twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu April 5th: జ్ఞానాంబపై మరోసారి పోలీస్ కేసు.. యోగి చేసిన పనికి చిక్కుల్లో జానకి!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలువు తిరుగితొంది. జానకి అబద్ధాలు చెప్పిందని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన జ్ఞానాంబపై రివెంజ్ తీర్చుకునేందుకు జానకి సోదరుడు యోగి రంగంలోకి దిగుతాడు. జానకి తప్పులకు రామచంద్ర కూడా మరొక కారణం అని తెలుసుకున్న జ్ఞానాంబ కొడుకు రామచంద్ర ను కూడా బయటకు నెట్టివేస్తుంది. మరోవైపు జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది.

    రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకూ తన స్థాయిని పెంచుకుంటుంది. గత వారం వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 272 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    దగ్గరవ్వాలని చూసినా..

    దగ్గరవ్వాలని చూసినా..

    తల్లిని విడిచి ఉండలేక రామచంద్ర తన ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. రామచంద్రతో పాటు జానకి కూడా అనేక కష్టాలు పడుతూ ఎప్పటికైనా అత్తగారికి దగ్గరవుతాము అనే నమ్మకంతో ఉంటుంది.

    అయితే జానకి, రామచంద్రం ఇద్దరూ కూడా ఎంతో దగ్గరవ్వాలని చూసినా కూడా జ్ఞానాంబ మాత్రం కొడుకు కోడలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. పరిస్థితులు కూడా వారికి విరుద్ధంగా మారుతూ ఉంటాయి. మరోవైపు మల్లిక కూడా జానకి పై లేని పోని అబద్ధాలు చెబుతూ మరింత కోపానికి గురి చేస్తుంది.

    మల్లిక సంతోషంగా..

    మల్లిక సంతోషంగా..

    ఉగాది పండుగ సందర్భంగా జ్ఞానాంబ ఇంట్లో ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ముందుగా మల్లిక అందరిని పిలిచి ఉగాది పచ్చడి ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ రామచంద్ర జానకి ఇంట్లో లేకపోవడంతో అందరూ కూడా బాధ లోనే ఉంటారు. ఈ ఉగాది సెలబ్రేషన్స్ కూడా ఆనందంగా లేవని మాట్లాడుకుంటూ ఉంటారు.

    కానీ మల్లిక మాత్రం జానకి లేదన్న ఆనందంతో ఉంటుంది. ఇక ఇంట్లో ఎప్పటికీ కూడా తన మాట శాసనం అని సంతోష పడుతుంది. అంతేకాకుండా జానకిని అత్తయ్య గారికి మరింత దూరం చేయాలని ఒక ప్లాన్ కూడా వేయాలని ఆలోచిస్తుంది.

    ఉగాది సెలబ్రేషన్స్

    ఉగాది సెలబ్రేషన్స్

    జ్ఞానాంబ ఇంట్లో వాళ్లందరినీ ప్రత్యేకంగా పిలిపించి ఉగాది పచ్చడి తీసుకోవాలి అని చెబుతోంది. దీంతో మల్లిక అందని తన అత్తగారి దగ్గరికి తీసుకోని వచ్చి ఉగాది పచ్చడి ఇస్తుంది. ఇక అటువైపు నుంచి చూస్తున్న జానకి రామ చంద్ర ఇద్దరు కూడా వారి కుటుంబ సభ్యులను చూసి ఎంతగానో ఆవేదనకు గురి అవుతారు.

    అయితే రామచంద్ర తన తల్లిని తలుచుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ప్రతి ఏడాది కూడా ఉగాది పండుగ రోజు మా అమ్మ నాకు తలంటు స్నానం చేయించేది అంటూ.. ఇక ఇప్పుడు మీరు చేస్తున్నారు అని జానకికి చెబుతాడు. ఇక అటువైపు నుంచి రామచంద్ర మాటలు విన్న జ్ఞానాంబ కొంత మనోవేదనకు గురి అవుతుంది.

    ఆ కోరిక నెరవేరుతుంది

    ఆ కోరిక నెరవేరుతుంది

    రామచంద్ర జానకి ఇద్దరు కూడా జ్ఞానాంబకు వినిపించేలా ఎప్పటికైనా మన కుటుంబాలు ఒకటి కావాలి అని గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న గోవింద రాజులు తొందరగానే మీ కోరిక నెరవేరుతుంది అంటూ భార్య జ్ఞానాంబ ముందే సంతోషంగా చెబుతూ ఉంటాడు.

    ఇక మల్లిక ఆలోచన విధానాన్ని చూసి నువ్వు అనుకున్న కోరికలు మాత్రం జరగదు అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మల్లిక మనసులో అనుకుంటున్న ప్రతి విషయాన్ని కూడా గోవిందరాజులు బయటకు చెబుతూ అందర్నీ నవ్విస్తాడు. ఇక మల్లిక గోవిందరాజులుపై కోపాన్ని చూపిస్తుంది.

    ప్రత్యేకంగా పూజలు

    ప్రత్యేకంగా పూజలు

    ఇక గుడికి వెళ్ళిన జానకి రామచంద్ర ఇద్దరు కూడా వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా పూజ చేయించి ఆ దేవుడిని ప్రార్థిస్తారు. తల్లిని తన భర్త ఏ మాత్రం విడిచిపెట్టి ఉండలేడు అని అందుకే ఇప్పటికైనా వాళ్ళని మళ్లీ ఒకటి చేయాలి అని జానకి దేవుని ప్రార్ధిస్తుంది. మరోవైపు రామచంద్ర కూడా అదే తరహాలో కోరుకుంటూ తన తల్లి జానకిని అని తప్పుగా అర్థం చేసుకుంతొంది అని ఆ అపోహలు తొలగి పోయి మళ్లీ ఎప్పటికైనా తమ కుటుంబాన్ని ఒకటి చేయాలి అని ప్రార్థిస్తాడు.

    జ్ఞానాంబ అరెస్ట్

    జ్ఞానాంబ అరెస్ట్

    ఇక మరో వైపు జానకి అన్నయ్య యోగిబాబు ఎవరూ ఊహించని విధంగా ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన యోగిబాబు తన చెల్లి జానకిని ఆమె అత్తగారు జ్ఞానం కష్టాలు పెడుతోంది అనే గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు అందుకు సంబంధించిన వీడియోలు కూడా పోలీసులకు చూపిస్తాడు.

    దీంతో పోలీసులు జ్ఞానాంబను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళతారు. అదే క్రమంలో అటువైపుగా వెళ్తున్న రామచంద్ర పోలీస్ జీప్ లో తల్లి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మరి జానకి అన్నయ్య చేసిన పొరపాటు వలన మళ్ళీ జ్ఞానాంబ జానకి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 272
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X