Janaki Kalaganaledu April 25th: జానకి, రామ రొమాన్స్.. తప్పుగా అర్థం చూసుకున్న జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సీరియల్ మంచి కథాంశంతో ప్రేక్షకుల సంఖ్యను ఎంతగానో పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో అత్యధిక టిఆర్పీ అందుకున్న సీరియల్స్ లో కూడా జానకి కలగనలేదు మెల్లగా టాప్ లోకి చేరుకుంటోంది. ఇక జానకి కథాంశం కూడా రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ అవ్వాలని జానకి అత్తగారి ఇంట్లో ఎవరికి తెలియకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక ఆమె భర్త రామచంద్ర కూడా జానకికి అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాడు. ఇక జానకి చదువుకోవడం మాత్రం జ్ఞానాంబకు ఇష్టం ఉండదు. అంతే కాకుండా జానకి ఇప్పటివరకు చేసిన తప్పుల విషయంలో కూడా ఆమె తీవ్ర కోపంతోనే ఉంటుంది. మరోవైపు చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ పరిస్థితులలో జానకి తన అనుకున్న కలను ఎలా నెరవేర్చుకుంది అనే పాయింట్ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 286 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

చదువుకున్న తెలివితో..
జానకి చేసిన పొరపాట్ల కారణంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న జ్ఞానాంబ ఎలాగైనా కోడలి నుంచి కొడుకును తన అదుపులోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. జానకి తను చదువుకున్న తెలివితో తన కొడుకు రామచంద్రని మాయలో పడేసింది అని తప్పుగా అర్థం చేసుకున్న జ్ఞానాంబ ఎలాగైనా కొడుకుని మళ్ళీ తన వైపు తిప్పుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ జానకి రామ చంద్ర ఇద్దరు మాత్రం విడదీయలేని బంధంతో ఇంకా దగ్గరవుతూనే ఉంటారు. ఎన్ని అపార్దాలు వచ్చినా కూడా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు.

రామచంద్రతో మరో స్వీట్ షాప్
మరోవైపు మల్లిక కూడా జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డిజాస్టర్ అవుతూనే ఉంటాయి. అయినా కూడా ఆమె నిరాశ చెందకుండా మళ్ళీ అనేక కుట్రలు చేయాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ మరొక స్వీట్ షాప్ పెట్టాలని అని రామచంద్ర సలహా ఇస్తుంది. అందుకు రామచంద్ర కూడా ఒప్పుకుంటాడు. ఇక మల్లిక మాత్రం ఆ విషయంలో ఏమాత్రం ఏకీభవించకుండా రామచంద్ర తో మరొక స్వీట్ షాప్ పెట్టిస్తే జానకి రేంజ్ మరింత పెరిగి పోతుంది అని ఆమె పెత్తనం కూడా నడుస్తోంది అని ఎలాగైనా స్వీట్ షాప్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది.

పాత జ్ఞాపకాలు
ఇక జానకి చదువు విషయంలో ఎంతగానో ఆలోచించిన రామచంద్ర ఆమె ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కోసం లక్ష రూపాయలు అవసరం కావడంతో వెంటనే ఆ ఫీజ్ కూడా చెల్లిస్తాడు. ఇక ఆ తర్వాత కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్యలో జానకి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడే ఒకప్పుడు గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని చదువుకున్న జ్ఞాపకాలన్ని కూడా జానకి గుర్తు చేసుకుంటుంది. ఈ క్రమంలో రామచంద్ర ఒకప్పుడు జానకి చదువుకుంటూ ఉండగా అక్కడే స్వీట్ బాక్స్ పెట్టి వెళ్ళిపోతాడు.. కానీ అప్పుడు ఆమె జానకి అని అతనికి తెలియదు.

రామచంద్రకు దొరికిన పాస్ పోర్ట్
ఇక జానకి ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కాసేపు రామచంద్ర తో అల్లరి చేస్తుంది. ఆ అమ్మాయి తనే అంటూ చెప్పడంతో రామచంద్ర కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ఇక ఇద్దరు అలా ప్రేమగా మాట్లాడుకున్న తరువాత వాళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఎవరికీ కనిపించకుండా గోడదూకి వెళ్ళాలి అని అనుకుంటున్న క్రమంలో అక్కడ రామచంద్రకు ఎవరో పర్స్ పారేసుకున్నట్లు కనిపిస్తుంది. దాంట్లో ఏముంది అని చూడగా ఎవరో అమెరికాకు చెందిన వాళ్ళు పాస్ పోర్ట్ కూడా పోగొట్టుకున్నట్లు గ్రహిస్తారు. ఇక వెంటనే వారి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఉదయం మళ్లీ చేద్దామని రామచంద్ర చెబుతాడు.

రొమాన్స్ పై జ్ఞానాంబ అనుమానాలు
ఇక మరోవైపు మల్లిక తోడికోడలిపై పగ తీర్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరొక స్వీట్ షాప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు అని అనుకుంటుంది అందుకోసం ఎలాగైనా అత్తగారు జ్ఞానాంబను తన వైపు తిప్పుకోవాలని కూడా అనుకుంటుంది. అందుకోసం ముందుగానే స్వీట్ షాప్ రామచంద్రకు అప్పగిస్తే జానకి చేతుల్లోకి వెళ్లినట్లే అని మరో అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత అందరూ ఉదయం పనులు చేసుకుంటూ ఉండగా రామచంద్ర భార్యను అద్దంలో చూస్తూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక వారిద్దరి ప్రేమ సన్నివేశాన్ని చూసిన జ్ఞానాంబ తప్పుగా అర్థం చేసుకుంటుంది. తన కొడుకును జానకి గుప్పిట్లో పెట్టుకుంది.. అని ఎలాగైనా ఆమె మాయ నుంచి విడిపించాలి అని ఆలోచిస్తుంది. మరి జానకి అత్తగారి అనుమానాలను ఎలా దాటుకుంటూ వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











