For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 12th Episode: జానకి, రామ రొమాంటిక్ ముద్దులాట.. మల్లికకు మరో షాక్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇటీవల వంద ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ అసలు కథలోని ట్విస్టులు మెల్లగా బయటపడుతున్నాయి. భావోద్వేగమైన ఫ్యామిలీ ప్రేమ కథగా కొనసాగుతున్న జానకి కనగలలేదు సీరియల్ అభిమానుల సంఖ్యను కూడా అంతకంతకు పెంచుతూనే ఉంది. ఈ సీరియల్ మధ్యలో కాస్త స్లోగా డల్ గా సాగినట్లు అనిపించినప్పటికి 50 ఎపిసోడ్స్ అనంతరం సరికొత్త ట్విస్టులతో ఆసక్తి చూపిస్తోంది. అయితే చిన్న కోడలు మల్లిక చేస్తున్న కుట్రలకు పెద్ద కోడలు జానకి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి శిక్షలు అనుభావించాల్సి వస్తోంది. ఇక మల్లిక కూడా రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి.

  కొన్ని ఎపిసోడ్స్ అయితే సరికొత్త కామెడీని క్రియేట్ చేస్తున్నాయి. జానకి ఐపీఎస్ చదువు గురించి అబద్ధం చెప్పడంతో కథలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రామ అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 104వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  నిత్యం కంగారుపడుతూనే

  నిత్యం కంగారుపడుతూనే

  చిన్న కోడలు మల్లిక మోసపూరిత పనుల వలన జ్ఞానాంబ జానకిపై కోపం తెచ్చుకుంటుంది. ఇటీవల చెప్పుల విషయంలో అబద్ధం చెప్పిందనే కారణం వలన జానకికి జ్ఞానంబ శిక్ష వేస్తుంది. ఒక చిన్న విషయంలోనే అత్త జ్ఞానాంబ ఆ స్థాయిలో కొప్పడింది అంటే ఇక ఐపీఎస్ చదువు గురించి తెలిస్తే ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అని జానకి నిత్యం కంగారుపడుతూనే ఉంటుంది. ఇక స్వీట్స్ చేసే కార్ఖానాకు వెళ్లి స్వీట్స్ చేయడం నేర్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అక్కడే మూడు రోజులు పడుకోవాలని కూడా అంటుంది. దీంతో జానకి అత్త మాటలను గౌరవించి అక్కడకు వెళుతుంది.

  మెల్లగా ఆమె దుప్పట్లో కి వెళ్లి

  మెల్లగా ఆమె దుప్పట్లో కి వెళ్లి

  చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెరుగుతూ ఉన్నత చదువులు చదివిన జానకి కార్ఖానాలో పడుతున్న కష్టానికి రామచంద్ర అ కొంత ఆవేదన చెందుతాడు. ఇక సహనం కోల్పోయిన రామచంద్ర ఎలాగైనా రాత్రి భార్యను కలవాలని తల్లి మాటలు లెక్కచేయకుండా కార్ఖానా కి వెళ్తాడు. అక్కడ జానకి పడుకుని ఉండగా మెల్లగా ఆమె దుప్పట్లో కి వెళ్లి పడుకుంటాడు.

  గుట్టు రట్టు చేసేందుకు మల్లిక ప్రయత్నం

  గుట్టు రట్టు చేసేందుకు మల్లిక ప్రయత్నం

  ఇక రామచంద్ర రావడాన్ని గమనించిన మల్లికా వెంటనే తన మామయ్య గోవిందరాజులు కు ఫోన్ చేస్తుంది. తల్లి మాటలు ఏమాత్రం లెక్కచేయకుండా బావగారు జానకి దగ్గరికి వచ్చారు అని చాడీలు చెబుతుంది. అయితే రామచంద్ర ముందే తెలివిగా తన గదిలో పడుకున్నట్లుగా మెత్తలతో దుప్పట్ల తో కవర్ చేస్తాడు. తలుపు చాటు నుంచి చూసినా గోవిందరాజులు రామచంద్ర ఇక్కడే పడుకున్నాడు అని అనవసరంగా నువ్వు అబద్దాలు చెప్పకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

