Janaki Kalaganaledu August 10th: కథలోకి మల్లిక కోరుకున్న కొత్త క్యారెక్టర్.. జ్ఞానాంబ గుడ్ న్యూస్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 363 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

ఒప్పుకున్న జ్ఞానాంబ
రామచంద్ర సహకారంతో మొన్నటి వరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లిన జానకి ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించడంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే జానకి ఐపిఎస్ చదువుకోవడం తొడి కోడలు మల్లికకు ఏమాత్రం నచ్చదు. అందుకే ఆమెను ఏదో ఒక రకంగా అత్త ముందు దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. అయితే మొన్నటి వరకు జ్ఞానాంబ కూడా జానకి ఐపిఎస్ చదువుకోవడం తనకు ఇష్టం లేదు అని అంటుంది. కానీ ఆమె కోరికను తెలుసుకొని అలాగే కొడుకు రామచంద్ర కూడా తన భార్యను చదివించాలని అనుకుంటున్నట్లు గుర్తించి జ్ఞానంగా అందుకు ఒప్పుకుంటుంది.

టెన్షన్ పడకుండా
అయితే జ్ఞానాంబ కొన్ని షరతులు కూడా విధిస్తుంది. నీ చదువు ఈ ఇంట్లో ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు అని ఒకవైపు నీ చదువుకొని కొనసాగిస్తూనే మరొకవైపు ఇంటి బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహించాలని అని కోడలిగా మీ బాధ్యత నువ్వు తెలుసుకోవాలి అని కూడా జ్ఞానాంబ ఆమెకు షరతులు విధిస్తుంది. ఇక ఎప్పుడైనా సరే నీ వల్ల నీ చదువు కారణంగా ఈ ఇంట్లో ఇబ్బందులు తలెత్తినా అలాగే నీ భర్త రామచంద్ర కు ఇబ్బంది కలిగించినా కూడా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని ఆ తరువాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో కూడా తనకు నాకు తెలియదు అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక అత్తయ్య ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా జానకి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఒప్పుకుంటుంది. మీరు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను అంటూ జానకి సంబరపడిపోతుంది.

కథలో కొత్త క్యారెక్టర్
అయితే మరోవైపు చిన్న కోడలు మల్లిక మాత్రం జానకి చదువుకుంటూ ఉంటే ఏమాత్రం ఓర్చుకోలేక పోతుంది. జానకిస్థాయి అంతకంతకు పెరిగిపోతోంది అని ఎలాగైనా ఆమెను అత్త ముందు దోషిగా నిలబెట్టాలి అని కూడా ఆలోచిస్తుంది. అయితే మల్లికా ఎన్ని ఎత్తులు వేసిన కూడా జానకి మాత్రం చాలా తెలివిగా వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరొకవైపు ఈ కథలోకి కొత్త క్యారెక్టర్ వస్తుంది. మల్లిక ఎక్కువగా చికెన్ తినేందుకు ఇష్టపడుతుంది. అయితే ఇంట్లో మాత్రం ఎవరు నాన్ వెజ్ తినరు. ఈ క్రమంలో మల్లికా అత్తగారికి వచ్చే చిన్న కోడలు మాత్రం నాన్ వెజ్ తినే అమ్మాయి ఉండాలి అని కోరుకుంటుంది. ఇక అనుకున్నట్లుగానే అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఒక నాన్ వెజ్ లవర్.

జానకి సాహసం
అయితే ఆమెకు జానకితో అంతకుముందే పరిచయం ఏర్పడుతుంది. జెస్సి అనే ఆ అమ్మాయి ఒక దగ్గర నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొందరు ఆమె మెడలో ఉన్న గొలుసును తీసుకొని పారిపోతూ ఉంటారు. ఇక జానకి ఎంతో చాకచక్యంగా ధైర్యంగా వారికి అడ్డుపడి ఆ అమ్మాయికి గొలుసు ఇస్తుంది. అలాగే ఆమె జానకి చేసిన మేలుకి థాంక్స్ చెప్పడంతో పరిచయం ఏర్పరచుకుంటుంది.

అఖిల్ చాటింగ్
ఇక జానకి అక్కడి నుంచి ఇంటికి రాగానే జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ చదువుకోకుండా ఫోన్ చూస్తూ చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జానకి కాస్త అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా అతను నేను చదువుకుంటున్నాను అని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత జానకి ఏమీ అనకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. అనంతరం హాల్ లో ఉన్న మల్లిక తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో జానకి రామచంద్ర ఇద్దరు కూడా అర్ధరాత్రి నైట్ కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటారు.
Recommended Video


జానకి చదువు కోసం..
ఇక అప్పుడే జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు వస్తారు. జానకి అర్ధరాత్రి కోచింగ్ సెంటర్ కు వెళ్లడానికి వీలు లేదు అని చెప్పడంతో మొదట వారందరూ కూడా షాక్ అవుతారు. కానీ మల్లిక కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత జ్ఞానాంబ మరొక ట్విస్ట్ ఇస్తుంది. జానకి ఇకనుంచి ఉదయం పూట కోచింగ్ సెంటర్ కు వెళ్ళవచ్చు అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మరొకవైపు మల్లికా ఆమె కోసం ఖర్చు చేసే డబ్బు ఉమ్మడి కుటుంబంది కదా అని అడుగుతుంది. కానీ అందుకు జ్ఞానాంబ ప్రభుత్వ సహాయంతోనే జ్ఞానాంబ కోచింగ్ తీసుకుంటుందని చెప్పడంతో మల్లికా మళ్ళీ షాక్ అవుతుంది. మరి రాబోయే రోజుల్లో మల్లిక ఇంకా ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











