Janaki Kalaganaledu May 29th: రామ హ్యాపీగా ఉన్న సమయంలో మరో ట్విస్ట్.. జానకి ఎటు వెళ్ళింది?

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 591 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం

ప్రెగ్నెంట్ అయినట్లుగా అనుమానం..:జానకి తను ప్రెగ్నెంట్ అయినట్లుగా అనుమానం వస్తుంది. వెంటనే చెక్ చేసుకోక పాజిటివ్ అని రావడంతో డాక్టర్కు కాల్ చేసి చెప్తుంది. అయితే ఒక వారం రోజులు ఆగి తన దగ్గరకు రావాలి అని అప్పుడు పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపిన తర్వాత పూర్తిగా క్లారిటీ వస్తుంది అని చెబుతుంది. ఇక జానకి ఆ విషయాన్ని తనలోనే దాచుకొని అసలు నిజం తెలిసిన తర్వాత ఇంట్లో చెప్పాలని అనుకుంటుంది. ఇక ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని చెప్పకూడదని జానకి అనుకుంటుంది. మరోవైపు భర్త రామకు అప్పుడప్పుడు కాస్త అనుమానం వస్తున్నప్పటికీ కూడా జానకి తెలివిగా అతన్ని ఏమారుస్తుంది.

janaki kalaganaledu serial

పుల్లపుల్లగా తినాలని కోరిక..:ఇక జానకికి పుల్లపుల్లగా తినాలని కోరిక పుడుతుంది. వెంటనే మామిడికాయ కూడా తినాలని అనిపిస్తుంది. ఇక గోవిందరాజులు ఇంటికి కొన్ని మామిడికాయలు రావడంతో ఆమె దొంగచాటుగా ఆ మామిడికాయలను తీసుకోవాలని అనుకుంటుంది. జానకి మామిడికాయ తీసుకోగానే ఇంట్లో వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు. ఈ పుల్లటి మామిడికాయ తింటే ఎలా ఉంటుంది మామయ్య గారు అని జానకి అడుగుతుంది. చాలా బాగుంటుంది అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఏ అమ్మాయి అయినా సరే దాన్ని చాలా ఇష్టంగా తింటుంది అని చెబుతాడు. దీంతో జానకి సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే నువ్వు ఎందుకు అలా మామిడికాయ్ చూస్తున్నావ్ అంటూ భర్త కూడా అడుగుతాడు. అలా ఏమీ లేదు అని మీ మామిడికాయలు మల్లికకు ఇవ్వాలని అనిపించింది అని మళ్లీ మాట మారుస్తుంది.

janaki kalaganaledu serial

జానకి మాత్రం సిగ్గుపడుతూ:ఇక మల్లిక కూడా ఆ మామిడికాయ తీసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇది కావాల్సింది నాకు అని నీకు అవసరం లేదు అని చాలా కఠినంగా మాట్లాడుతుంది. అయినప్పటికీ జానకి ఏ మాత్రం బాధపడకుండా దొంగ చాటగా మరొక మామిడికాయ తీసుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆమె అలా తీసుకు వెళ్లడంతో రామచంద్ర చూసి మెల్లగా గదిలోకి వెళతాడు. అయితే అప్పటికే జానకి ఎంతో ఇష్టంగా మామిడికాయను తింటూ ఉంటుంది. ఇక రామచంద్రా రావడం చూసి ఆమె దాన్ని కొంగు చాటున దాచేస్తుంది. ఇక రామచంద్ర ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ మామిడికాయలు చూపించే విధంగా చేస్తాడు. మీరు ఎందుకు ఇలా తింటున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక జానకి మాత్రం సిగ్గుపడుతూ ఉండడంతో రామచంద్ర కు కాస్త అనుమనం వేస్తుంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 29th Episode 591

సినిమాకు వెళ్లాలని..:ఇక ప్రత్యేకంగా జానకి తనకు ఈరోజు సినిమాకు వెళ్లాలని ఉంది అని చెబుతుంది. ఇక రామచంద్ర కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. సాయంత్రం సినిమాకు వెళ్తామని అంటాడు. ఇక రామచంద్ర బయటకు వెళుతూ ఉండగా అప్పుడే గోవిందరాజులు పిలిచి సాయంత్రం తొందరగా వచ్చేటప్పుడు టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను తీసుకురావాలని చెబుతాడు. అయితే రామచంద్ర తనకు కొంచెం పని ఉంది అని చెబుతాడు. ఏం పని అని అడిగినప్పటికీ కూడా అతను తండ్రికి సమాధానం చెప్పడు. దీంతో గోవిందరాజులు కూడా సరదాగా అలుగుతూ ఉంటాడు. నువ్వు కూడా చిన్నోడిలా తయారయ్యావు అని నా మాట అసలు పట్టించుకోవడం లేదు అని అంటాడు. తల్లి జ్ఞానాంబ కూడా అదే తరహాలో రామచంద్రను అడుగుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 29th Episode 591

తండ్రి చెవిలో చెప్పడంతో..:అయితే ఇంతలో జానకి వచ్చి మళ్ళీ రామచంద్రను సరదాగా ఆటపట్టించే విధంగా అడుగుతున్నారు కదా ఏదో సమాధానం చెప్పండి అని అంటుంది. కానీ రామచంద్ర మాత్రం నిజం చెప్పాలని అనుకోరు. సినిమాకు వెళ్తున్నాము అని ఎలా చెప్పను అని తన మనసులోనే ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇక ఫైనల్ గా తండ్రి చెవిలో చెప్పడంతో ఆయన నవ్వుతూ ఉంటాడు. ఇక అదే విషయాన్ని గోవిందరాజులు తన భార్యకు కూడా చెబుతాడు. సినిమాకు వెళుతున్నాము అని చెప్పడానికి ఇంతగా ఆలోచించాలా ఆమె ఆమె నవ్వుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 29th Episode 591

జానకి ఎక్కడికి వెళ్ళింది?:ఆ తర్వాత జానకి పోలీస్ స్టేషన్కు వెళుతుంది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వస్తాడు. ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా అతనికి సహాయం చేయరు. అయితే జానకి మాత్రం అతనికి సహాయం చేయడానికి మీ ఇంటికి వస్తాను అని చెబుతుంది. ఇక ఆ తర్వాత జానకి కోసం రామచంద్ర పోలీస్ స్టేషన్ కు వస్తాడు. కానీ ఆమె ఇంకా పోలీస్ స్టేషన్ కు రాలేదు అని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. జానకికి వెంటనే ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. అయితే జానకి ఫోన్ ఒక దగ్గర పడిపోయి ఉంటుంది. మరి జానకికి ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X