twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu April 7th: యోగి పిచ్చి పని.. ఒక్క మాటతో జానకి మనసు విరిచేసిన రామచంద్ర!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఇటీవల కాలంలో టాప్ సీరియల్ గా క్రేజ్ అందుకుంటోంది. సీరియల్ లోని అసలు కథ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం అసలైన ట్రాక్ లోకి రావడంతో రోజురోజుకు సరికొత్త థ్రిల్ ను కలోగిస్తోంది. ఒకవైపు ప్రేమ మరొకవైపు ఆశయం అలాగే కుటుంబ పరిస్థితులు.. ఇలా అన్ని రకాల అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలి అని జానకి అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా చదువుకుంటూ ఉంటుంది.

    ఇక ఆమెకు అండగా నిలిచిన భర్త ఊహించని విధంగా తల్లి నుంచి ఆగ్రహానికి గురి అవుతాడు. ఒక అబద్ధం కారణంగా అత్త జ్ఞానాంబ కొడుకు కోడలిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఈ క్రమంలో జానకి అన్నయ్య చేసిన పిచ్చి పని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక ఈ సీరియల్ గత వారం వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 274 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    జ్ఞానాంబ ఆగ్రహంతో..

    జ్ఞానాంబ ఆగ్రహంతో..

    వెన్నెల కు పెళ్లి చేయాలి అని ఎంతగానో తాపత్రయపడి జ్ఞానాంబకు జానకి నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురవుతుంది. ఆమె అబద్ధాలు చెప్పి వెన్నెల ప్రేమించిన వ్యక్తితోనే పెద్దలు కుదిర్చిన వివాహం గా జరిపించాలని ప్లాన్ వేస్తుంది. ఇక ఈ విషయం జ్ఞానాంబకు తెలిసేవిధంగా మల్లిక అసలు నిజం చెబుతుంది. దీంతో జానకి పై అత్త ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా కొడుకు కోడలు ఇద్దరినీ కూడా బయటకు పంపించేస్తుంది. ఇక ఎటు వెళ్ళని పరిస్థితి లో రామచంద్ర జానకి ఇద్దరు జ్ఞానాంబ ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకుని అక్కడ జీవిస్తూ ఉంటారు.

    అలా జరగకూడదని..

    అలా జరగకూడదని..

    ఇక పరిస్థితుల వలన తన కొడుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు అనే జ్ఞానాంబ గ్రహిస్తుంది. జానకి చేసిన తప్పు కారణంగా నా కొడుకు శిక్ష అనుభవించాల్సి అవసరంలేదు అని మళ్ళీ వాళ్ళను ఇంటికి పిలిపించుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే గతంలో చదువుకున్న అమ్మాయి కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని జ్ఞానాంబ ఆలోచిస్తుంది. అందుకే రామచంద్ర విషయంలో అలాంటి పరిణామాలు జరగకూడదనే వెంటనే ఇంట్లోకి తీసుకొని అతనికి అన్ని నచ్చచెప్పాలి అని అనుకుంటుంది.

    అరెస్ట్ చేయడంతో..

    అరెస్ట్ చేయడంతో..

    అయితే ఈ క్రమంలో జానకిని ఆమె అత్తగారు జ్ఞానాంబ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు అని యోగి గ్రహిస్తాడు. అతనికి మల్లిక లేనిపోని అబద్ధాలు చెప్పడంతో నిజమే అనుకుంటాడు. ఇక వెంటనే అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇస్తాడు. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మరి అరెస్టు చేస్తారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న రామచంద్ర కూడా అది ఆశ్చర్యపోతాడు. వెంటనే స్టేషన్ బయలుదేరుతాడు. అయితే జానకి తన ఆలోచనతోనే యోగితో ఈ కేసు పెట్టించింది అని మల్లిక అందరినీ నమ్మిస్తుంది.

