Janaki Kalaganaledu May 31st: రౌడీలను ధైర్యంగా తరిమికొట్టిన జానకి.. మరోసారి పగ పెంచుకున్న ఎస్ఐ

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 592 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 May 31st Episode 2023

కిడ్నాప్ కావడంతో: జానకి ఒక కేసు విషయంలో బయటకు వెళ్ళగా హఠాత్తుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను కిడ్నాప్ చేస్తారు. అయితే జానకి కొంతసేపటి వరకు ఎవరు అర్థంకాని పరిస్థితుల్లో ఉంటుంది. అయితే ఆ ఇద్దరు ఆమెను ఒక గదిలో ఉంచి బంధించే ప్రయత్నం చేస్తారు. ఇక జానకి వారికి ఏమాత్రం భయపడకుండా అసలు మీరు ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది.

కానీ వారు అసలు నిజం చెప్పరు. జానకి వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంత పొగరు నీకు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. నా పోలీస్ యూనిఫామ్ చూసి అని జానకి చెప్పడంతో ఆ పోలీస్ యూనిఫామ్ ఇప్పుడు తీసేస్తాను అని ఆ తర్వాత ఏం చేస్తావో చూస్తామని వాళ్ళు సవాల్ విసురుతారు. అయితే జానకి ఏ మాత్రం భయపడకుండా వారు ముందుకు వచ్చిన సరే దీటుగా ఎదుర్కొంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 31st Episode 2023

రౌడీలను తరిమికొట్టిన జానకి: ఇద్దరినీ ఆమె కలిపి కొడుతుంది. ఇక జానకి ధైర్యాన్ని చూసిన ఇద్దరు భయపడతారు. ఎక్కువసేపు జానకితో పోట్లాడలేక వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. ఇక జానకి కూడా వారి వెంటపడే ప్రయత్నం చేస్తుంది. కానీ వారు దొరకకుండా పారిపోతారు. ఇక ఇంతలోనే జానకి పరిగెత్తడం చూసిన రామచంద్ర జానకి గారు అంటూ ఆమె వెంట వస్తాడు. అయితే చివరికి జానకి దగ్గరికి చేరుకున్న తర్వాత అసలు వారు ఎవరు ఎందుకు ఈ రకంగా పరిగెడుతున్నారు అని అడుగుతాడు.

ఇక జానకి జరిగిన విషయం చెబుతుంది. దీంతో రామచంద్ర మీరు ఇంకా ప్రమాదంలోనే ఉన్నారు అని బహుశా బిల్డర్ చేసిన పని అయి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఎవరైనా సరే తాను ఎవరికీ భయపడను అని నావల్ల వారికే ప్రమాదమని జానకి చాలా ధైర్యంగా మరో సమాధానం ఇస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 31st Episode 2023

వెటకారంగా మాట్లాడుతూ ఉంటే: ఇక పదండి ఇంటికి వెళదామని రామచంద్ర అనగానే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకండి అంటూ మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు అని జానకి భర్తకు చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా మామిడికాయ పచ్చడి సిద్ధం చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో పనివాడు మలయాళం వెటకారంగా మాట్లాడుతూ ఉంటే గోవిందరాజులు కూడా అతనికి కౌంటర్ ఇస్తాడు. ఇక ఆనందంగా నవ్వుకుంటూ ఉన్న సమయంలోనే అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఇంట్లోకి అడుగు పెడతారు. అయితే సినిమాకు వెళ్తారు అన్నారు కదా ఎందుకు వెళ్ళలేదు అని గోవిందరాజులు అడగగానే సినిమా టికెట్లు దొరకలేదని హౌస్ ఫుల్ అయ్యాయి అని రామచంద్ర అబద్ధం చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 31st Episode 2023

జానకి చేతికి గాయం: ఇక మల్లిక మాత్రం పోలీస్ అయినా కూడా టికెట్లు దొరకకపోవడం ఏమిటో అని అడుగుతుంది. జానకి గారు ఎప్పుడు కూడా అలా ప్రవర్తించరు అని ఎవరి సహాయం తీసుకోరు అని చెప్పడంతో గోవిందరాజులు మల్లికా నోరు మూయించేలా మళ్ళీ కౌంటర్ ఇస్తాడు. ఇక సరే లోపలికి వెళ్ళండి అని చెప్పగానే అప్పుడే జానకి చేతికి గాయాన్ని అత్త జ్ఞానాంబ చూస్తుంది. వెంటనే ఏం జరిగింది అని అడుగుతుంది. థియేటర్ దగ్గర ఏదో గీసుకున్నట్టు ఉంది అని చిన్న దెబ్బ అని చెప్పి జానకి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

త్వరగా తల్లి అయితే బాగుండు: ఇక జానకి రామచంద్ర వారి గదిలోకి వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ కోసం వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జానకి మాత్రం తాను తల్లి అయిన విషయాన్ని మాత్రం ఇంకా చెప్పదు. పూర్తిగా డాక్టర్ నిర్ధారించిన తర్వాతనే నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పుడే రామచంద్ర చెల్లెలు వచ్చి వారికి ఆవకాయ అన్నం ఇస్తుంది. మీ ఇద్దరూ తినిపించుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోతుంది.

ఇక రామచంద్ర ఎంతో ప్రేమగా జానకి కి ముద్దలు పెట్టి తినిపిస్తూ ఉంటాడు. ఇక భర్త ప్రేమను చూసిన జానకి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. మరోవైపు జానకి త్వరగా తల్లి అయితే బాగుండు అని అత్తగారు కూడా చాలా బెంగపెట్టుకుని ఉంటారు. సరిగ్గా భోజనం కూడా చేయదు. మరోవైపు జానకి పై రివెంజ్ తీర్చుకోవాలి అని ఎస్సై మనోహర్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు రౌడీలు కూడా అతను పంపించిన వారే. ఇక మరో ప్లాన్ వేయాలి అని అనుకుంటాడు. ఇక జానకి తల్లి అయినట్లుగా డాక్టర్ నిర్ధారిస్తుంది. మరి ఆ విషయాన్ని ఆమె భర్తకు ఎలా వివరిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X