Janaki Kalaganaledu April 1st: రామ కోసం జ్ఞానాంబ ఆరాటం.. జానకి నుంచి విడగొట్టేందుకు మరో ప్లాన్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. జ్ఞానాంబ కోడలు జానకి ఐపీఎస్ అవ్వాలని ఎన్నో కలలు కంటుంది. కానీ అత్తగారికి మాత్రం కోడలు చదువుకోవడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో జానకి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకున్న జానకి వెన్నెల పెళ్లి విషయంలో వేసిన ప్లాన్ వృధా అవ్వడంతో జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక ఇంట్లో నుంచి భర్తతో పాటే బయటకు రావాల్సి వస్తుంది. ఎటు వెళ్ళలేక ఒక గుడిలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి తన ఐపీఎస్ డ్రీమ్ ను ఎలా నెరవేర్చుకుంది మళ్లీ తన కుటుంబానికి ఎలా దగ్గరవుతుంది అనే అంశం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు రోజురోజుకూ తన స్థాయిని పెంచుకుంటుంది. గత వారం వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 270 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జానకి కారణంగా

జానకి కారణంగా

జానకి చెప్పిన అబద్ధాల కారణంగా ఆమెని ఇంట్లో నుంచి అత్త జ్ఞానాంబ బయటకు పంపించిన విషయం తెలిసిందే. అలాగే జానకికి భర్త రామచంద్ర కూడా సహకరించాడు అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో ఇబ్బందుల్లో పడతారు. ఇక వారు ఎటు వెళ్ళాలో తెలియక జ్ఞానాంబ ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకునే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ ఈ క్రమంలో జానకి మరిన్ని ఇబ్బందులు పడుతుంది. రామచంద్రను తల్లి స్వీట్ షాప్ దగ్గరకు రావద్దు అని చెప్పడంతో అతను మరొక కార్ఖానాలో వెళ్లి పని చేస్తూ ఉంటాడు. ఇక తల్లి కొడుకు పడుతున్న ఇబ్బంది ని చూసి ఎంతో మనో వేదనకు గురి అవుతుంది. జానకి కారణంగానే తన కొడుకుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతుంది

రెచ్చగొట్టాలని మల్లిక ప్రయత్నం

రెచ్చగొట్టాలని మల్లిక ప్రయత్నం

ఇక తోడికోడలు మల్లిక జానకి మరింత రివెంజ్ తీర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. ఆమెను ఎలాగైనా ఇంటి ముందు నుంచి దూరంగా పంపించేయాలని మళ్లీ ఇంట్లోకి వస్తే తనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకుండా చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను మరింత రెచ్చగొట్టాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఇక జానకి బట్టలు ఆరవేస్తుండగా వాటిని మా దండెం మీద ఎందుకు అరేస్తున్నావు అంటూ బట్టలను పడేస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర తండ్రి కోడలు జానకి పరిస్థితిని చూసి ఎంతో బాధపడతాడు. వెంటనే జానకి కోసం మరొక దండెం కట్టేసి సహాయం చేస్తాడు. అంతేకాకుండా జానకి చేతుల్లో కొంత డబ్బును కూడా పెడతాడు.

పని ఒత్తిడి కారణంగా..

పని ఒత్తిడి కారణంగా..


అదే క్రమంలో అప్పుడే జ్ఞానాంబ బయటికి వస్తుంది. ఇక భార్యని చూసిన గోవిందరాజులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే మాట మార్చేసి జానకిని దూరంగా పెడుతున్నట్లు మాట్లాడుతాడు. ఇక ఆ తర్వాత తెలివిగా తన భార్య నుంచి తప్పించుకున్న గోవిందరాజులు సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక మరోవైపు రామచంద్ర మరింత దీన పరిస్థితుల్లో కి వెళ్ళి పోతాడు ఇల్లు గడవడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి కార్ఖానా లో తనకు తెలిసిన పని చేస్తూ ఉంటాడు. అయితే పని ఒత్తిడి కారణంగా జానకి తెచ్చిన భోజనం కూడా చేయడు.

 కొడుకు కోసం జ్ఞానాంబ ఆరాటం

కొడుకు కోసం జ్ఞానాంబ ఆరాటం

ఇక ఆ భోజనం తినకుండా ఉన్నాను అని తెలిస్తే జానకి గారు బాధ పడతారు అని.. రామ భోజనాన్ని బయట పడేస్తాడు. రామచంద్ర అలా అన్నం పడేయడం చూసిన తల్లి జ్ఞానాంబ చాలా బాధపడుతుంది. జానకి చేసిన భోజనం నచ్చకపోవడంతో రామచంద్ర ఆ విధంగా భోజనం పడేసి ఉంటాడు అని ఆమె అనుకుంటుంది. దీంతో ఎలాగైనా జానకి నుంచి తన కొడుకును తన వైపు తిప్పుకోవాలి అని కూడా అనుకుంటుంది.

 మరో మాస్టర్ ప్లాన్

మరో మాస్టర్ ప్లాన్

స్వీట్ షాప్ లో సంతోషంగా యజమాని లాగా ఉండాల్సిన నా కొడుకు ఈరోజు మరొకరి షాప్ లో పనిచేస్తూ ఉండటం ఏమాత్రం నచ్చడం లేదు అంటూ జ్ఞానాంబ తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇక మల్లికా అత్తగారికి మనసు ఎప్పుడైనా కరగవచ్చు అని మళ్ళీ కొడుకు కోడలిని ఇంట్లోకి రప్పిస్తుంది అనే భయంతో ఇంకా ఏదైనా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జానకిని ఇంట్లోకి రానివ్వకూడదు అని ప్లాన్ వేసిన మల్లిక ఆ విషయంలో మరొక మాస్టర్ ప్లాన్ ఏదైనా ఆలోచించాలని అనుకుంటుంది.

Recommended Video

John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu
కొడుకును కోడలి నుంచి విడిపించాలని..

కొడుకును కోడలి నుంచి విడిపించాలని..


అయితే మరుసటి రోజు జ్ఞానాంబ కొడుకు ఆకలి బాధలు తెలుసుకుని తనే భోజనాన్ని తెప్పిస్తుంది. అయితే ఆ భోజనాన్ని జానకి పంపించింది అనుకున్న రామచంద్ర జానకికి ఫోన్ చేసి అభినందించాడు. ఇక ఎలాగైనా రామచంద్ర ను జానకి నుంచి విడిపించాలి అని జ్ఞానం సీరియస్ గా ఆలోచిస్తుంది మరి జానకి అత్త గారి ఆలోచనలు ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X