Janaki Kalaganaledu April 6th: జానకి ముందే యోగిని కొట్టిన రామ.. పొలీస్ స్టేషన్లో జ్ఞానాంబ!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతొంది. ఐపీఎస్ కావాలి అని ఎన్నో కలలు కన్నా జానకి చివరికి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఊహించని అనుభవాలను ఎదుర్కొంటుంది. భర్త సహకారం ఉన్నప్పటికీ అత్తగారు చదువుకునే కోడలు అంటే ఏమాత్రం ఇష్టం లేదు అన్నట్లు గా వ్యవహరిస్తుంది. ఇక జానకి జీవితం ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో మరొక సమస్య కూడా ఎదురవుతుంది. జానకి అన్నయ్య పోలీస్ కేసు నమోదు చేయడంతో జ్ఞానాంబ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది.

దీంతో జానకి అన్నయ్యను రామచంద్ర కొట్టడానికి వెళతాడు.. పరిస్థితులు అన్నీ సర్దుకుంటున్న సమయంలో మళ్లీ యోగి రాకతో ఊహించని వాతావరణం నెలకొంది. దీంతో జానకి మరింత టెన్షన్ లో పడుతుంది. రేటింగ్స్ విషయంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకూ తన స్థాయిని పెంచుకుంటుంది. గత వారం వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 273 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సందిగ్ధంలో జ్ఞానాంబ

సందిగ్ధంలో జ్ఞానాంబ

ఉగాది పండుగ సందర్భంగా జానకి రామ చంద్ర ఇద్దరు కూడా వారి కుటుంబం మళ్లీ ఒకటి కావాలి అనే గుడికి వెళ్లి మరీ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొడుకు బాధను చూసి జ్ఞానాంబ కూడా మళ్ళీ ఇంటికి పిలిపించుకోవాలని అనుకుంటుంది. కానీ జానకి చేసిన తప్పులు ఆమెను సందిగ్దంలో పడేస్థాయి. అయినప్పటికీ కూడా కొడుకు కోసం జానకి చేసిన పొరపాట్లను మర్చిపోయి దగ్గరికి తీసుకోవాలని అనుకుంటుంది. కొడుకును మళ్ళీ దూరం పెడితే జానకి చదువుకున్న అహంకారం వల్ల అతని జీవితం మరింత సమస్యలో పడే అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని.. మళ్ళీ కొడుకు జీవితంలో కూడా అలంటి పరిణామాలు చోటు చేసుకోవద్దు అని ఆలోచిస్తుంది.

గృహహింస

గృహహింస

కొడుకుతో సహా జానకిని కిడా ఇంట్లోకి తీసుకురావాలి అని జ్ఞానాంబ అనుకుంటుంది. అయితే ఈ తరుణంలో అప్పుడే జ్ఞానాంబ ఇంటికి పోలీసులు వస్తారు. ఆ విషయాన్ని మల్లిక వెళ్లి అత్త జ్ఞానాంబకు చెబుతోంది. మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు అని జ్ఞానాంబ ఆశ్చర్యపోతుంది. ఇక వెళ్లి చూడగా పోలీసులు జ్ఞానాంబ అరెస్టు చేయాలని అనుకుంటున్నట్లు గా చెబుతారు. కారణం ఏమిటి అని అడుగగా జానకి అన్నయ్య యోగి కేసు పెట్టినట్లు గా చెబుతారు. కోడలిని మీరు హింసకు గురి చేస్తున్నారు అని గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గా వివరణ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతారు.

జ్ఞానాంబను అరెస్ట్ చేయాల్సిందే

జ్ఞానాంబను అరెస్ట్ చేయాల్సిందే

జానకిని మేము కన్న కూతురిలా చూసుకున్నాము అలాంటిదే మేము హింసకు గురి చేయడం ఏమిటి అని గోవిందరాజులు కూడా పోలీసులని ప్రశ్నిస్తాడు. ఇక అవి పట్టించుకోని పోలీసులు జ్ఞానాంబను ఇప్పుడు అరెస్టు చేయాల్సిందేనని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారించాలని అనుకుంటున్నట్లుగా చెబుతారు. అంతేకాకుండా తమ డ్యూటీకి కూడా అడ్డు రావద్దు అని చెప్పడంతో గోవిందరాజులు అలాగే జ్ఞానాంబ పిల్లలు కూడా షాక్ అవుతారు. అయితే జానకి వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకొని అరెస్టు చేయవలసిందిగా జ్ఞానాంబ చిన్న కొడుకు విష్ణు చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినరు.

మరింత చిచ్చు పెట్టిన మల్లిక

మరింత చిచ్చు పెట్టిన మల్లిక

ఇక మల్లిక తోడు దొరికిందే అవకాశం అనుకొని జానకి కావాలని ఇదంతా చేయిస్తుంది అని అబద్ధాలు చెబుతుంది. పోలీసులు వచ్చే సమయానికి జానకి ఎక్కడికి వెళ్ళింది అనే అనుమానాన్ని కూడా చెప్పడంతో జ్ఞానాంబ అది నిజమా అని అనుకుంటుంది. జ్ఞానాంబ మరొక ఆలోచన చేయకుండా పోలీసులు చెప్పినట్లుగా వ్యాన్ లో కూర్చుంటుంది. ఒకసారి ఆలోచించాలి అని గోవిందరాజులు విష్ణు అఖిల్ బ్రతిమాలినప్పటికి కూడా పోలీసులు ఏమాత్రం ఆగకుండా వెళ్లిపోతారు.

జానకి పై మరింత ద్వేషం

జానకి పై మరింత ద్వేషం

ఇక ఆ విషయాన్ని గమనించిన మల్లిక మనసులో ఎంతగానో సంతోషం పడుతుంది. ఈ వివాదంతో జానకి పని అయిపోయినట్లే అని అనుకుంటుంది. జ్ఞానాంబ కూడా తన మనసులో జానకి పై మరింత ద్వేషాన్ని నిలుపుకుంటుంది. మన కుటుంబం పరువు ఈరోజు జానకితో తుడిచిపెట్టుకుపోయింది అని ఆమెను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించను అని శపధం చేస్తుంది.

యోగిని కొట్టిన రామచంద్ర

యోగిని కొట్టిన రామచంద్ర

ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే అక్కడ జానకి అన్నయ్య యోగిబాబు ఉంటాడు. లోపలికి రాగానే అతను తన విషయాన్ని చెబుతాడు. నేను జానకి విషయంలో చదువుకున్న విషయాన్ని దాచి ఉండవచ్చు కానీ జానకి చాలా మంచిది.. నీ మీద ఎంతో గౌరవం ఉంది. మీ అందరిని ఈ ఉగాది సందర్భంగా నా కొడుకు బారసాల కు ఇంటికి పిలవాలి అని అనుకున్నాను. కానీ ఇలా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వస్తుందని ఊహించలేదు అని అంటాడు. ఇక ఆ తర్వాత యోగిబాబు కేసు వేసినట్లుగా తెలుసుకున్న రామచంద్ర అతన్ని కొట్టడానికి వెళతాడు. వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా యోగి ఏమాత్రం వెనక్కి తగ్గడు. జానకి కూడా తన అన్న యోగిమీ హెచ్చరిక చేస్తుంది. మరి ఈ పరిణామాలతో జానకి జీవితం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X