Janaki Kalaganaledu April 26th: నగ్నంగా భర్తను చూసి ఉలిక్కిపడ్డ జానకి.. రొమాన్స్ తో ఫుల్ హ్యాపీ!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సీరియల్ ప్రేక్షకుల సంఖ్యను ఎంతగానో పెంచుకుంటోంది. ఇక అత్యధిక టిఆర్పీ అందుకున్న సీరియల్స్ లో కూడా జానకి కలగనలేదు లెవెల్ మరింత పెరుగుతోంది. ఇక జానకి కథాంశం కూడా రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన అత్తగారి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఆమె కోసం భర్త రామచంద్ర కూడా అండగా ఉంటాడు. అయితే జానకి చదువుకోవడం మాత్రం జ్ఞానాంబకు ఇష్టం ఉండదు. ఇక చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ కఠిన పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 287 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 ఎన్ని కష్టాలు వచ్చినా..

ఎన్ని కష్టాలు వచ్చినా..

రామచంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా జానకి సలహా తీసుకుంటున్నాడు అని అతని తల్లి జ్ఞానాంబ ఏ మాత్రం సహించలేని పరిస్థితుల్లో ఉంటుంది. తన కొడుకు రామచంద్రను కోడలు జానకి పూర్తిగా తన మాయలో లాగేసుకుంది అని ఎలాగైనా అతన్ని ఆమె మాయ నుంచి బయటకు రప్పించాలని కూడా ఆలోచిస్తుంది. కానీ ఈ క్రమంలో జానకి రామచంద్ర ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా దగ్గరవుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ మాత్రం దూరం అవ్వకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.

 ఆనందంగా..

ఆనందంగా..

ఇక జానకి చేసిన పొరపాట్లను అత్తగారు ఏ మాత్రం క్షమించకూడదు అనే ఆలోచనతో ఉంటారు. కానీ కొడుకు రామచంద్ర మాత్రం తన తల్లి భార్యను క్షమించింది అని చాలా సంతోషంగా ఉంటాడు. మరోవైపు రామచంద్ర తండ్రి గోవిందరాజులు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంది అని ఆనంద పడుతూ ఉంటాడు. ఇక రామచంద్ర ఉదయాన్నే పచ్చని చిలుకలు తోడుంటే అనే పాటతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఈ క్రమంలో ఓర్చుకోలేకపోయినా చిన్న కోడలు మల్లిక మాత్రం అడ్డు పడాలని చూస్తుంది. మధ్యలో దగ్గుతూ ఉంటుంది.

కోడలి సలహా బెస్ట్

కోడలి సలహా బెస్ట్

గోవిందరాజులు మరోసారి మల్లిక పై సెటైర్లు వేసే ప్రయత్నం చేస్తాడు. మల్లిక మాత్రం తన మామయ్య గోవిందరాజులు వేసే జోకులు మాత్రం కొంచెం కూడా తట్టుకోలేక పోతుంది. ఇక ఆ తర్వాత జానకి రామ్ చంద్ర ఇద్దరు కూడా చాలా అందంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అదే సమయంలో షేవింగ్ చేసుకుంటున్న గోవిందరాజులు రామచంద్రను ఒకసారి పూర్తిగా గడ్డం లేకుండా చూడాలని ఉంది అని కోరుకుంటాడు. ఇక అప్పుడు రామచంద్ర అద్దంలో చూస్తూ తన నిర్ణయాన్ని అడుగుతాడు. ఇక అప్పుడు ఆమె గడ్డం లేకుంటే మాత్రం బాగుండదని చెప్పడంతో రామచంద్ర కూడా అదే తరహాలో సమాధానం ఇస్తాడు. అందుకు గోవిందరాజు లో సరదాగా నవ్వుతూ కోడలు చెబితే చాలా కరెక్ట్ అని ఏ విషయమైనా సరే కోడలి నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి అని కూడా కొడుకుకు సలహా ఇస్తాడు.

 జానకి పై అనుమానాలు

జానకి పై అనుమానాలు

జ్ఞానాంబ మాత్రం జానకి విషయంలో ఇంకా అనుమానాలతో ఆలోచిస్తుంది. జానకి తన కొడుకుని పూర్తిగా ఆదినం లోకి తీసుకుంది అని ఆమె చెప్పినట్లుగానే కొడుకు వినే పరిస్థితి ఎదురయ్యిందని అనుకుంటుంది. ఎలాగైనా తన కొడుకు బయటకు తీసుకురావాలి అని కూడా ఆమె ఆలోచిస్తుంది. ఇక అదే సమయంలో మల్లిక జ్ఞానాంబ మనసులో మరొక అనుమానాన్ని కలిగించాలని ప్రణాళికలు రచిస్తోంది.

హెచ్చరించిన జ్ఞానాంబ

హెచ్చరించిన జ్ఞానాంబ


వెంటనే అత్తగారి కాఫీ ఇచ్చి తన మనసులోని మరొక ఆలోచనను చెబుతుంది. మీరు మరొక స్వీట్ షాప్ పెట్టాలని అనుకుంటున్నారు కదా అది మీ పెద్ద కొడుక్కి ఇస్తే జానకికి ఇచ్చినట్లే అని అందుకే తమకు ఇవ్వాలని లేకపోతే మీ చిన్న కొడుకు చాలా బాధ పడతాడు అని మల్లికా సలహా ఇస్తుంది. ఇక మల్లికా అలా చెప్పగానే జ్ఞానాంబ ఆ మాటలను ఏమాత్రం నమ్మకుండా ఇలాంటి అబద్ధాలు చెబితే బాగుండదు అని హెచ్చరిస్తుంది.

రొమాంటిక్ సీన్

రొమాంటిక్ సీన్

అంతా అసభ్యంగా సాగిపోతున్న సమయంలో లో జానకి రామచంద్ర ఇద్దరి మధ్యలో ఒక రొమాంటిక్ అనుభవం ఎదురవుతుంది. జానకి రోజా పూలు తీసుకొని రామచంద్ర బెడ్రూంలోకి వెళ్ళగానే అతను అక్కడ స్నానం చేసి టవల్ కట్టుకునే పరిస్థితుల్లో ఉంటాడు. ఇక జానకి వచ్చి అలా అప్పుడే రామచంద్రను నగ్నంగా చూసి ఒక్కసారిగా అరిచేస్తుంది. రామచంద్ర ఒక్క సారిగా ఉలిక్కి పడి వెంటనే మంచం వైపు వెళ్ళే దాక్కుంటాడు.

జానకి ఇంటికి యోగి

జానకి ఇంటికి యోగి


ఇక జానకి చేతిలో ఉన్న గులాబీ రేకులు కూడా రామచంద్రపై పడతాయి. ఇక ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలాగే జానకి మరొక టవల్ తీసుకొని రామచంద్ర భుజంపై కప్పుతుంది. ఇలా ఎప్పుడూ బయటికి రాకండి అంటూ సరదాగా మాట్లాడుతుంది. ఈ క్రమంలో జానకి ఇంటికి ఆమె అన్నయ్య యోగి, వదిన ఊర్మిల వస్తారు. జ్ఞానాంబ వాళ్ళిద్దరినీ ఇంట్లోకి పిలువగా రామచంద్ర మాత్రం ఆగండి అని చెబుతాడు. మరి ఈ పరిణామాలతో జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X