Janaki Kalaganaledu May 1st: కొడుకు కేసులో నిజం తెలుసుకున్న జ్ఞానాంబ.. ప్రమాదానికి ఎదురుగా జానకి!

జానకి కలగనలేదు ఊహించని విధంగా సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తిగా మారుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. కానీ కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 567 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

ఏ తప్పు చేయకపోయినా కూడా..:ఏ తప్పు చేయకపోయినా కూడా రామచంద్ర డ్రగ్స్ కేసులో కావాలని ఎస్ఐ మనోహర్ అరెస్టు చేస్తాడు. ఇక జానకికి ఆ విషయం తెలుసు. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రామచంద్రను ఏ తప్పు చేయకపోయినా కూడా అరెస్టు చేయడం అన్యాయమని అతనిని ఎలాగైనా జానకి విడిపిస్తుంది అని ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఆమె మాత్రం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మర్డర్ చేసిన బిల్డర్ ను ఒక కేసులో ఇరికించాను అని కావాలని పగతో ఈ విధంగా చేస్తున్నాడు అని జానకి అంతా గమనిస్తుంది. ఇక ఈ విషయం తెలియక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అసలు రామచంద్రను ఎందుకు పోలీస్ స్టేషన్ కు వెళుతున్నాడు అనేది అర్థం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా తల్లి జ్ఞానాంబ అయితే కొడుకు కోసం ఎంతగానో ఆరటపడుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 1st Episode 567

రామచంద్ర పూర్తిగా ఇక్కడే ఉంటాడు అని..:అకిల్ కొడుకు బారసాలు ఉండడంతో అతి కష్టం మీద జానకి బెయిల్ మీద తన భర్తను ఇంటికి తీసుకువస్తుంది. ఇక కొడుకు మళ్లీ ఇంటికి వచ్చాడు అని తల్లి ఎంతగానో ఆనందపడుతుంది. కానీ రామచంద్ర పూర్తిగా ఇక్కడే ఉంటాడు అని మాత్రం జానకి అత్తకు చెప్పదు. ముందుగా తండ్రి గోవిందరాజులు అలా చెప్పవద్దు అని జానకి దగ్గర మాట తీసుకుంటాడు. ఇక సంతోషంలో ఉన్న జ్ఞానాంబ కొడుకు కోసం ఉదయాన్నే అన్ని భోజనాలు రెడీ చేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా టిఫిన్ రెడీ చేయడంతో రామచంద్ర సంతోషపడతాడు ఇక కొడుకు ప్రేమలో పడి నన్ను కూడా పట్టించుకోవడం లేదు అని భర్త గోవిందరాజులు కూడా సరదాగా మాట్లాడుతుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 1st Episode 567

ఆనందంగా ఉన్న సమయంలో:ఇక అందరూ కూడా ఆనందంగా ఉన్న సమయంలో రెండవ కోడలు మల్లిక వచ్చి ఊహించని విధంగా మాట్లాడుతుంది. ఇక జ్ఞానాంబ కొడుకు మళ్లీ ఇక్కడే ఉంటాడు అని అనుకుంటున్నా సమయంలో మల్లిక వచ్చి అసలు నిజం చెబుతుంది. మీకు ఈ నిజం చెప్పారేమో అనుకున్నాను అంటూ ఇప్పుడు బావగారు వచ్చింది కేవలం బెయిల్ మీద మాత్రమే అని మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది అని మల్లిక చెబుతుంది. దీంతో తల్లి జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అంటే నాకు అబద్ధం చెప్పారు అని బాధ పడుతూ ఉంటుంది. నీ పోలీసు బుద్ధులు అమాయకురాలి మీద ప్రయోగించడం కాదు. ముందు రామచంద్రను ఎలా బయటకు తీసుకురావాలో ఆలోచించమని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 1st Episode 567

మరోసారి మాట్లాడేందుకు వెళతాడు:ఆమెకు నచ్చే చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా మాట్లాడదు. ఇక బాధపడుతూ జ్ఞానాంబ బయట వెళ్లి కూర్చుంటుంది. ఇక ఆమె కోపం తగ్గించాలి అని కొడుకు రామచంద్ర మరోసారి మాట్లాడేందుకు వెళతాడు. అయితే నీ భార్య గురించి మాత్రం ఇక్కడ నాతో ఎలాంటి మాటలు మాట్లాడకు అని ఆమె ముందు గానే హెచ్చరిస్తుంది. కానీ రామచంద్ర మాత్రం మీ కంటే ఎక్కువగా జానకి గారు చాలా బాధపడుతున్నారు అని ఆమె నన్ను ఇక్కడికి తీసుకురావాలి అని నిరంతరం ఎంతగానో కష్టపడుతున్నారు అని తల్లికి గుర్తు చేస్తాడు. ఇక ఆ విషయంలో జ్ఞానాంబ కొంత కూల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని ఏ తప్పు చేయకపోయినా కూడా నిన్ను అరెస్టు చేశారు అని అందుకే నాకు చాలా బాధగా ఉంది అంటూ తల్లి మాట్లాడుతుంది.

Janaki Kalaganaledu

అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది:తప్పకుండా నేను మళ్ళీ కడిగిన ముత్యంలా నిర్దోషిగా తిరిగి వస్తాను అని రామచంద్ర తల్లికి మాట ఇస్తాడు. ఇక మరోవైపు జానకి బిల్డర్ నుంచి ఎలాగైనా రామచంద్రను తప్పించాలి అని అనుకుంటుంది. అయితే అదే సమయంలో జానకిని బెదిరించాలని బిల్డర్ మధుకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక జానకి ఆ సమయంలో ఫోన్ ఎత్తదు. ఇక మధుకర్ ఎస్సై మనోహర్ కు ఫోన్ చేసి సీరియస్ అవుతూ ఉంటాడు. జానకి ఇంకా మనం చెప్పిన మాట వినడం లేదు అని కేసు నుంచి తప్పుకోవడం లేదు అని అతను చెప్పడంతో నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ ఎస్ఐ మనోహర్ చిరాకు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జానకి డైరెక్టుగా బిల్డర్ తోనే తేల్చుకోవాలని అనుకుంటుంది. ఇక బిల్డర్ హెచ్చరికలు కూడా చేసినా.. జానకి ఏ మాత్రం తగ్గదు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ ఛాలెంజ్ విసురుతుంది. మరి ఈ కేసు నుంచి భర్తను ఆమె ఎలా బయటపడేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X