Janaki Kalaganaledu May 30th: జానకి కిడ్నాప్.. ఒంటరిగా ఆమె బట్టలు లాగడానికి గుండాల ప్రయత్నం!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 592 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మొత్తానికి ఆమె తల్లి అయ్యే క్షణం: జానకి కూడా తల్లి కావాలని ఎంతోకాలంగా కోరుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆమె తల్లి అయ్యే క్షణం రాబోతుంది. అయితే పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతనే వైద్యులను సంప్రదించిన తర్వాతనే ఆ విషయాన్ని భర్తకు చెప్పాలి అని అనుకుంటుంది. కానీ మరోవైపు తన తోడికోడలు మల్లిక మాత్రం జానకి ఎట్టి పరిస్థితుల్లో తల్లి కాకూడదు అని ఆమె సంతోషంగా ఉండకూడదు అని అనుకుంటుంది.
ఇక ఆమెకు చెడు జరగాలి అని ఒక నిమ్మకాయ కూడా జానకి గదిలో పెడుతుంది. దాని ప్రభావం వలన ఆమెకు చెడు జరుగుతుంది అని మల్లిగా నమ్ముతుంది. అయితే జానకి మాత్రం తన భర్తతో కలిసి హ్యాపీగా సినిమాకు వెళ్లాలని అనుకుంటుంది. చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అయితే జానకి సంతోషంగా ఉండడంతో మల్లికా తట్టుకోలేక పోతుంది.

నిమ్మకాయ పనిచేస్తుందా లేదా?: అసలు తాను పెట్టిన నిమ్మకాయ పనిచేస్తుందా లేదా అని అనుకుంటుంది. ఇక ఆ నిమ్మకాయ వారి గదిలో ఉందా లేదా అని చూడడానికి మరోసారి వెళుతుంది. గదిలోకి వెళ్లి చూడగా అక్కడ బెడ్డు కింద నిమ్మకాయ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎందుకు ఇది పనిచేయడం లేదో.. అర్థం కావడం లేదు అని ఆమె ఆలోచనలో పడుతుంది.
ఇక ఇంతలో జానకిరామ గది తలుపులు తెరిచి ఉండడం వలన పని వాడు మలయాళం వచ్చి ఆ గది తలుపులను మూసేస్తాడు. ఇక ఆ తర్వాత మల్లికా వెళ్లి గది తలుపులు తీయాలని అనుకుంటుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా రావు. ఇక బయట మలయాళం ఉన్నాడు అని గ్రహిస్తుంది. ఇక అతను తనను ఇక్కడ చూస్తే గోల గోల చేస్తాడు అని తెలివిగా తప్పించుకోవాలని అనుకుంటుంది.

తెలివిగా బయటపడిన మల్లిక: ఇక మలయాళం తలుపులు తీసే క్రమంలో మల్లికా ఒక దుప్పటి తీసుకొని అతని మీద చూడకుండా కప్పేస్తుంది. అసలు ఈ పని ఎవరు చేశారు అని అర్థం కాక మలయాళం కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మల్లిక వెళ్లి మామిడి కాయలు తూడుస్తూ ఉంటుంది. ఇక మలయాళం కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు.
ఇక మరోవైపు జానకి కోసం రామచంద్ర తన స్వీట్ షాప్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. ఈరోజు సినిమాకు వెళదామని తొందరగా వస్తాను అని జానకి గారు చెప్పారు. అయినప్పటికీ రాలేదు అని రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో పనివాడు మలయాళం స్వీట్ షాప్ దగ్గరికి వస్తాడు. నువ్వు సాయంత్రం వరకు స్వీట్ షాప్ చూసుకో.. మేము ఇద్దరం కూడా సినిమాకు వెళ్లి వస్తాము అని చెబుతాడు. అయితే జానకి అమ్మగారు ఇంకా ఎందుకు రాలేదు అని అతను అడుగుతాడు.

యువతికి స్ఫూర్తిని ఇచ్చిన జానకి: రామ వెంటనే ఫోన్ చేయాలని ప్రయత్నం చేసిన కూడా ఫోన్ కలవదు. ఇక రామచంద్ర వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. కానీ అక్కడ జానకి రాలేదు అని ఆమె తోటి కానిస్టేబుల్ చెబుతుంది. ఒక కేసు విషయంలో జానకి ఒక యువతికి స్ఫూర్తినిచ్చే విధంగా కొన్ని మాటలు చెబుతూ ఉంటుంది.
పరీక్షల్లో అనుకున్నంతగా మార్కులు రాకపోవడంతో అమ్మాయి చనిపోవాలి అనుకుంటుంది. ఈ క్రమంలో గదిలో అలానే ఉండిపోవడంతో వారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు జానకి అక్కడికి వస్తుంది. ఇక వెంటనే ఆ అమ్మాయికి స్ఫూర్తినిచ్చే విధంగా జానకి మాట్లాడుతూ ఉంటుంది. ఉదాహరణకు నా జీవితాన్ని చెబుతాను అంటూ ఐపీఎస్ లక్ష్యంగా తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెబుతూ ఉంటుంది.

జానకి పోలీస్ డ్రెస్ తీసేయ్యాలని: ఏ మనిషి అయినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేధించే వరకు వెనుకడుగు వేయకూడదు అని కొన్నిసార్లు కింద పడిన కూడా పైకి లేచి మళ్ళీ పరిగెత్తాలి అని ఎంతో ధైర్యంగా చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న యువతీ గది తలుపులు తెరిచి బయటకి వస్తుంది. మీ అమ్మ నాన్న కోసం నువ్వు బ్రతకాలి అని వారికోసం కష్టపడు అని మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే జానికి అలా వెళ్ళిపోతున్న సమయంలోనే ఆమెను ఇద్దరు గుండాలు కిడ్నాప్ చేస్తారు ఒక ప్లేస్ లో ఉంచి ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తారు.
కానీ జానకి ఏమాత్రం భయపడకుండా వారికి సమాధానం చెబుతుంది. అయితే జానకి పోలీస్ అని చూసి ధైర్యంగా మాట్లాడుతుంది అని ఆ డ్రెస్ తీసేస్తే సరిపోతుంది అంటూ వెటకారంగా గుండాలు మాట్లాడుతుంటారు. ఇక ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా జానకి వారిని చితకబాదలని ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కానీ ఆమె జాడ మాత్రం తెలియదు. మరోవైపు జానకి తల్లి అయినట్లు నిర్ధారణ అవుతుంది. మరి ఈ సమస్యల నుంచి ఆమె ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











