దొరికింది అని, కానీ ఇంకా రామచంద్రకు ఆ అదృష్టం కలగలేదు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది.

Janaki Kalaganaledu May 19th

జానకి, రామచంద్ర సంతోషం కోరుకునే భార్య: అయితే ఆమె భర్త గోవిందరాజులు మాత్రం తప్పకుండా రామచంద్రకు మంచే జరుగుతుంది అని కాకపోతే కొంతకాలం సమయం పట్టవచ్చు అని ఆయన అంటూ ఉంటారు. తప్పకుండా జానకి రామచంద్ర సంతోషం కోరుకునే భార్య అని ఆ విషయం చాలా సార్లు తాను రుజువు చేసింది అని అంటాడు. ఇక రామచంద్ర పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా తనే ధైర్యంగా నిలబడి బయటకు తీసుకువచ్చింది అని గోవిందరాజులు తన భార్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా బానమ్మ దగ్గరికి వెళ్లిన రామచంద్ర జానకి మంచి శుభవార్తతో తిరిగి వస్తారు, వాళ్లు తల్లిదండ్రులు కావాలనే నువ్వు పంపించావు అని నాకు అర్థమైంది అని చెబుతాడు.

Janaki Kalaganaledu May 19th

దొంగ చాటుగా రెండవ కోడలు: ఇక ఆ విషయాన్ని దొంగ చాటుగా రెండవ కోడలు మల్లిక వింటుంది. వెంటనే తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆమె చిరాకుగా కనిపిస్తూ ఉంటుంది. భర్తను కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. నా బాధ మీకు అర్థం అవుతుందా అని అనడంతో ఏం జరిగింది అని అడుగుతాడు. మీ అన్న వదిన తల్లిదండ్రులు కావాలి అని మీ అమ్మానాన్నలు మన మీద కంటే వాళ్లపైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అని అంటుంది. కానీ ఎలాగైనా సరే నేను పిల్లలను కనాలి అని అనుకుంటున్నారు మల్లిక చెబుతుంది. ఇక అనవసరంగా నువ్వు పక్కవారి గురించి ఆలోచించవద్దని, ఎదుటివారి సంతోషం కోరుకుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటామని విష్ణు అంటాడు.

Janaki Kalaganaledu May 19th

అమ్మగారికి కూడా కూల్ అవ్వడానికి..:అయినప్పటికీ కూడా మల్లిక అతని మాటలు పట్టించుకోదు. అయితే ఇక కొద్దిసేపటి అనంతరం విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే మలయాళం వచ్చి కాఫీ ఇస్తాడు. మీ అమ్మగారికి కూడా కూల్ అవ్వడానికి ఏదైనా చల్లగా తెచ్చి ఇవ్వమని కౌంటర్ ఇస్తాడు. ఇక తర్వాత బానమ్మ దగ్గర ఉన్నా జానకి రామచంద్ర ఊహించిన విధంగా ఒక సర్ప్రైజ్ చూస్తారు. మొదట ఆమె మీరు ఇంట్లో పడుకోవద్దు పెరట్లో పడుకోవాలి అని చెబుతుంది. అయితే కొంతసేపటి వరకు జానకి రామచంద్ర విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

Janaki Kalaganaledu May 19th

పూల మంచంతో అందంగా..: చెబుతున్నాను కదా వెళ్లి పడుకోండి అని బానమ్మ గట్టిగా చెప్పడంతో రామచంద్ర జానకి పేరట్లోకి వెళతారు. అయితే అక్కడ మాత్రమే ఏదో చాప ఉంది అని అనుకుంటాడు రామచంద్ర. కానీ అక్కడ పూల మంచంతో అందంగా రొమాంటిక్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీంతో అసలు విషయం రామచంద్రకు అర్ధమవుతుంది. కానీ జానకి మాత్రం ఏమీ అర్థం కానట్లుగానే నాటకం ఆడుతూ ఉంటుందే. కాసేపు రామచంద్రను ఆటపట్టించాలని కూడా ఆమె ఆలోచిస్తుంది. ఇక రామచంద్ర కు మాత్రం ఆ వెన్నెల్లో రొమాంటిక్ గా మూడ్ వస్తుంది అని అంటాడు. కానీ జానకి మాత్రం మొదట ఏమీ తెలియనట్లుగా రామచంద్రను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక బానమ్మ చేత కూడా రామచంద్ర తిట్లు తిట్టిస్తుంది. ఇక చివరికి రామచంద్ర జానకి జానకి నాకు మూడ్ వస్తుంది అని చెప్పడంతో అతను చాలా సంతోషపడతాడు. మరి ఫైనల్ గా జ్ఞానాంబ కోరుకుంటున్నట్లుగా జానకి శుభవార్తతో ఇంటికి వస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X