For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 11th: మరోసారి తప్పు చేసి దొరికిపోయిన మల్లిక.. జ్ఞానాంబ చివాట్లు!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 363 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  మల్లిక అసూయ

  మల్లిక అసూయ

  జానకి ఐపిఎస్ చదువును కొనసాగించాలని జ్ఞానాంబ చెప్పడంతో జానకి ఎంతగానో సంతోషపడుతుంది. మొన్నటివరకు అసలు చదివే వద్దని చెప్పిన అత్తగారు హఠాత్తుగా అలా చదువుకోమని చెప్పడంతో ఆమె సంతోషానికి అవధులు ఉండవు. రామచంద్ర కూడా తల్లి నిర్ణయానికి ఎంతగానో ఆనందపడతాడు. కొడుకుకు భార్య చదువు కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అనే అనుమానాలతో జ్ఞానాంబ నిన్నటి వరకు కాస్త కన్ఫ్యూజన్లో ఉంటుంది. అయితే అందరూ నచ్చ చెప్పడంతో ఆమె ఒప్పుకుంటుంది కానీ చిన్న కోడలు మల్లిక మాత్రం జానకి ఐపిఎస్ చదువుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎలాగైనా సరే జానకి చదువుని అడ్డుకోవాలి అని అంతేకాకుండా జానకిని ఇంట్లో నుంచి కూడా పంపించేయాలి అని అనుకుంటుంది. కానీ జానకి తెలివి కారణంగా ఆమె ప్లాన్స్ అన్నీ కూడా బెడిసి కొడతాయి.

   ఎంత మొత్తుకున్నా కూడా..

  ఎంత మొత్తుకున్నా కూడా..

  చిన్న కోడలు జానకి అనవసరంగా లేనిపోని ఆలోచనలతో అత్త చేత చివాట్లు తింటుంది. అయితే చికెన్ తినకూడదు అని ఇంట్లో ఆచారం అని చెప్పినప్పటికీ కూడా ఆమె తరచుగా నాన్ వెజ్ తినడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఇక భర్త ఎంత మొత్తుకున్నా కూడా అతని చేత చికెన్ తెప్పించుకుంతుంది. మొదట భర్త విష్ణు బయటనే తినవచ్చు కదా అని సలహా ఇచ్చినప్పటికీ కూడా మల్లికా ఏమాత్రం ఆలోచించకుండా కావాలనే ఇంట్లోనే తింటాను అని శబదం చేస్తుంది. మీ అమ్మ ఏం చేస్తుందో చూస్తాను అంటూ కూడా భర్తతో చాలెంజ్ కూడా చేస్తుంది.

  అనుమానంతో..

  అనుమానంతో..

  అయితే వారి బెడ్ రూమ్లో చాలా హ్యాపీగా చికెన్ తింటూ ఉండగా అప్పుడే మల్లికకు కారంతో నీళ్లు అవసరం పడతాయి. ఇక పరుగు పరుగున భర్త విష్ణు కిచెన్ రూమ్ లోకి వెళ్లే నీళ్లు తీసుకువస్తాడు. అయితే మధ్యలో వారి తల్లిదండ్రులు అడ్డుపడతారు. ఎందుకు అంత తొందరగా పరిగెడుతున్నావు అని చెప్పడంతో మల్లికకు కారం అవుతుంది అని చెప్పడంతో వాళ్లకి అనుమానం వస్తుంది. వెంటనే బెడ్ రూమ్ దగ్గరికి వచ్చి చూడగా మల్లికా చాలా హ్యాపీగా చికెన్ తింటూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరికి భయపడేది లేదు అంటూ ముఖ్యంగా మీ అమ్మగారికి అసలు భయపడను అని మాట్లాడుతుంది.

   దొరికిపోయిన మల్లిక

  దొరికిపోయిన మల్లిక

  దీంతో మల్లిక మాటలకు జ్ఞానాంబ బాగా కోపంతో ఊగిపోతుంది. వెంటనే మల్లికా అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో మల్లికా నోట మాట పడిపోతుంది. ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక ఇప్పటినుంచి మీరు ఇంట్లో భోజనం కూడా చేయడానికి వీలులేదు అని రెండు రోజులపాటు ఇలాగే ఉండండి అని శిక్ష వేస్తుంది. ఇక మరోవైపు జానకి తన భర్తతో ఏకాంతంగా గడుపుతుంది. భార్య చదువు కోసం రామచంద్ర నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. కరెంటు పోతే చదువుకోడానికి ఇబ్బంది అవుతుంది అని ఒక చార్జింగ్ లైట్ కూడా తీసుకువస్తాడు.

  ఆశీర్వాదం తీసుకున్న జానకి

  ఆశీర్వాదం తీసుకున్న జానకి

  ఆ తర్వాత జానకి ఉదయం ఇంటి పనులన్నీ కూడా చకచగా చేస్తుంది. ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు కోడలిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఆ విషయంలో గోవిందరాజులు ఆమెను మెచ్చుకుంటాడు. ఇక ఆ తర్వాత జానకి టిఫిన్ చేసి మరి కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో ఆమె తన భర్తతో కలిసి వెళ్లాలని అనుకుంటుంది. ఇక వెళ్ళేముందు అత్తగారి మామ గారి ఆశీర్వాదం కూడా తీసుకోవడంతో అందరూ సంతోషపడతారు అయితే ఆ తొందరపాటులో జానకి తన టిఫిన్ బాక్స్ తీసుకోవడం మర్చిపోతోంది.

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
   మరోసారి జ్ఞానాంబ అప్సెట్

  మరోసారి జ్ఞానాంబ అప్సెట్

  ఇప్పుడే టిఫిన్ బాక్స్ మర్చిపోతున్నావు అంటే నీ చదువు కారణంగా రేపు నీ భర్తను కూడా నిర్లక్ష్యం చేస్తావేమో అని అత్తగారు మరోసారి ఆవేదన చెందుతారు. అలాంటిది ఏమీ లేదు అని రామచంద్ర మరోసారి మద్దతు ఇస్తాడు. అయినప్పటికీ జ్ఞానాంబ మాత్రం జానకి చదువు విషయంలో కొంత అనుమానంతోనే ఉంటుంది. ఇక ఆ తర్వాత జానకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా నేను కూడా వస్తాను అంటూ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ప్రిన్సిపాల్తో మాట్లాడాల్సి ఉంది అని చెబుతుంది. దీంతో జానకి కూడా అందుకు ఒప్పుకుంటుంది. మరోవైపు మల్లిక మాత్రం వారందరూ కూడా బయటికి వెళ్లిపోతే బయటికి వెళ్లి ఏదైనా తిని రావచ్చు అని అనుకుంటుంది. మరి ఈ క్రమంలో జ్ఞానాంబ జానకి పై అలాగే మల్లికపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial August 11th Episode 364
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X