twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu April 28th: తల్లి కోసం వెనక్కి తగ్గని రామచంద్ర.. యోగిపై పంతం.. బాధలో జానకి!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. మొదట్లోనే ఈ సీరియల్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. సీనియర్ నటి రాశి చేసిన పాత్రతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సీరియల్ లో లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అత్యధిక టిఆర్పీ అందుకున్న సీరియల్స్ లో కూడా జానకి కలగనలేదు లెవెల్ మరింత పెరుగుతోంది. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన అత్తగారికి తెలియకుండానే చదువును కొనసాగిస్తోంది.

    ఇక ఆమె కోసం భర్త రామచంద్ర కూడా అండగా ఉంటాడు. ఇక చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ కఠిన పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 289 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    విదేశీ అమ్మాయికి సహాయం

    విదేశీ అమ్మాయికి సహాయం

    ఒక విదేశీ అమ్మాయి పాస్ పోర్టు పోగొట్టుకోవడం తో దాన్ని ఎలాగైనా ఆమె వద్దకు చేర్చాలని రామచంద్ర నిర్ణయం తీసుకుంటారు. ఇక ఆమెకు ఫోన్ చేసి చెప్పగా తనే రామచంద్ర షాప్ దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే అక్కడ పాస్ పోర్ట్ కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఇక రామచంద్రం మంచితనం గురించి అలాగే జానకి అభినయానికి ఆమె ఎంతగానో ఆకర్షితురాలవుతుంది. రామచంద్రం షాప్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన పూతరేకులు కూడా ఆమెకు అందజేస్తాడు. దీంతో ఆమె అది ఎంతో రుచికరంగా ఉంది అంటూ ఒక విషయాన్ని చెబుతుంది.

    ఆ పోటీల్లో గెలిస్తే..

    ఆ పోటీల్లో గెలిస్తే..

    విదేశీ అమ్మాయి వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేకమైన వంటల ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ప్రత్యేకంగా స్వీట్స్ కూడా తయారు చేసే పోటీ ఉంటుంది అంటూ అందులో పాల్గొంటే తప్పకుండా మీకే మొదటి ప్రైజ్ వస్తుంది అని ఆమె నమ్మకం వ్యక్తం చేస్తుంది. ఇంకా అదే విషయాన్ని జానకి తన భర్త రామచంద్రకు చెబుతుంది. ఆ పోటీల్లో పాల్గొంటే ప్రైజ్ మనీ తో పాటు ప్రభుత్వాలకు తరచుగా స్వీట్స్ సప్లై చేసే కాంట్రాక్ట్ కూడా దొరుకుతుంది అని జానకి వివరణ ఇస్తుంది. దీంతో అందుకు రామచంద్ర కూడా ఒప్పుకుంటాడు.

    ఆ అర్హత లేదు

    ఆ అర్హత లేదు

    ఇక అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో జానకి ఇంటికి వాళ్ళ అన్నయ్య యోగి భార్య కొడుకుతో రావడం జరుగుతుంది. ఇక వాళ్లు ఎందుకు వచ్చారని మరోవైపు మల్లిక అనుమానంతో చూస్తూ ఉంటుంది. గుమ్మం బయట నిలబడి ఉన్న వారిని జ్ఞానాంబ లోపలికి రావాలి అని చెబుతుంది. కానీ అదే సమయంలో కొడుకు రామచంద్ర మాత్రం వాళ్లని లోపలికి రావద్దు అని గట్టిగా చెబుతాడు. యోగికి ఇంట్లోకి వచ్చే అర్హత లేదని మా అమ్మకు జరిగిన అవమానాన్ని అందరూ మర్చిపోయిన కూడా నేను మర్చిపోను అని మా అమ్మ క్షమించినా కూడా నేను క్షమించనని పంతంతో ఉంటాడు.

    ఊర్మిల క్షమాపణ

    ఊర్మిల క్షమాపణ

    అయితే యోగి భార్య ఊర్మిళ మాత్రం తన భర్త కారణంగా జ్ఞానాంబ గారికి జరిగిన అవమానం క్షమించరాని నేరం కానీ ఎంత పెద్ద తప్పు అయినా కూడా ఆమె క్షమిస్తుంది అని అంటారు ఇక నా భర్త చేసిన తప్పు కూడా మంచి మనసుతో క్షమించి రేపు నా కొడుకు జరగబోయే బారసాల లో మీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలని యోగి భార్య రామచంద్ర ను ఆర్దిస్తుంది. అంతేకాకుండా జానకి తండ్రి మళ్లీ పుట్టాడు అని కూడా ఆమె చాలా ఎమోషనల్ గా వివరణ ఇస్తుంది.

    ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర

    ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర

    ఈ క్రమంలో రామచంద్ర కోపంగా ఆలోచించి జానకి తండ్రి గారి మళ్లీ పుట్టినట్లుగా మీరు భావిస్తున్నారు కాబట్టి ఆ పసి వాడి కోసం బారసాల కు కేవలం జానకి గారు మాత్రమే వస్తారు అని అంటాడు. దాంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా అనకండి అంటూ జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి మీరు బారసాలకు రాకపోతే ఫంక్షన్ జరగదు అని అంటుంది. ఈ పసివాడికోసమైనా రావాలని అంటుంది. ఇక మరోవైపు జానకి బాధపడుతున్న సమయంలో రామచంద్ర ఆ విషయంలో తన నిర్ణయం మారదు అని మీరు కూడా ఆలోచించవద్దని అంటాడు.

    స్పెషల్ గెస్ట్..

    స్పెషల్ గెస్ట్..

    ఇక బారసాలకు వెళ్ళాలి అని రామ తండ్రి గోవిందరాజులు, తన భార్య జ్ఞానాంబకు చెబుతాడు. కానీ ఆమె మాత్రం జానకి కావాలని ఇలా ప్లాన్ చేసిందని అనుమానిస్తుంది. ఇక మనల్ని కాదని జానకి వెళ్లదని కూడా గోవిందరాజులు చెబుతాడు. ఇక ఈ క్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ తో బారసాల జ్ఞానాంబ ఇంట్లోనే జరిగే పరిణామాలు ఏర్పడతాయి. మరి జానకి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుంది? అలాగే యోగి కుటుంబంపై జ్ఞానాంబ కోపం తగ్గుతుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 289
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X