Janaki Kalaganaledu August 10th Episode: జానకి కోసం ఏకంగా దుప్పట్లోకి దూరిన రామచంద్ర!

జానకి కలగనలేదు వంద ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదట్లో మిగతా సీరియల్స్ కారణంగా కాస్త ప్రభావం పడినప్పటికి ఆ తరువాత మెల్లగా ట్విస్టులతో ఓ వర్గం జనాలను బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ ప్రేమ కథగా కొనసాగుతున్న ఈ సీరియల్ అభిమానుల సంఖ్యను కూడా అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ఈ సీరియల్ ఆ మధ్య కాస్త నీరసంగా సాగినట్లు అనిపించినప్పటికి 50 ఎపిసోడ్స్ అనంతరం సరికొత్త ట్విస్టులతో ఆసక్తిగా మారుతోంది.

మల్లిక చేస్తున్న కుట్రలకు జానకి బలిపశువులా మారాల్సి వస్తోంది. అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి శిక్షలు అనుభావించాల్సి వస్తోంది. ఇక మల్లిక కూడా రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ అయితే సరికొత్త కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. జానకి ఐపీఎస్ చదువు కోసం అబద్ధం చెప్పడంతో కథలో సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రామ అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 101వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

అసలు నిజం తెలిస్తే ఇంకా ఎం జరుగుతుందో?

అసలు నిజం తెలిస్తే ఇంకా ఎం జరుగుతుందో?

చిన్న కోడలు రేపిన చిచ్చులకు జ్ఞానాంబ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ప్రభావం పెద్ద కోడలు జానకిపై పడడంతో ఒక్కసారిగా కథ యూ టర్న్ తీసుకుంది. కేవలం అబద్ధం కారణంగా జ్ఞానాంబ ఆ స్థాయిలో కొప్పడింది అంటే ఇంకా చదువు గురించి తెలిస్తే ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అని జానకి కాస్త భయపడుతుంది. దీంతో జానకికి శిక్ష వేయాలని ఫిక్స్ అవుతుంది. స్వీట్స్ చేసే కార్ఖానాకు వెళ్లి స్వీట్స్ చేయడం నేర్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక మూడు రోజులు కూడా అక్కడే అక్కడే పడుకోవాలని కూడా అంటుంది. దీంతో జానకి అత్త మాటలకు మౌనంగానే ఆన్సర్ ఇస్తుంది.

జ్ఞానాంబ కూడా ఆవేదన చెందుతుంది.

జ్ఞానాంబ కూడా ఆవేదన చెందుతుంది.

మొత్తానికి మళ్ళి కాల్ చేసిన పొరపాటు వలన శిక్షను అనుభవించడానికి సిద్ధమైన జానకి కార్ఖానాలో కొత్త తరహా పనులను నేర్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంది. ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ జ్ఞానాంబ కూడా ఆవేదన చెందుతుంది. ఎలాగైనా జానకికి తన చేతులతో వంట చేసి తినిపించాలని కార్ఖానా కు వెళుతుంది. ఆ సమయంలో జ్ఞానాంబ చేసిన పనులను చూసిన అత్త ఎంతగానో మురిసిపోతుంది. అందరూ భోజనం చేయడానికి వెళ్ళండి అని కూడా చెబుతోంది. ఇక జానకిని కూడా భోజనం చేయడానికి రమ్మని తనతోపాటు బయటకు తీసుకు వెళుతుంది.

మల్లికను నమ్మకూడదు అంటూ

మల్లికను నమ్మకూడదు అంటూ

ఇక మల్లికా పై ప్రేమను చూపించిన జనాకికి మరోసారి హితబోధ చేస్తు ఎవరిని అంతా ఈజీగా నమ్మకూడదు అంటూ మోసానికి పోకూడదని కూడా జ్ఞానాంబ వివరణ ఇస్తుంది. మల్లికను ఏ విషయంలో కూడా అంత సులువుగా నమ్మవద్దని ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా తెలియదని వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది అందుకు దానికి కూడా జ్ఞానాంబను గౌరవించే సరేనని అని జానకి చెబుతోంది.

