Janaki Kalaganaledu May 25th: జానకి చేసిన మంచి పనితో తిరిగొచ్చిన ఆస్తి.. పగ పెంచుకున్న ఎస్ఐ

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 588 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 May 25th Episode 2023

రామచంద్ర తండ్రి అవ్వాలి అని: జానకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడంతో పాజిటివ్ అని వస్తుంది అయితే మరోసారి డాక్టర్ ప్రత్యేకంగా కలవాలని చెబుతుందని పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇంట్లో వాళ్లకు ఈ విషయాన్ని చెప్పాలి అని జానకి కూడా అనుకుంటుంది. ఇక జానకి వీలైనంత తొందరగా తల్లి కావాలి అని అత్తగారు జ్ఞానాంబ ఎంతగానో దేవున్ని ప్రార్థిస్తూ ఉంటుంది.నా కొడుకు రామచంద్ర తండ్రి అవ్వాలి అని చాలా ఆత్రుత పడుతున్నాడు.

వాడి సంతోషాన్ని త్వరగానే దేవుడు తీరిస్తే బాగుండు అని ప్రార్థిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జానకి తప్పకుండా ఆ సంతోషం వస్తుంది అని దేవుడు ఎప్పుడూ కూడా నమ్ముకున్న వారికి అన్యాయం చేయడం అనే ఆ దీవెనలు మనకు వరకు వచ్చేవరకు కాస్త ఓపిక పట్టాలి అని చెబుతుంది. ఇక జానకి అలా చెప్పడంతో అత్తగారు కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆమె ఆశీర్వాదం తీసుకొని జానకి పోలీస్ స్టేషన్ కు ఉద్యోగానికి వెళుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 25th Episode 2023

తప్పు చేశారు కాబట్టి: అయితే జానకి అలా నడుచుకుంటూ వెళుతుండగా జానకి కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఎస్ఐ మనోహర్ వచ్చి ఆమెకు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. నా ఉద్యోగం మొత్తం పోయేలా చేయలేదు అని మరో మూడు నెలల తర్వాత మళ్లీ ఎస్సైగా అదే పోలీస్ స్టేషన్లోకి అడుగు పెడతానని చెబుతాడు. అప్పుడు మీ సంగతి ఏంటో చూస్తాను అని అంత ఈజీగా వదిలే పెట్టాను అని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు.

అయితే నేను ఎప్పుడూ కూడా మీకు భయపడలేదు అని న్యాయాన్ని నమ్ముకున్నాను అని అది ఉన్నంతవరకు కూడా నాకు ఎలాంటి భయం లేదు అని జానకి అతనికి మరొక కౌంటర్ ఇస్తుంది. మీరు తప్పు చేశారు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చారు. మరో తప్పు చేయకండి అంటూ కూడా ఆమె గట్టిగానే మందలిస్తుంది. కానీ మనోహర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా జానకి పై మరింత పగను పెంచుకుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 25th Episode 2023

జానకి చేసిన సహాయంతో: ఒక వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని వెళుతూ ఉండగా అప్పుడే ఒక దొంగ వచ్చి ఆ డబ్బులు దొంగ ఇస్తాడు అయితే అతను ఇంతకన్నా బాధపడుతూ నా డబ్బులు దొంగ ఎత్తుకుపోతున్నాడు అని ఏడుస్తూ ఉంటాడు ఈ క్రమంలో కొంతమంది జనాలు ఆ దొంగ వైపు పడిగెడుతూ ఉంటారు. అయితే అప్పుడే అది గమనించిన జానకి వెళ్లి ఆ దొంగను పట్టుకుంటుంది.

డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఆ వ్యక్తికి ఇస్తుంది ఆ వ్యక్తి మరెవరో కాదు ఇంతకుముందు రామచంద్ర మోసపూరితంగా స్వీట్ షాప్ ను లాక్కుంటాడు. అయితే ఆ వ్యక్తి జానకిని గమనించి మీకు చేసిన మోసానికి నాకు చాలా చెడు జరిగింది అని నా వ్యాపారం చాలా దెబ్బ తినడంతో ఆర్థికంగా సమస్యలు వచ్చాయి అని చెప్తాడు. అంతేకాకుండా మళ్ళీ షాప్ వెనక్కి ఇచ్చేలా అతను చెబుతూ ఉంటాడు. దీంతో జానకి కూడా చాలా సంతోషపడుతుంది.

ఆ విషయం గురించి తెలియడంతో: ఇక రామచంద్ర ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి అసలు విషయం చెబుతాడు. మీ జానకి కారణంగా ఈ రోజు నా కుటుంబం ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకుంది అని మా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును ఒక దొంగ తీసుకొని వెళ్ళిపోతుంటే జానకి ధైర్యం చేసి అతన్ని పట్టుకొని మళ్లీ నా డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చింది అని అంటూ.. ఆమె చేసిన మేలు నేను ఏ మాత్రం మర్చిపోలేను అని చెబుతాడు.

ఇక ఆ విషయం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. అయితే మళ్లీ మీ షాపును వెనక్కి తీసుకు రావడానికి సిద్ధమయ్యాను అని ఆ పాపం నేను అనవసరంగా చేశాను అని అతను తప్పు ఒప్పుకుంటాడు. ఇక అదే విషయాన్ని రామచంద్ర జానకి తో సంతోషంగా చెప్పాలని బయలుదేరుతాడు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అనడంతో జానకి మొదట ప్రెగ్నెన్సీ గురించి తెలిసిందేమో అని అనుకుంటుంది. కానీ ఆ విషయం కాదు అని రామచంద్ర మాటలతో అర్థమవుతుంది. మరి జానకి రామచంద్రకు ఆ నిజం ఎప్పుడు చెబుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X