Janaki Kalaganaledu April 8th: జానకిపై రామచంద్ర అనుమానం.. యోగి కారణంగా విడాకుల వ్యవహారం!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు సరికొత్త ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ కావాలి అనుకున్న జానకి అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు భర్త నుంచి సహకారం కూడా అందుతుంది. అయితే ఒక అబద్ధం కారణంగా అత్త జ్ఞానాంబ కొడుకు కోడలిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఈ క్రమంలో జానకి అన్నయ్య చేసిన పిచ్చి పని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది.
ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 275 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

యోగిని కొట్టిన రామ
తన చెల్లిని జ్ఞానాంబ కష్టాలు పెడుతోంది అనే యోగిబాబు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అయితే ఆ కంప్లైంట్ ను వెనక్కి తీసుకోవాలని రామచంద్ర యోగి పై భార్య ముందే కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వీలైనంత త్వరగా కేసు వెనక్కి తీసుకోవాలని లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ రామచంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహనికి లోనవుతారు.
అంతే కాకుండా తన తల్లి మంచిది కాకపోతే నువ్వు మా ఇంటి గుమ్మం కూడా తొక్కే వాడివి కాదు అని రామచంద్ర చెబుతాడు. అదేవిధంగా జానకి చదువుకోలేదు అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. అయినప్పటికీ కూడా మా అమ్మ ఒక్క మాట కూడా అనకుండా జానకిని కూతురిలా చూసుకుంది అని రామచంద్ర తల్లి మంచితనం గురించి చెబుతాడు.

జానకి ఎంత బ్రతిమాలినా..
ఇక రామచంద్ర ఎంత చెప్పినా కూడా యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసు వెనక్కి తీసుకునేది లేదని చెబుతాడు. ఆమె కూడా తప్పకుండా జైలు శిక్ష అనుభవిస్తేనే నువ్వు పడిన బాధలు అర్థం అవుతాయి అని చెబుతాడు. ఇక యోగి అలా మాట్లాడడంతో రామచంద్ర మరింత ఆగ్రహం తో కోపానికి గురి అవుతాడు.
మరో వైపు జానకి తన భర్త ను కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. దయచేసి కొంత సేపు మీరు ప్రశాంతంగా ఉండండి నేను మాట్లాడతాను అని ఎంతగానో బ్రతిమాలుతుంది. అయితే ఎంత బ్రతిమాలినా కూడా యోగి మాత్రం కేసును వెనక్కి తీసుకునేది లేదని నువ్వు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అని అందుకోసం పోలీస్ స్టేషన్ కు కూడా రావాలి అని యోగిబాబు చెబుతాడు.

జానకి పై రామచంద్ర అనుమానం
ఇక రామచంద్ర మరింత కోపానికి లోనవుతూ.. మరో గంటలో మా అమ్మ ఇంటికి రాకపోతే ఈ రాముడు రావణాసురుడు అవుతాడు అని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ అవేమి పట్టనట్లు యోగి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత రామచంద్ర జానకిని కూడా అనుమానిస్తాడు. మీకు తెలియకుండానే మీ అన్నయ్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడా అని అడగడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నేను అత్తయ్య గారి మీద ఎందుకు కేసు పెట్టిస్తాను అంటూ అసలు మా అన్నయ్య అమెరికా నుంచి తిరిగి వచ్చిన విషయం కూడా తనకు తెలియదని బాధపడుతుంది. కానీ రామచంద్ర మాత్రం జానకి చెప్పిన మాటలను నమ్మడానికి ఆసక్తిని చూపడు. అసలు మీ అన్నయ్య ఇక్కడ జరిగిన గొడవ గురించి మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ మరో మాట అనడంతో జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

మాట ఇచ్చిన జానకి
నిజంగా మా అన్నయ్య పోలీస్ కేసు పెట్టిన విషయం తనకు తెలియదని చెప్పిజ జానకి తప్పకుండా అత్తయ్య గారు ఇంటికి వచ్చేలా మా అన్నయ్య కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను అని రామచంద్ర కు మాట ఇస్తుంది. ఇక ఆ తర్వాత జానకి యోగి ఇంటికి వెళ్లి వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలి అని మరోసారి బ్రతిమాలుతుంది.
జానకి ఎంత చెప్పినా కూడా రామ ఏమాత్రం వెనక్కి తగ్గడు. దీంతో జానకి ఇప్పటికే తన జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసావు అని ఇప్పుడు మరో సమస్య సృష్టించి నా కాపురం పాడయ్యేలా చేస్తున్నావు అని బాధపడుతుంది.

విడాకులు తీసుకో..
అసలు మా అత్తయ్య గారి గురించి నీకు ఏమి తెలుసు అని పోలీసు కేసు పెట్టారు అని ప్రశ్నిస్తుంది. నువ్వు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినా కూడా నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఒక కన్నకూతురిలా ప్రేమించింది. అంత మంచే అత్తయ్య గారిని నువ్వు ఈరోజు పోలీస్ మెట్లు ఎక్కేలా చేశావు. ఈ గొడవతో నా జీవితం ఎలా మారుతుంది అనే విషయం నీకు అర్థం అవుతుందా అని అడుగుతుంది.
దీంతో యోగి ఇంతకు ముందు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ విధంగా అబద్దాలు చెప్పాను. కానీ అదే పనిగా కష్టాలపాలు చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నీకు విడాకులు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నాను నువ్వు కూడా మాతో పాటు అమెరికా వచ్చేయాలి అని యోగి జానకితో చెప్పడంతో ఒక్కసారిగా ఆమె షాక్ అవుతుంది.

నిజమే అంటూ షాక్ ఇచ్చిన జానకి
ఇక మరోవైపు జ్ఞానాంబ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చే బలం ఉన్నప్పటికీ కూడా అక్కడే ఉండిపోతుంది. గోవిందరాజులు వాళ్ళ అమ్మ మైరావతి పలుకుబడితో బయటకు తీసుకురావాలి అని అనుకుంటాడు. కానీ జ్ఞానాంబకు అలా ఇష్టం ఉండదు.
ఇక పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానకి ఊహించని విధంగా మా అత్తయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టారు కష్టాలు పెట్టారు అని పోలీసుల ముందు చెబుతుంది. దీంతో మల్లిక కూడా ఒక్క సారిగా షాక్ అవుతుంది. అసలు జానకి ఇంత త్వరగా ఎలా మనసు మార్చుకుంది అనే విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