    తప్పుగా అర్థం చేసుకున్న జ్ఞానాంబ

    తప్పుగా అర్థం చేసుకున్న జ్ఞానాంబ

    అయితే జ్ఞానాంబ పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే అక్కడ యోగిబాబు ఉంటాడు. అతను తన చెల్లిని పెట్టిన కష్టానికి ప్రతిఫలంగా మీపై రివెంజ్ తీర్చుకుంటాను అని అంటాడు. అప్పుడే జ్ఞానాంబ భర్త గోవిందరాజులు అలాగే అతని కొడుకు కూడా అక్కడికి వస్తారు. ఇక పోలీస్ స్టేషన్ మంచి యోగి బయటకు వెళుతుండగా గోవిందరాజులు అతన్ని ఆప నువ్వు పొరపాటు పడుతున్నావు.. జానకిని ఇబ్బంది పెట్టలేదు అని బ్రతిమాలతారు.

    కానీ అతను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక అప్పుడే పోలీస్ స్టేషన్ కు వచ్చిన రామచంద్ర తల్లిని ఏం జరిగింది అని అడుగుతాడు. కానీ ఏమి చెప్పకుండా అక్కడినుంచి రామచంద్రను వెళ్లిపొమ్మని చెప్పండి అని తన భర్తకు చెబుతుంది. అంతేకాకుండా అతని నుంచి చెయ్యిని విదిలించుకొని కోపం గా చూస్తుంది. రామ, జానకికి ముందే పోలీస్ కేసు విషయం తెలుసని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

    నిజం తెలుసుకున్న రామ

    నిజం తెలుసుకున్న రామ

    ఇక తల్లి అలా ప్రవర్తించడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అతను బయటకు వచ్చి ఏం జరిగింది అని అతని తండ్రిని అలాగే తమ్ముళ్ళని అడుగుతాడు. అయితే యోగి బాబు కేసు పెట్టించాడు అని తెలియడంతో రామచంద్ర చాలా కోపంతో అతన్ని అడిగేందుకు వెళ్తాడు. ఇక అప్పటికే జానకి ఇంటికి చేరుకొని అసలు విషయం తెలుసుకుంటుంది. నువ్వే మీ అన్నయ్యతో కలిసి మా అత్తగారు మీద పోలీస్ కేసు పెట్టవు కదా.. పోలీసులు అరెస్టు చేసి తీసుకొని వెళ్ళారు అని మల్లిక చెప్పగానే జానకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.

    నువ్వు చేసిన పిచ్చి పనికి..

    నువ్వు చేసిన పిచ్చి పనికి..

    ఇక అదే సమయంలో అక్కడికి యోగి కూడా వస్తాడు.పోలీస్ స్టేషన్ కి వెళ్లి నువ్వు కూడా కంప్లైంట్ ఇవ్వాలి అని చెబుతాడు. కానీ జానకి అతని వెంటనే కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి అని.. కుటుంబం అన్నాక చాలా గొడవలు ఉంటాయి వాటిని మాట్లాడుకునే సర్దుకుపోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అంటుంది. అంతే కాకుండా నువ్వు చేసిన పిచ్చి పనికి ఇప్పుడు నేను ఇబ్బందులు పడాల్సి వస్తోంది అని ఆవేదన చెందుతుంది. ఇక జానకి అలా చెప్పినప్పటికీ కూడా యోగి ఏమాత్రం ఆలోచించడు.

    జానకిపై రామ అసహనం

    జానకిపై రామ అసహనం

    ఇక ఆ తర్వాత రామచంద్ర ఇంటికి వచ్చి యోగిబాబు చొక్కా పట్టుకొని అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలి అని చెబుతాడు. అయినప్పటికీ యోగి ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఈ క్రమంలో జానకి తన భర్త ను కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా రామచంద్ర భార్యపై కూడా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తాడు. మీకు తెలియకుండానే మీ అన్నయ్య మా అమ్మ పై కేసు పెట్టాడా? అని అనగానే జానకి మనసు ముక్కలైనంత పని అవుతుంది. ఒక్కసారిగా ఆమె వెనుకడుగు వేసి దీనంగా చూస్తుంది. మరి వారి మధ్య దూరం ఈ గొడవతో ఎంత వరకు వెళుతుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 274
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X