Janaki Kalaganaledu May 26th: నిజం చెప్పాలని జానకి ప్రయత్నం.. ఐపీఎస్ కావాలని రామ సీరియస్!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 589 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం
జానకి కుటుంబంలో ఎన్నో సంతోషాలు:మళ్ళీ జానకి కుటుంబంలో ఎన్నో సంతోషాలు మొదలవుతూ ఉంటాయి. రాదు అనుకున్న సొంత స్వీట్ షాప్ మళ్లీ వెనక్కి వచ్చేలా పరిస్థితులు అనుకూలిస్తాయి. జానకి పోలీస్ ఉద్యోగంలో భాగంగా ఒక వ్యక్తి పోగొట్టుకున్న డబ్బును వెనక్కి తిరిగి ఇప్పించడంతో ఆ వ్యక్తి మళ్ళీ రామచంద్ర స్వీట్ షాప్ వెనక్కి వచ్చేలా చేస్తాడు. మనం చేసిన మంచి పని ఎప్పటికీ మనకు తోడుగా ఉంటుంది అని మీరు రుజువు చేశారు అని రామచంద్ర కూడా జానకి పై ప్రశంసలు కురిపిస్తాడు. అయితే తాను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నను అని జానకి తన భర్తను ఊరిస్తూ ఉంటుంది. అయితే రామచంద్ర ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉంటాడు.

ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని..:జానకి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని కాస్త అనుమాన పడి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వస్తుంది. అయితే ఒక వారం తర్వాత డాక్టర్ మరోసారి పరీక్షలు చేస్తానని చెబుతుంది. అయితే పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేవరకు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదు అని జానకి అనుకుంటుంది. అయితే ఆమె పరధ్యానంలో ఉండడం చూసిన రామచంద్ర ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అని అనుమానిస్తూ ఉంటాడు. అదేమీ లేదు అని జానకి కూడా సరదాగా అంటుంది. అయితే మొత్తానికి ఆమె చెప్పాలని కూడా ఆలోచిస్తుంది.
బొమ్మను చూసి మల్లిక అసూయ:ఇక జానకి కోసం ప్రత్యేకంగా రామచంద్ర షాప్ లో ఒక బొమ్మను కొనిస్తాడు. దాన్ని చూసి ఆమె ఎంతకైనా సంతోషిస్తుంది. అయితే ఇంటికి రాగానే జానకి చేతిలో ఉన్న బొమ్మను చూసి మల్లిక అసూయ చెందుతుంది. అది తన కోసమే తెచ్చారు అని అన్నట్లు మాట్లాడుతూ తీసుకుంటుంది. ఇక రామచంద్ర ఆమెకు నిజం చెప్పబోతుండగా జానకి వెంటనే ఆపేస్తుంది. ఇక రామచంద్ర ఏమీ అనలేకపోతాడు. అయితే జ్ఞానాంబ అలాగే గోవిందరాజులు ఇద్దరు కూడా మళ్ళీ స్వీట్ షాప్ ను ఎప్పుడు మొదలుపెట్టబోతున్నావు అని అడుగుతారు. మంచి ముహూర్తం చూసే వెంటనే ఓపెన్ చేయాలి అని చెబుతారు.

ట్విస్ట్ ఇచ్చిన గోవిందరాజులు:అయితే ఇంతలో మల్లిక ఆ షాపులో ముగ్గురి అన్నదమ్ముల వాటాలు ఉండాలి అని ఒక మెలిక పెడుతుంది. అయితే గోవిందరాజులు మాత్రం అప్పుడే ఆమె కౌంటర్ ఇచ్చే విధంగా మరొక ట్విస్ట్ ఇస్తాడు. అయితే షాపు మీద ఉన్న పది లక్షల వడ్డీ ఎవరు కడతారో వారే ఈ తరహాలో వాటా తీసుకోవాలి అని చెబుతాడు. అయితే మల్లికా వెంటనే మళ్ళీ మాట మార్చేస్తుంది. నా తలలో పూలు పెట్టడానికే మా ఆయనకు డబ్బులు లేవు.. అలాంటిది ఈ వడ్డీని ఎలా కడతాడు అని.. అదేదో బావగారికి ఇచ్చేయండి అని మళ్లీ మాట మారుస్తుంది. ఇక జెస్సి కూడా ఎలాంటి అభిప్రాయం చెప్పదు. అయితే రామచంద్ర హ్యాపీగా ఆ షాపును మళ్ళీ తెరవవచ్చు అని గోవిందరాజులు చెబుతాడు.

జానకి ఐపీఎస్ చదువు.. రామ సీరియస్:ఇక రామచంద్ర జానకి ఇద్దరు కూడా గదిలోకి వెళ్లి ఎంతో సరదాగా ఉంటారు. అయితే రామచంద్ర తనకు పాయసం తినాలని ఉంది అని చెప్పడంతో జానకి వెంటనే ప్రత్యేకంగా చేసి తీసుకువస్తుంది. అయితే గర్భం వచ్చింది అని మీరు తండ్రి కాబోతున్నారు అని నిజం చెప్పాలని జానకి అనుకుంటుంది. అయితే ఇంతలోనే అత్తగారు పిలవడంతో జానకి మళ్ళీ ఆ మాటను చెప్పలేక పోతుంది. ఇక జానకి ఎలాగైనా మళ్ళీ ఐపీఎస్ కావాలి అని కూడా రామచంద్ర కోరుకుంటాడు. ఆ విషయాన్ని మరోసారి భార్యతో మాట్లాడతారు. జానకి ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోయినా రామచంద్ర మీరు ఎలాగైనా ఈసారి ఐపీఎస్ పరీక్షల్లో పాస్ అవ్వాలి అని అందుకు తగ్గట్టుగా చదవాలి అని, మిమ్మల్ని అభిమానించిన వారు ఇప్పుడు మీకు సెల్యూట్ చేసేలా చేయాలి అని చెబుతాడు. అయితే జానకి తాను ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయాన్ని చెప్పకుండా ఒక సంవత్సరం వరకు ఆగుదామని చెబుతుంది. దీంతో రామచంద్ర కాస్త అసహనం వ్యక్తం చేస్తూ.. ఎందుకు ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఉంటారా? అని వెటకారంగా మాట్లాడుతాడు. ఇక జానకి నిజం చెప్పాలని అనుకుంటుంది. మరి ఈ విషయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











