Janaki Kalaganaledu May 24th: శుభవార్త చెప్పడానికి సిద్ధమైన జానకి.. మలయాళంతో మల్లిక పాట్లు

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.82 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 587 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 May 24th Episode 2023

ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా: జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా వారి పెద్దమ్మ దగ్గర గడిపిన తర్వాత మళ్లీ ఇంటికి వస్తారు. రామచంద్ర పెద్దమ్మ ప్రేమ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. బానమ్మ అందరి కోసం కూడా ప్రత్యేకంగా కానుకలు పంపింది అని ఆనందంగా చెబుతూ ఉంటాడు. ఇక నాకు కూడా పంపిందా అంటూ వెన్నెల అడగడంతో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కానుకలు పంపించింది అని అందరిని చాలా బాగా గుర్తు చేసుకుంది అని రామచంద్ర తెలియజేసాడు.

ఇక మొదటగా పెద్దవాళ్ల నుంచి మొదలుపెట్టాలి అని చెప్పిన రామచంద్ర అమ్మ కోసం ప్రత్యేకంగా పెద్దమ్మ చీర పంపించింది అని ఇస్తాడు. ఆ తర్వాత నాన్నగారికి అలాగే మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా రామచంద్ర బానమ్మ ఇచ్చిన కానుకలు ఇస్తూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 24th Episode 2023

మల్లిక అలా అడగడంతో: అయితే నాకోసం ఏమి ప్రత్యేకంగా పంపించారు అంటూ మల్లిక అడగడంతో నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని కుంకుమపువ్వు పంపించింది అని చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి అని మరీ మరీ చెప్పినట్లుగా రామచంద్ర తెలియజేస్తాడు. ఇక ఆ తర్వాత వాళ్లు సంతోషంగా మాట్లాడుతూ లోపలికి వెళుతూ ఉంటారు. అయితే వారి బ్యాగును చూసిన మల్లికా ఏదో గట్టిగానే తెచ్చినట్లు ఉన్నారు అని అనుమానిస్తూ ఉంటుంది.

ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు కూడా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. అయితే ఇన్ని రోజులు కూడా ఎంతో సంతోషంగా గడిపాము అని మళ్లీ రేపటి నుంచి ఎప్పటిలానే స్వీట్ బండితో వెళ్లాలంటే అదోలా ఉంది అని రామచంద్ర చెబుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 24th Episode 2023

వెంటనే మీరు పనిలోకి వెళ్ళాలి: అయితే జానకి రోజు నిత్య పెళ్లి కొడుకు తరహాలో ఉంటారా ఏంటి అని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ రామచంద్ర అలా ఉంటే బాగుంటుందని అడుగుతాడు. ఇక అలా అవసరం లేదు అని వెంటనే మీరు పని లోకి వెళ్ళాలి అని నేను కూడా పోలీస్ డ్యూటీలోకి వెళ్లాల్సి ఉంది అని చెబుతుంది.

ఇక జానకి తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని కాస్త అనుమాన పడుతూ ఉంటుంది. ఇక వెంటనే చెక్ చేసుకోవాలి అని ఆమె బయటకు వెళుతుంది. అత్తగారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినా కూడా జానకి ఇప్పుడే వస్తాను అంటూ వెళుతుంది. ఇక జానకి చెక్ చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో నమ్మకంగా అనిపించదు. కానీ డాక్టర్ కి ఫోన్ చేసి అడగడంతో ఒక వారం తర్వాత నా దగ్గరకు రండి అని చెబుతుంది.

గుడ్ న్యూస్ తో జానకి: అయితే ఆ విషయంలో జానకి కాస్త సంతోషంగా ఉన్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతనే అందరికీ చెప్పాలని అనుకుంటుంది. ఇక మరోవైపు మల్లికా ఆరోగ్యం బాగుండాలి అని జ్ఞానాంబ ప్రత్యేకంగా జ్యూస్ లో రెడీ చేస్తూ ఉంటుంది. అయితే ఒక జ్యూస్ మాత్రం నేను అసలు తగను అని మల్లికా అంటుంది.

ఎలాగైనా జ్యూస్ తాగించాలి అని పనివాడు మలయాళం అనుకుంటాడు. లేకపోతే పెద్దమ్మ గారు నన్ను తిడతారు అని మల్లికతో చెబుతాడు. అయితే కొద్దిసేపటి వరకు అతనితో గొడవ పడుతూ అలాగా ప్రవర్తించిన మల్లికా చివరికి దాన్ని అందుకొని మలయాళం నోట్లోనే పోసేస్తుంది. అయితే అతను వద్దని చెబుతున్న కూడా అతనికి తాగిస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 24th Episode 2023

అనుగ్రహం కోసం ఎదురుచూడాలి: కాస్త జ్యూస్ మాత్రం ముందుగానే మల్లిక తెలివిగా తన నోటికి రాసుకుంటూ ఉంటుంది. ఇక నిజంగానే మల్లికా ఆ జ్యూస్ తాగిందని అత్తగారు అనుకుంటారు. రోజు ఇలానే తాగించాలి అని కూడా ఆమె పని వాడితో చెబుతూ ఉండడంతో అతను ఆశ్చర్యపోతాడు. కానీ ఏమి చెప్పలేకపోతాడు. ఇక మరోవైపు అత్తగారు జ్ఞానాంబ జానకికి ఎలాగైనా కడుపు పండాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది.

ఇన్ని రోజులైనా శుభవార్త చెప్పకపోవడంతో అమ్మవారు కరుణించడం లేదు అని ఆమె అనుకుంటూ ఉండగా జానకి అప్పుడే వచ్చి తప్పకుండా మన సమయం వచ్చేవరకు అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూడాలి అని తప్పకుండా ఆమె నమ్ముకున్న వారికి న్యాయం చేస్తుంది అని జానకి చెబుతుంది. అయితే మరోవైపు జానకి ఎస్ ఐ మనోహర్ నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. మరి జానకి ఇంట్లో గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X