Janaki Kalaganaledu April 29th: జానకి కోసం నిజంగానే దిగొచ్చిన దేవత.. మల్లికకు స్ట్రాంగ్ కౌంటర్!
జానకి కలగనలేదు సీరియల్ మరో కీలకమైన మలుపుతో ఎంతో ఆసక్తికరంగా మారింది. స్టార్ట్ అయిన మొదట్లోనే సీరియల్ పై ఇటీవల అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. సీనియర్ నటి రాశి జ్ఞానాంబ పాత్రకు పాజిటివ్ టాక్ వచ్చింది. లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో జానకి కలగనలేదు ఎంతగానో ఆకట్టుకుంటోంది. అత్యధిక టిఆర్పీ అందుకున్న సీరియల్స్ లో కూడా జానకి కలగనలేదు లెవెల్ మరింత పెరుగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కలను సాధించాలని అనుకున్న జానకి కోసం భర్త రామచంద్ర కూడా అండగా ఉంటాడు. ఇక జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక మాత్రం జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ కఠిన పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 289 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

యోగి వెనకడుగు వేసినప్పటికీ..
గతంలో జానకి సోదరుడు యోగి చేసిన గొడవ కారణంగా రామచంద్ర తీవ్ర ఆగ్రహంతో ఉంటాడు. తన తల్లిని అనవసరంగా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు అని జరిగిన గొడవలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో యోగి తన కొడుకు పుట్టాడు అని బారసాల ఫంక్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించడానికి జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. యోగి కాస్త వెనకడుగు వేసినప్పటికీ కూడా అతని భార్య ఊర్మిల ఎలాగైనా జానకి కుటుంబ సభ్యులందరిని కూడా ఈ వేడుకకు రావాలని కోరుకుంటుంది.

జానకిలో తీవ్ర మనోవేదన..
అయితే ఎంత బ్రతిమాలినా కూడా రామచంద్ర మాత్రం యోగి విషయంలో కోపంగానే ఉంటాడు. మా అమ్మకు చేసినా అవమానం మేము ఎప్పటికి మర్చిపోలేము అని మిమ్మల్ని మా అమ్మ క్షమించినా కూడా నేను ఎప్పటికీ క్షమించలేను అని చెబుతూ ఉంటాడు. ఇక మీకు పుట్టిన బాబు మీ తండ్రితో సమానంగా చూస్తున్నారు కాబట్టి జానకి మాత్రమే బారసాలకి వస్తుంది అని రామచంద్ర చెబుతాడు. ఈ క్రమంలో జానకి తీవ్ర మనోవేదనకు గురి అవుతుంది అయినప్పటికీ కూడా రామచంద్ర ఆ విషయంలో ఏమి మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉంటాడు.

మల్లిక సంబరం
ఇక జానకి బాధపడుతూ ఉండడంతో ఆమె తోడికోడలు మల్లిక మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. జానకి వాళ్ల పుట్టింటికి వెళ్లకుండా మేనల్లుడు బారసాలకు హాజరు కాలేక చాలా బాధపడుతూ ఉందని తన పని మనిషి తో చెప్పుకుంటూ ఉంటుంది. ఇక పనిమనిషి చికిత్త ఎప్పటిలానే మల్లిక పై ఊహించని పంచులతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు అలా సంబరపడి పోకండి ఎప్పటికైనా బొక్కబోర్లా పడాల్సిందే.. అని జానకి గారిని తీసుకువెళ్లడానికి ఎవరైనా దేవత దిగి రావచ్చు అని అంటుంది. అంత సినిమా లేదు అంటూ దేవత నిజంగానే వస్తుందా అని మల్లిక అనుకుంటూ ఉండడంతో అప్పుడు ఊహించని క్యారెక్టర్ ఇంట్లోకి అడుగు పెడుతుంది.

దేవత స్పెషల్ ఎంట్రీ
నిజంగానే జ్ఞానాంబ ఇంట్లోకి దేవత సీరియల్ రుక్మిణి.. జానకి మేనల్లుడితో అడుగుపెడుతుంది. తాను జానకి స్నేహితురాలిని అని చెబుతుంది. ఇక తప్పకుండా జానకి కుటుంబ సభ్యులతో సహా అందరిని రుక్మిణి బారసాలకు తీసుకు వస్తుంది అని ఊర్మిళ కూడా చాలా నమ్మకంతో ఉంటుంది. కానీ యోగి మాత్రం ఆ విషయంలో నమ్మకంతో ఉండడు. అయినప్పటికీ రుక్మిణి మీద తనకు చాలా నమ్మకం ఉంది అని ఊర్మిల చెబుతుంది.

మల్లికకు వార్నింగ్
ఇక ఊర్మిళ.. జ్ఞానాంబ ఇంట్లోకి అడుగుపెట్టగానే మల్లిక ఎదురవుతుంది. వారిద్దరి మధ్య మాటల అనంతరం జ్ఞానాంబ కూడా ఇంట్లోకి వస్తుంది. ఈ క్రమంలో మల్లిక తన మాటలతో రుక్మిణీ పై విరుచుకు పడే ప్రయత్నం చేస్తుంది. మేము అందరం బారసాల ఫంక్షన్ కు రావడం ఎట్టిపరిస్థితిలోనూ జరగదు అని చెబుతోంది. కానీ రుక్మిణి మల్లికా నోరు తెరవకుండా తాళం వేస్తుంది. నేను పల్లెటూరి అమ్మాయిని కదా అని చాలా నెమ్మదిగా ఉంటాను అనుకున్నారేమో పొలం పనులు చేసిన ఈ చేతితో తిరగబడితే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇవ్వడంతో మల్లిక ఎందుకైనా మంచిది అని వెనకడుగు వేస్తుంది.
Recommended Video


ప్రేమను చూపించిన జానకి
ఇక రుక్మిణి జానకి మేనల్లుడిని ఆమె చేతిలో పెట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ బాబు బారసాలకు రావాలి అని.. కుటుంబ పంతాలకు పోయి ఈ పసివాడికి జరగాల్సిన ఈ వేడుకను జరగనివ్వకుండా చేయడం ఏమాత్రం న్యాయం కాదు అని తెలియజేస్తుంది. ఇక రుక్మిణీ మాట్లాడిన విధానం జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చుతుంది. రామచంద్ర కూడా ఆమె మాటలకు కరిగిపోయి తల్లితో సహా యోగి కొడుకు బారసాల కి వాళ్ళ ఇంటికి వెళతారు. అక్కడ మళ్ళీ జానకి తన అత్త గారి పై ప్రేమ చూపిస్తుంది. తన మేనల్లుడిని మా అత్తగారు తన మంచి మనసుతో ఉయ్యాలలో వేస్తే బాగుంటుంది అని జానకి చెప్పడంతో అప్పుడు జ్ఞానాంబ మనసులో తెలియని ఉద్వేగం కలుగుతుంది. మరి ఈ పరిణామాలతో జ్ఞానాంబ మనసు ఎలా మారుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











