Janaki Kalaganaledu April 22nd: జానకి చదువు కోసం మరో రిస్క్ చేసిన రామ.. చెల్లి కోసం యోగి ఆందోళన
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అత్తగారి ఇంట్లో ఎవరికి తెలియకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక ఆమె భర్త రామచంద్ర కూడా జానకికి అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాడు. మరోవైపు జానకి చదువుకోవడం జ్ఞానాంబకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. అంతే కాకుండా జానకి ఇప్పటివరకు చేసిన తప్పుల విషయంలో కూడా ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉంటుంది. మరోవైపు చిన్న కోడలు మల్లిక జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితులలో జానకి తన అనుకున్న కలను ఎలా నెరవేర్చుకుంది అనే పాయింట్ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 285 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఏమాత్రం హక్కు లేదు..
తన చెల్లిని బాధ పెడుతుంది అని జ్ఞానాంబను యోగి పోలీస్ స్టేషన్ వరకు తీసుకువస్తాడు. గృహ హింస చట్టం కింద కేసు పెట్టడంతో జ్ఞానాంబ కోర్టు వరకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఆ తర్వాత జానకి కారణంగా మళ్లీ పరిస్థితులన్ని మారిపోతాయి. జానకి రామ చంద్ర ఇద్దరికీ కూడా విడాకులు ఇప్పించాలని యోగి ఒక నిర్ణయం తీసుకోగా అందుకు జ్ఞానాంబ ఏమాత్రం ఒప్పుకోదు. నా కొడుకును కోడలిని విడదీయడానికి నీకు ఏమాత్రం హక్కు లేదు అని వారిని మళ్ళీ తన ఇంట్లోకి రప్పిస్తుంది.

అలా ఎన్నటికీ జరగకూడదు
ఇక పరిస్థితులు అన్నీ మళ్లీ సాధారణంగా మారిపోయాయని ఎప్పటిలానే మళ్ళీ అందరం సంతోషంగా ఉండొచ్చు అని జానకి రామచంద్ర ఎంతగానో సంతోషిస్తారు. అయితే అత్తగారు మాత్రం ఇంకా జానకి పై అదే తరహా కోపంతో ఉంటారు. జానకి తెలివి కారణంగా తన కొడుకు పరిస్థితి ఎప్పటికైనా దారుణంగా మారవచ్చు అని అలా ఎన్నటికీ జరగకూడదు అని జ్ఞానాంబ జానకిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇక జానకి ఇంట్లో ఏ పని చేయడానికి వీలు లేదు అని కూడా జ్ఞానాంబ కొత్త కండిషన్ పెడుతోంది.

జానకిపై రివేంజ్ తీర్చుకోవాలని..
ఇక అత్తగారు ప్రవర్తిస్తున్న తీరు గురించి జానకి తన భర్తకు ఏ మాత్రం చెప్పకుండా ఉంటుంది. మళ్లీ తన కారణంగా తల్లి కొడుకుల మధ్య దూరాలు పెరగకూడదు అని ఆలోచిస్తుంది. మరోవైపు చిన్న కోడలు మల్లిక జానకి పై మరోసారి రివేంజ్ తీర్చుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అసలు ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అనుకుంటే మళ్ళీ ఎప్పటిలాగే ఇంట్లో పెద్దరికం పాత్ర పోషిస్తోందని తట్టుకోలేక పోతుంది. అంతే కాకుండా అత్తగారు కూడా ఆమెను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే అసూయ చెందుతుంది.

యోగి ఆందోళన
ఇక జానకి విషయంలో ఆమె అన్నయ్య యోగి ఇంకా ఆందోళన చెందుతూనే ఉంటాడు. జ్ఞానాంబ, జానకిని ఇష్టంతో ఏమాత్రం తీసుకెళ్లలేదు అని కేవలం వారికి విడాకులు ఇప్పిస్తాను అని భయంతో జానకిని మళ్లీ ఇంటికి తీసుకు వెళ్ళింది అని అనుకుంటాడు. అంతే కాకుండా ఆమె మళ్ళీ ఎప్పటిలానే ప్రవర్తిస్తూ ఉంటుంది అని ఆ కష్టాలను జానకి ఇలా ఎదుర్కొంటుందో అని యోగి ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇక అప్పుడే యోగి భార్య ఆ కుటుంబ సభ్యులందరిని కూడా మన బాబు బారసాలకి పిలవాలి అని సలహా ఇస్తుంది. అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కోపంతో ఉన్న వాళ్లు మనం పిలిస్తే ఏ మాత్రం రారు అని యోగి తన భార్యకు చెబుతాడు. అయినప్పటికీ బంధాలను విడిచి పెట్టకూడదు అని ఆమె సలహా ఇస్తుంది.

లక్ష రూపాయల ఫీజు కట్టాలి
ఇక మరో వైపు జానకి ఐపీఎస్ చదువుకు సంబంధించిన మరొక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కోచింగ్ సెంటర్ లో లక్ష రూపాయల ఫీజు కట్టాలి అని ఆమె మిత్రుడు ఫోన్ చేసి చెబుతాడు. దీంతో జానకి ఇప్పుడున్న పరిస్థితులలో లక్ష రూపాయలు ఫీజు కట్టడం అంటే చాలా కష్టమని కంగారు పడుతూ రామచంద్రకు చెబుతుంది. కానీ అతను మాత్రం వెనుకడుగు వేయకుండా రెండు రోజుల్లో ఆ డబ్బును సమకూరుస్తాను అని చెబుతాడు.

మరో స్వీట్ షాప్
అయితే ఒక ఆర్డర్ నుంచి వచ్చిన డబ్బులో సగం డబ్బులు తీసుకుని జానకి ఫీజు కట్టాలి అని రామచంద్ర ఆలోచిస్తాడు. అందుకు ఏదో ఒక కారణం తన తల్లికి చెప్పాలి అని ఆలోచిస్తాడు. కానీ అదే సమయంలో జ్ఞానాంబ మరొక ప్రదేశంలో కొత్తగా స్వీట్ షాప్ ను కూడా పెట్టాలి అని అనుకుంటుంది. అందుకోసం ఏర్పాట్లు చేయాలని ముందుగానే అడ్వాన్స్ కూడా కట్టాలి అని రామచంద్ర కు సలహా ఇస్తుంది. దీంతో రామచంద్ర మళ్లీ సందిగ్ధంలో పడతాడు. ఏదేమైనప్పటికీ కూడా రామచంద్ర జానకి కోచింగ్ సెంటర్ ఫీజును సమయానికి కట్టేస్తాడు. మరి ఈ క్లిష్ట సమయంలో జానకి చదువును ఎలా పూర్తి చేస్తుంది.. అలాగే రామచంద్ర తన తల్లి నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











