Janaki Kalaganaledu May 3rd: కఠినమైన మాటలతో జానకిని బాధపెట్టిన జ్ఞానాంబ.. గాయపడిన రామ!
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్ లతో కొనసాగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని జానకి అనుకుంటుంది. ఇక కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 568 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.
అతనికి శిక్ష పడేలా చేయాలని..:జానకి ఎలాగైనా తన భర్తను కేసు నుంచి బయటపడేయాలని అనుకుంటుంది. బిల్డర్ మధుకర్ మర్థర్ చేయడంతో జానకి ఒక కానిస్టేబుల్ గా అతనికి శిక్ష పడేలా చేయాలని అనుకుంటుంది. కానీ ఆ బిల్డర్ ఎస్ఐ మనోహర్ తో కలిసి డీల్ మాట్లాడుకుంటారు. కేసు నుంచి బయట పడేలా చేయాలి అని అనుకుంటారు. ఇక జానకి అడ్డుగా ఉండడంతో ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ పోలీస్ జాబ్ వదిలేసి వెళ్లిపోవాలి అని అంటారు. కానీ జానకి మాత్రం మర్థర్ చేసిన మధుకర్ కు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని అనుకుంటుంది. కానీ అతను మాత్రం తప్పించుకోవాలి అని ఆమె భర్తను డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక అందుకు మనోహర్ కూడా సహాయం చేస్తాడు.

మీ కుటుంబం మరింత ఇబ్బంది పడుతోంది:ఇక ఎంత ప్రయత్నించినా కూడా జానకి వెనక్కి తగ్గడం లేదు అని ఎస్ఐ మనోహర్ జ్ఞానాంబ ఇంటికి వెళ్లి జానకి గురించి మొత్తం చెబుతాడు. ఆమె ఒక పెద్ద వ్యక్తితో పంథానికి పోతోంది అని ఆ కేసు విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదని జానకి అత్త మామలకు చెబుతాడు. అతని కారణంగా ఈ రోజు మీ కుటుంబం మరింత ఇబ్బంది పడుతోంది అని మీరే జానకికి నచ్చజెప్పాలని అంటాడు. ఇక జ్ఞానాంబ ఆ విషయంలో జానకిపై మరింత కోపంగా ఉంటుంది. అయితే మరోవైపు రామ స్వీట్ బండి దగ్గర మరొక గోడవ జరుగుతుంది. స్వీట్స్ కావాలని కొందరు రౌడీలు కావాలని గోడవ చేస్తారు. అంతేకాకుండా స్వీట్స్ అన్ని కూడా కిందపడేసి బండి కూడా ధ్వంసం చేస్తారు.

రామను ఎవరో కొట్టారని చెప్పడంతో..:ఇక రామ జనాల్లో నమ్మకం కోల్పోవడమే కాకుండా గొడవ కారణంగా మరింత ఇబ్బంది పడతారు. ఇక మరోవైపు జానకి తన స్నేహితురాలి ద్వారా మధుకర్ చేసిన హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. మధుకర్ హత్య చేసిన రోజు ఎవరెవరికి కాల్స్ చేశాడు అనే వివరాలు మొత్తం జానకి సేకరిస్తుంది. ఎలాగైనా ఆ వివరాలతో మధుకర్ కు శిక్ష పడేలా చేయాలని జానకి అనుకుంటుంది. ఇక ఆ తరువాత జానకికి ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. రామచంద్రను ఎవరో కొట్టారు అని చాలా గాయాలు అయ్యాయి అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఇక ఆమె పరుగుపరుగున ఇంటికి వస్తుంది.

జానకి పై చాలా కోపంగా మాట్లాడుకుంటూ..:అంతకుముందే ఇంట్లో వాళ్ళు జానకి పై చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు జానకి కారణంగా ఇంత ఇబ్బంది అవుతున్నా కూడా ఎవరు నోరు మెదపడం లేదు అని మల్లిక మాట్లాడుతుంది. ఇక జానకి రాగానే తన భర్తను చూసి చాలా బాఫపడుతుంది. ఏం జరిగింది అని ఏడుస్తుంది. ఇక ఆమె విషయంలో అత్త జ్ఞానాంబ చాలా సీరియస్ అవుతుంది. నీ వల్లే ఇది అంతా జరిగింది అని నిన్ను కట్టుకోవడం వలన నా కొడుకు ఈ రోజు ఇలా కష్టాలపాలవుతున్నాడు అని జ్ఞానాంబ అంటూంది. ఇక జానకి ఆ విషయంలో మరింత బాఫపడుతుంది. ఇక జ్ఞానాంబ కొంత సేపటి అనంతరం నువ్వు అనవసరంగా లేని గొడవలను తలపైకి తెచ్చుకోకు నీ కారణంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది.

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడంతో..:అంతే కాకుండా రామచంద్రను లోపలికి తీసుకు వెళ్లి ఇంకా ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయో ఒకసారి జాగ్రత్తగా చూసి మందు రాయమని చెనుతుంది. ఇక జానకి మాత్రం మీ మాట వింటుంది అనే నమ్మకం తమకు లేదని రేపు మాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు అని మల్లిక మరొక విధంగా మాట్లాడుతుంది. ఇక జానకి రామచంద్రను లోపలికి తీసుకు వెళ్లి నా కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అని ఎంతగానో బాధపడుతుంది. ఇక ఇది మీ పోలీస్ జాబ్ అని అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయవద్దని రామ ధైర్యం చెబుతాడు. ఇక అప్పుడే జానకి ఫోన్ కి బిల్డర్ మధుకర్ కాల్ చేస్తాడు. నువ్వు వెనుకడుగు వేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడంతో జానకి మరింత సీరియస్ అవుతుంది. మరి బిల్డర్ మధుకర్ ను జానకి ఎలా ఎదుర్కొంటుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











