Janaki Kalaganaledu May 5th: బాధలో ఉన్నప్పుడు ముద్దులు కావాలన్న రామ.. మరుసటి రోజే మళ్ళీ అరెస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ కథ సరికొత్త మలుపు తిరిగింది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 571 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 May 5th Episode 571

జానకి కారణంగానే ఇంట్లో కష్టాలు వస్తున్నాయి:డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రామచంద్రను ఎలాగైనా నిర్దోషిగా బయటకు తీసుకురావాలి అని జానకి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ తరుణంలో ఆమె ఇంట్లో ఎస్ఐ మనోహర్ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ కేసును విడిచిపెట్టి పోలీస్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే జానకి కారణంగానే ఇంట్లో కష్టాలు వస్తున్నాయి అని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మిస్తాడు. దీంతో జ్ఞానాంబ అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా జానకి పై అసంతృప్తి గానే ఉంటారు. మీ లక్ష్యం కారణంగా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అత్తగారు అయితే మరింత సీరియస్ గా మాట్లాడుతుంటారు.

Janaki Kalaganaledu Serial 2023 May 5th Episode 571

కోపాలు ఎక్కువ రోజులు ఉండవు:దీంతో జానకి భర్తను ఎలాగైనా రక్షించుకోవాలి అని అలాగే ఆ కేసును కూడా విజయవంతంగా ఫినిష్ చేయాలి అని అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్డర్ చేసిన బిల్డర్ మధుకర్ ను వదిలిపెట్టకూడదు అని జానకి ఆలోచిస్తుంది. కానీ జానకి కుటుంబ పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలించవు. ఈ క్రమంలో జానకి బాధపడుతూ ఉండగా రామచంద్ర ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుతూ అపార్థం చేసుకుంటున్నారు అని వీటిని మీ మనసులోకి తీసుకోకండి అని రామచంద్ర చెబుతాడు. అంతేకాకుండా ఈ కోపాలు ఎక్కువ రోజులు ఉండవు అని మీరు విజయవంతంగా మీ ఉద్యోగానికి న్యాయం చేసినప్పుడే అందరూ దీన్ని మర్చిపోతారు అని రామచంద్ర చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 May 5th Episode 571

టెన్షన్ లో ఉన్నప్పుడు ముద్దులు ఇస్తే..:దీంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక రామచంద్ర ఆమెను ఆ ఆలోచన నుంచి బయటపడేసేందుకు కాస్త రొమాంటిక్ గా మాట్లాడుతుంటారు. మనం టెన్షన్ లో ఉన్నప్పుడు ఒక ముద్దు ఇస్తే ఆ భారం అంతా తీరిపోతుంది అని ఒక వైద్యుడు చెప్పాడు అని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దీంతో జానకి కూడా అంతే సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఉదయం రామచంద్ర జానకి ఇద్దరు కూడా కలిసి గుడికి వెళ్లాలని అనుకుంటారు. ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెబుతారు. ఇక హ్యాపీగా బయలుదేరుతున్న సమయంలో అప్పుడే ఎస్ఐ మనోహర్ జీపుతో ఇంటికి వస్తాడు. రామచంద్రను అరెస్టు చేసి తీసుకువెళ్లాలని అనడంతో అందరూ ఒక్కసారిగా మళ్ళీ ఆశ్చర్యపోతారు.

Janaki Kalaganaledu Serial 2023 May 5th Episode 571

రామను మళ్ళీ అరెస్ట్ చేసిన మనోహర్:అసలు ఎందుకు అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అని జానకి అడిగినప్పుడు నిన్న రౌడీలతో మీ ఆయన గొడవపడ్డాడు అని బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు పడకూడదు అని కానీ దాన్ని లెక్కచేయకుండా మీ ఆయన కూడా గొడవ పడినట్లుగా ఎస్ఐ మనోహర్ కారణం చెబుతాడు. అయితే దాని మీద గొడవ పడలేదు అని వాళ్లే నన్ను కొట్టి నా బండిని కూడా ధ్వంసం చేశారు అని చెబుతాడు. కానీ ఎస్సై మనోహర్ మాత్రం వాళ్లే మీపై కేసు పెట్టారు అని చెబుతాడు. అంతే కాకుండా రామచంద్ర ను అరెస్ట్ తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక తల్లి జ్ఞానాంబ మళ్ళీ జానకి పై చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా రామచంద్రను బయటికి తీసుకు వస్తాను అని ఎన్నో గొప్పలు చెప్పావు కదా మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఆ మాట ఏమయింది అని ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 May 5th Episode 571

జానకి పై మరోసారి సీరియస్ అయిన ఎస్ఐ:ఇక జానకి మళ్ళీ బాధపడుతూ పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. అక్కడ ఎస్ఐ మనోహర్ తన మాటలతో మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నిన్ను అనవసరంగా నమ్మాను అని ఇకనుంచి నిన్ను అసలు ఏమాత్రం నమ్మమని ఎస్సై జానకితో అంటాడు అనవసరంగా నువ్వు గొప్పలకు పోతున్నావని పోలీస్ ఉద్యోగం వదిలిపెడితేనే నీ జీవితం బాగుంటుంది అని చెబుతాడు. ఇక రామచంద్రను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే అని ఈరోజు రేపు సెలవు కాబట్టి ఎల్లుండి రామచంద్ర కోర్టు మెట్లు ఎక్కుతాడు అని డ్రగ్స్ కేసు లో శిక్ష పడుతుంది అని ఎస్ఐ మనోహర్ చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. ఇక జానకి రామచంద్ర గురించి ఆలోచిస్తూ ఒక పార్టీలో కూర్చుంటుంది. ఇక మరుసటి రోజు భర్తకు భోజనం తినిపించాలి అని అనుకున్నా జానకి ఏస్ఐ మనోహర్ వచ్చి ఎవరి పర్మిషన్ తీసుకొని పెడుతున్నావు అని ఇకనుంచి నీ భర్తను ఏ మాత్రం కలవడానికి వీలులేదు అని చెబుతాడు. మరి ఈ సమస్యల నుంచి జానకి ఇలా బయటపడుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X