Janaki Kalaganaledu May 4th: జెస్సి ద్వారా మరో నిజం తెలుసుకున్న జానకి.. అత్త మాటలకు ఆవేదన
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తో సరికొత్త మలుపు తిరిగింది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 570 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.
మధుకర్ కు శిక్ష పడేలా చేయాలి:మర్థర్ కేసు నుంచి తప్పించుకోవాలి అని బిల్డర్ మధుకర్ జానకికి చాలా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. కానీ ఆమె ఒక పోలీస్ కానిస్టేబుల్ గా తను చేయాల్సిన డ్యూటీ చేస్తుంది ఎలాగైనా అమాయకులకు న్యాయం జరగాలి అని బిల్డర్ మధుకర్ కు శిక్ష పడేలా చేయాలి అనే జానకి ఎంతగానో తాపత్రయపడుతుంది. కానీ మధుకర్ మాత్రం జానకి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎస్ఐ మనోహర్ తో కలిసి ఇప్పటికే కొంత గొడవలను క్రియేట్ చేస్తాడు. దీంతో జానకి మరింత ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా అత్తగారు జానకి పై చాలా కోపంగా ఉంటారు. నువ్వు అనవసరంగా లేనిపోని గొడవల్లో తలదూర్చి ఆ సమస్యలను ఇంటి వరకు తీసుకు వస్తున్నామని నీ పద్ధతి మార్చుకోవాలి అని ఆమె చెబుతుంది.

అసలు నిజాలు చెప్పిన జెస్సి:అయినప్పటికీ జానకి న్యాయం వైపు ఉండాలని అనుకుంటుంది. ఇక జానకి మాత్రం ఆ విషయంలో కొంత ఆశ్చర్య పోతుంది. నేను ఇంట్లో కేసు గురించి ఏమి చెప్పకపోయినప్పటికీ వీళ్ళందరికీ ఎలా తెలుస్తోంది అని అనుమానిస్తుంది. ఎవరు నిజం చెప్పి ఉంటారు అని అనుకుంటుంది. ఇక వెళ్లి జెస్సిని అసలు విషయం అడుగుతుంది. అయితే జెస్సి జానకి పై కాస్త కోపంగానే అన్ని నిజాలు చెప్పేస్తుంది. ఎస్సై మనోహర్ కు తప్ప నీ మీద ఎవరికీ కోపం ఉంటుంది అని ఆయనే ఇంటికి వచ్చి అత్తయ్య గారితో చెప్పారు అని జానకితో అంటుంది. అంతే కాకుండా నువ్వు చేస్తున్నది నిజంగా తప్పే అంటూ నీ లక్ష్యం కారణంగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు అని గట్టిగానే చెబుతుంది. అంతేకాకుండా ఈరోజు నీ కారణంగా నీ భర్త దెబ్బలు తగిలి ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఏదైనా అనుకుంటే రేపు ఏదైనా జరగవచ్చు. అనవసరంగా నీ కారణంగా ఇదంతా జరగడం కరెక్ట్ కాదు అని అంటుంది.

మరొకరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు:అయితే జానకి అలాగని నా లక్ష్యాన్ని వదిలేయమంటావా అని అడగడంతో నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడడంలో తప్పులేదు కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడటం తప్పు. అంతేకాకుండా నీ లక్ష్యం కోసమే నీ జీవితం అయినప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా తప్పే. మన కారణంగా మరొకరిని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని జెస్సి ఎంతగానో చెబుతోంది. ఇక ఆ విషయం గురించి జానకి ఆలోచనలో పడుతుంది. ఇక మరోవైపు అత్తగారు జ్ఞానాంబ భోజనం చేయకుండా పస్తులు ఉంటుంది. ఈ క్రమంలో మలయాళం వచ్చి జానకికి విషయం చెబుతాడు. దీంతో ఆమె భోజనం తీసుకువెళ్లి అత్తగారికి ఇవ్వాలని అనుకుంటుంది. అయితే బెడ్ రూమ్లో గోవిందరాజులు భార్యను బ్రతిమాలుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు అనవసరంగా పట్టింపులకు పోయి భోజనం చేయకుండా ఉండవద్దు అని ఒకసారి ఆలోచించమని జానకి తన భర్తను కాపాడుకుంటుంది అనే నమ్మకం ఉంది అని గోవిందరాజులు చెబుతాడు.

ఆ నమ్మకం నాకు పోయింది:అయితే ఆ నమ్మకం నాకు పోయింది అని ఇప్పటివరకు కేసు విషయంలో ఏమీ తేలలేదు అని నా కొడుకు ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఆ బాధ నాకే తెలుస్తుంది అని అంటుంది. ఈ క్రమంలో జానకి వచ్చి మీరు బాధపడకండి అత్తయ్య గారు తప్పకుండా రామచంద్ర గారిని నిర్దోషిగా బయటకు తీసుకు వస్తాను అని చెబుతుంది. అయితే అది జరిగేది ఎప్పుడూ అని మీ వల్ల అసలు కాదు అని నిన్ను చేసుకున్నందుకు వాడు ఎంతగానో కష్టపడుతున్నాడు అని కఠినంగా మాట్లాడుతుంది.

మళ్ళీ పోలీస్ స్టేషన్ కు రామ:అయితే గోవిందరాజులు కూడా జానకికి ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాడు. నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని అనడంతో జానకి మరింత బాధపడుతుంది. తరువాత జానకి తన బెడ్ రూమ్ లోకి వచ్చి ఏడుస్తూ ఉండగా రామచంద్ర ఎందుకు బాధపడుతున్నారు అని అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు అని చెబుతాడు. దీంతో జానకి రామచంద్ర తో ఇతర విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే మరుసటి రోజు మళ్లీ ఎస్సై మనోహర్ వచ్చి రామచంద్రను పోలీస్ జీప్ ఎక్కించాలని అనుకుంటాడు. ఇక అప్పుడు తల్లి జ్ఞానాంబ మళ్ళీ నా కొడుకుని తీసుకు వెళ్ళిపోతున్నారు అని ఇప్పటివరకు నువ్వు చేసింది ఏమీ లేదు అని ఇదంతా కూడా నీవల్లే జరిగింది అని అత్తగారు జానకి పై మరింత సీరియస్ అవుతుంది. మరి ఈ కేసు విషయంలో జానకి ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