రామచంద్ర అప్సెట్

రామచంద్ర అప్సెట్

ఇక మరోవైపు రామచంద్ర పడుకునే సమయంలో భార్య జానకి గుర్తుచేసుకుంటూ అప్సెట్ అవుతూ ఉంటాడు. కార్ఖానాలో జానకి ఎలా నిద్రపోతోంది తనలో తనే మదనపడుతూ ఉంటాడు. ఇక ఆమె పుస్తకాలను చూసిన రామచంద్రన్ ఈ సమయానికి చదువుకోవాల్సిన జానకి గారు మొత్తం కార్ఖానాలో బాధపడుతూ ఉంటారని ఆలోచిస్తాడు. ఇక ఎలాగైనా ఆ పుస్తకాలను జానకి దగ్గరికి పంపాలని అనుకుంటాడు. అందుకు రామచంద్ర మల్లిక నుంచి సహాయం తీసుకుంటాడు.నాటకాలు ఆడినప్పటికీ..

 మరోవైపు మల్లికను కూడా కార్ఖానాకు వెళ్లాలని ఆదేశాలు జారీ

మరోవైపు మల్లికను కూడా కార్ఖానాకు వెళ్లాలని ఆదేశాలు జారీ

అత్త మరోసారి బెదిరిస్తుంది మల్లిక అసంతృప్తితోనే వెళుతుంది. వెళ్లేముందు కాస్త నాటకాలు ఆడినప్పటికీ ముందు ఆమె బాధ్యతలు ఏ మాత్రం చెల్లవు. ఇక చివరికి వెళ్ళు అని కోపంతో చెప్పడంతో మల్లికా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్తుంది. అదే సమయంలో మల్లిక చూసిన రామచంద్రన్ సంచిలో ఉన్న పుస్తకాలను ఎలాగైనా జానకికి అందజేయాలని చెబుతాడు. అయితే అందుకు మల్లిక ఈ వింత పెద్ద పుస్తకాలను జానకికి ఎందుకని మరొక అనుమానం వ్యక్తం చేస్తుంది. రామచంద్ర ఇది కేవలం షాప్ లో పొట్లాలు చుట్టడం కోసమే అని అబద్ధం చెబుతాడు. అలాగే కార్ఖానా కి వెళ్ళగానే జానకితో ఫోన్ మాట్లాడించు అని కూడా రామ రిక్వెస్ట్ చేస్తాడు.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
దుప్పట్లో దూరిన రామచంద్ర

దుప్పట్లో దూరిన రామచంద్ర

అనుకున్నట్లుగానే కార్ఖానా కి వెళ్ళిన మల్లిక అక్కడ జానకి మాదిల్ చిచ్చు రేపాలని ప్రయత్నం చేస్తుంది. అత్త కోడళ్లను వేరు చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ మాటలను జానకి ఏమాత్రం పట్టించుకోదు. ఇక అదే సమయంలో రామచంద్ర జానకికి ఫోన్ చేయడంతో జానకి నేను సంతోషంగానే ఉంటున్నాను అంటూ వివరణ ఇస్తుంది. అలాగే స్వీట్స్ చేసే సమయంలో కాస్త చేయి కాలినట్లు కూడా చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందో పదే పదే గుర్తుకు వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇక లాభం లేదని రామచంద్ర జానకిని చూడడం కోసం దొంగచాటుగా కార్ఖానాకు వస్తాడు. అంతేకాకుండా జానకి పడుకొని ఉండగా ఆమె దుప్పట్లో కి వెళతాడు. ఇక ఆ ఘటన చూసిన మల్లిక ఎలాగైనా ఈ విషయాన్ని అత్తకు చెప్పాలని ప్లాన్ చేస్తుంది. మరి రామచంద్ర జానకి నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు రేపటి ఎపిసోడ్ లో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X