Janaki Kalaganaledu May 2nd: జ్ఞానాంబ కుటుంబంలో ఎస్ఐ రేపిన చిచ్చు.. జానకి టార్గెట్!

జానకి కలగనలేదు విభిన్నమైన ఎమోషన్స్ తో ఊహించని ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని జానకి అనుకుంటుంది. ఇక కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 568 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 May 2nd Episode 2023

చట్టం ముందు దోషిగా నిలబెడతానని: బిల్డర్ మధుకర్ ఎలాగైనా మర్థర్ కేసు నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. అయితే మరోవైపు జానకి కానిస్టేబుల్ గా అతనికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బిల్డర్ కు ఎస్ఐ మనోహర్ సహాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. అతనితో డీల్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు.

ఇక ఈ క్రమంలో జానకి బిల్డర్ మధుకర్ కు హెచ్చరికలు చేస్తుంది. ఎలాగైనా నిన్ను చట్టం ముందు దోషిగా నిలబెడతానని అతని ఇంటికి వెళ్లి మరీ చెబుతుంది. అయితే నువ్వు ఈ జాబ్ వదిలి వెళ్ళకపోతే నీ కుటుంబంపై కూడా ఫోకస్ చేస్తాను అని బిల్డర్ మధుకర్ చెప్పడంతో జానకి మరింత సీరియస్ అవుతుంది. ఒకసారి టచ్ చేసి చూడు అనే నీకు చట్టం పవర్ ఏంటో చూపిస్తాను అని చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 2nd Episode 2023

జానకి సీరియస్ ఛాలెంజ్: అంతేకాకుండా నీలాంటి దుర్మార్గులను అసలు ఏ మాత్రం వదిలిపెట్టరు అని చాలెంజ్ చేస్తుంది. అయితే జానకి చేసిన ఆ చాలెంజ్ కు మధుకర్ కొంత భయపడతాడు. ఇక వెంటనే ఎస్ఐ మనోహర్ కు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెబుతాడు. ఆమె శివంగిలా కనిపించి నన్ను భయపెట్టింది అని నేను ఈ కేసులో ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నా ప్రాజెక్టులు కూడా చాలా వరకు కోల్పోతాను అని అతను చెబుతాడు.

అయితే ఎస్ఐ మనోహర్ మధుకర్ కు సపోర్ట్ చేసే విధంగా మళ్ళీ మాట్లాడుతుంటాడు. ఈసారి జానకి కోలుకోని విధంగా దెబ్బ కొడుతున్నాను అని నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెబుతాడు. అయితే మరో వైపు జానకి ఎలాగైనా మధుకర్ ను దోషగా నిలబెట్టాలి అని సరైన ఆధారాలు సంపాదించాలి అని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 2nd Episode 2023

తెలివిగా ఆలోచిస్తున్న జానకి: ముందుగా జానకి, మధుకర్ హత్య చేసిన అపార్ట్మెంట్ కు వెళుతుంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అయితే జానకి అక్కడ సెక్యూరికి ఒక వ్యక్తిని అడుగగా ఎస్సై గారు ఎవరికి కూడా సీసీ ఫుటేజ్ ఇవ్వద్దు అని చెప్పారు అని అయినా ఆ రోజు సీసీ కెమెరాలు పనిచేయలేదు అని అతను చెప్పడంతో జానకి మళ్ళీ కొంత కన్ఫ్యూజన్లో పడుతుంది.

ఎస్ఐ గారికి అలాగే మర్థర్ చేసిన బిల్డర్ కు ఏదైనా సంబంధం ఉండవచ్చు అని వీరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక జానకి తనకు తెలిసిన ఒక అమ్మాయిని కలుస్తుంది. ఆమె కాల్స్ ట్రాక్ చేసే ఉద్యోగిగా పనిచేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 2nd Episode 2023

సహాయం కోరిన జానకి: వెంటనే ఆమెను సంప్రదించి నాకు ఒక నెంబర్ మీద ఉన్న డేటా కాల్స్ మొత్తం కావాలి అని మర్థర్ చేసిన రోజు అతను ఎవరెవరికి కాల్ చేశాడు అనే వివరాలు తెలుపాలి అని జానకి ఆమెకు చెబుతుంది. దీంతో ఆమె సహాయం చేసేందుకు ఒప్పుకుంటుంది.

అయితే మరోవైపు ఎస్ఐ మనోహర్ జానకి ఇంటికి వస్తాడు ఇక్కడ ఎంతో మర్యాదపూర్వకంగా ఇంట్లోకి వచ్చి జానకి అత్త జ్ఞానాంబను మామ గోవిందరాజులను కలుస్తాడు. ఇక అప్పుడే రెండవ కోడలు మల్లికా, చిన్న కోడలు జెస్సి కూడా వస్తుంది.

నిజం మొత్తం చెప్పేసిన ఎస్ఐ మనోహర్: ఇక ఎస్సై మనోహర్ ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగా అతను అసలు విషయం చెబుతాడు. మీరు ఇంత బాధగా ఉండడానికి, మీ అబ్బాయి కేసులో ఇరుక్కోవడానికి ప్రధాన కారణం మీ కోడలు జానకి అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సాధారణంగా ఈ పోలీసు ఉద్యోగంలో కొన్ని కేసులో చాలా సీరియస్ గా ఉంటాయి అని మా కుటుంబాలు కూడా నష్టపోయే వరకు ప్రభావం చూపుతుంది అని చెబుతాడు.

ఒక బిల్డర్ హత్య చేసిన కేసులో జానకి మొండిపట్టుతో వెళుతుంది అని ఇక అతను పెద్ద వ్యక్తి కావడంతో మీ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు అని చెబుతాడు.అంతేకాకుండా ఇప్పుడు జానకి పోలీస్ ఉద్యోగాన్ని వదిలేస్తేనే అతను మీ కుటుంబాన్ని వదిలేస్తాడు అని లేకపోతే తీవ్ర స్థాయిలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది అని ఎస్సై మనోహర్ చెబుతాడు. దీంతో జ్ఞానాంబ మళ్ళీ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఇక ఈ విషయంలో జానకి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండబోతోంది. మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X