Janaki Kalaganaledu May 23rd: పుట్టబోయే కొడుకు కోసం జానకి కలవరం.. మరోవైపు ఎస్ఐ సవాల్?

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.82 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 586 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 May 23rd Episode 2023

ప్రేమను పెంచుకున్న బానమ్మ: రామచంద్ర జానకి ఇద్దరు కూడా వారి పెద్దమ్మ బాణమ్మ దగ్గర ఎంతో సంతోషంగా ఉంటారు. ఆమె ఊర్లో జాతర కావడంతో అమ్మవారికి ప్రత్యేకంగా పూజ కూడా చేయిస్తుంది. ముఖ్యంగా జానకి రామచంద్ర ప్రతి పూజలో కూడా పాల్గొనాలి అని బాణమ్మ చెబుతుంది. ఇక అందుకు తగ్గట్టుగానే రామచంద్ర జానకి ఇద్దరు కూడా పూజలో పాల్గొని గుడిలోనే నిద్ర చేస్తారు.

ఎలాగైనా వారికి పుల్లలు పుట్టేలా ఆశీర్వదించాలి అని జ్ఞానాంబ మరోవైపు ఇంటి నుంచి దేవున్ని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక రామా జానకి ఇద్దరు కూడా ఒకవైపు సరదాగా ఉంటూనే మరొకవైపు బాణమ్మతో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. వారిపై బానమ్మ కూడా చాలా ప్రేమను పెంచుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 23rd Episode 2023

అతని నుంచి తప్పించుకోవడానికి: ఇక జ్ఞానాంబ ఇంట్లో గోవిందరాజులు అలాగే పనివాడు మలయాళం మధ్యలో ఒక అల్లరి మొదలవుతుంది. తనకు ఎంతో ఇష్టమైన రేడియోను పనివాడు మలయాళం పగలకొట్టాడు అని అది రావట్లేదు అని ఆగ్రహంతో కొట్టడానికి గోవిందరాజులు పరిగెత్తుతూ ఉంటాడు. ఇక అతని నుంచి తప్పించుకోవడానికి మలయాళం నేను ఎలాంటి తప్పు చేయలేదు అయ్యగారు అంటూ పరిగెత్తుతూ ఉంటాడు.

ఈ క్రమంలో వారిని చూసి మల్లిక కూడా ఎంతగానో నవ్వుతుంది. ఇక చివరికి మలయాళం జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి నేను అసలు ఆ రేడియోను పగలగొట్టలేదు అని చెబుతాడు. మీరే అయ్యగారి నుంచి నన్ను కాపాడాలి అని అతను బ్రతిమాలతాడు. ఇక జ్ఞానాంబ కూడా పోతే పోయింది లేండి రేడియో అంటూ నాకు సవతి పోరు తగ్గింది అని కౌంటర్ వేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 23rd Episode 2023

గుడిలో రామచంద్ర జానకి: దీంతో గోవిందరాజులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోతాడు. ఇక మలయాళం నవ్వుతూ ఉండగా అతన్ని గోవిందరాజులు కొడతాడు. దీంతో సైలెంట్ గా మలయాళం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గుడిలో రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా పూజలో పాల్గొంటూ ఉంటారు.

ఇక రామచంద్ర అయితే జానకిని అలా చూస్తూ ఎన్నో కవిత్వాలు వదులుతాడు. మీ మాటలు మనసులో నుంచి వస్తాయి అని వాటికి నేను అసలు సమాధానాలు చెప్పలేకపోతున్నాను అని అంటాడు. ఇక జానకి కూడా భర్తను చూసి ఎంతగానో సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 23rd Episode 2023

గుడిలో జానకి కలవరం: ఇక వారిద్దరు కూడా ఆరోజు రాత్రి గుడిలోనే పడుకోవాలని బాణమ్మ చెబుతుంది. దీంతో రామచంద్ర జానకి ఇద్దరు కూడా అక్కడే నిద్రలోకి జారుకుంటారు. అయితే మధ్యలో జానకికి తనకు కొడుకు పుట్టినట్లుగా కల వస్తుంది. అంతేకాకుండా ఆ కొడుకును ఎత్తుకొని ఉండగా అతను దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో జానకి మళ్ళీ నిద్రలో నుంచి తేరుకొని బాబు అని అరుస్తుంది.

ఇక రామచంద్ర ఆమెకు నచ్చజెప్పి మళ్లీ పడుకోబెడతాడు. ఒక విధంగా ఇది మనకు ఆశీర్వాదం అని రాబోయే కొడుకును మీరు కలలో అమ్మవారి దైవం వల్ల చూశారు అని చెబుతాడు. ఇక జానకి ఆ విషయంలో ఆనంద పడుతోంది. ఇక మరుసటి రోజు బానమ్మ ఇంటి నుంచి రామా జానకి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది.

ఎస్ఐ మనోహర్ కు సవాల్: ఆ క్రమంలో బానమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు వెళ్లిపోతారో అర్థం కాదు అని అయినా ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే ఇంతే బాధపడాల్సి వస్తుంది అని ఆమె తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఆమె ఏడుస్తున్న విధానాన్ని చూసి రామచంద్ర జానకి కూడా ఎమోషనల్ అవుతారు. అయితే తాను ఏమీ ఏడవడం లేదు అని బానమ్మ చెబుతుంది.

అయినప్పటికీ కూడా నువ్వు ఏమీ బాధపడకు బానమ్మ మేము మళ్ళీ వస్తాను కదా నేను ఎప్పటికీ నీకు గుండెల్లోనే ఉంటాను అని అంటాడు. ఇక ఆమెకు అలా చెప్పి వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. అయితే మరోవైపు జానకి ఎస్సై మనోహర్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ జానకి అతనికి ఎదురుగా నిలబడి నువ్వు ఏమీ చేయలేవు అని సవాల్ విసురుతూ ఉంటుంది. మరి అతని నుంచి జానకి రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X