  షాక్ అయిన మల్లిక

  షాక్ అయిన మల్లిక

  అదే ఎలాగైనా వారిద్దరిని జ్ఞానంబకు పట్టించాలని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. విషయం తెలుసుకున్న జానకి వెంటనే భర్తను ఇంటికి పంపించాలని అనుకుంటుంది. బయటకు నెట్టేస్తూ సరదాగా నవ్వుతుంది. రామచంద్ర బయటకు వచ్చిన తర్వాత మల్లికా గుర్తు కూడా చెబుతుంది. కి తెలియకుండా మల్లిక విష్ణు బయట డబ్బులు సేవ్ చేసుకుంటున్నారని ఆ ఘటనను నేను కళ్ళారా చూశాను అని భర్తకు వివరిస్తుంది. ఇక ఆ విషయం తల్లికి తెలియకూడదని రామచంద్ర జానకి చెబుతాడు. తెలిస్తే అనవసరంగా మళ్లీ గొడవలు అవుతాయని అంటాడు.ఇక తలుపు చాటునుంచి ఆ విషయాన్ని పసిగట్టిన మల్లికా మరింత ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  జానకి రామ ముద్దులాట

  జానకి రామ ముద్దులాట

  ఇక రామచంద్ర వెళ్లి పోయే సమయంలో జానకి అతని చేతికి ముద్దు పెడుతుంది. జానకి ముద్దు పెట్టిన చోట రామచంద్ర కూడా ముద్దుపెట్టుకుంటూ రొమాంటిక్ గా తన హావభావాలను చూపిస్తాడు. భార్యను ముద్దు పెట్టుకోవాలని ట్రై చేస్తాడు గాని సిగ్గుతో మళ్ళీ వెనక్కి వెళ్ళి పోతాడు. ఇక ఉదయాన్నే ఇంటికి వచ్చిన మల్లిక గోల గోల చేస్తూ జానకి చూసేందుకు రామా రాత్రి కార్ఖానాను వచ్చాడని జ్ఞానంబతో చెబుతుంది. కానీ గోవింద రాజులు ఆ విషయం అబద్ధమని జ్ఞానంబ చెబుతాడు. జ్ఞానంబ కూడా మల్లిక మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకోసారి తన కొడుకుపై అబద్ధాలు చెబితే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తుంది.

  వెన్నెల ఎమోషనల్

  వెన్నెల ఎమోషనల్

  అనంతరం రామ చెల్లెలు వెన్నల జానకి కోసం ప్రత్యేకంగా టిఫిన్ తీసుకువస్తుంది. అంతకుముందు అన్నయ్య ను కలిసి వదిన కొన్ని కోసం ఏదైనా మంచి కానుక ఇవ్వాలని చెబుతుంది. దీంతో కొంత సేపు ఆలోచించిన రామ షాపులో ఉన్న స్వీట్ తీసుకుని దాని కొరకే భార్య కోసం పార్సల్ చేసి పంపుతాడు.

  ఇక జానకి చేసిన పనులను చూసి ఎమోషనల్ అయినా వెన్నెల తప్పు చేయకపోయినా కూడా ఈ శిక్షను అనుభవిస్తున్నావు.. నువ్వు నిజంగా చాలా గొప్ప దానివి వదినా అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఈ పనులను ఇష్టంతో నేర్చుకుంటున్నారని జానకి ఎంతో బాధ్యతగా మాట్లాడుతుంది. అయితే వదిన కోసం తెచ్చిన టిఫిన్ లో భోజనం లేకపోవడంతో వెన్నెల ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని అనుకుంటుంది కానీ జానకి ఆ విషయాన్ని పట్టించుకోవద్దని ఉంటది ఉంటుంది. ఇక రామచంద్ర పంపిన స్వీటు ను తనకి ఇవ్వడంతో ఎంతో సిగ్గుపడుతూ తింటుంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  జానకిపై మల్లిక ఆగ్రహం

  జానకిపై మల్లిక ఆగ్రహం

  ఇక మరోవైపు మల్లిక ఒక్కసారిగా జానకిపై ఆగ్రహానికి వ్యక్తం చేస్తుంది. అత్త చేతిలో కోడళ్ళు ఎంత మాత్రం బానిస లాగా ఉండకూడదు అని కొడవళ్ళుగా మారాల్సిన సమయం వచ్చిందని హితబోధ చేస్తుంది. రామచంద్ర జానకి కోసం ఒక ప్రత్యేకమైన కానుకను పంపుతాడు. అందులో చీరలు నగలు ఉండడంతో జానకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అసలు ఎందుకు వీటిని పంపి ఉంటాడు అని ఆలోచనలో పడుతుంది. మరి రామచంద్ర ఏ విధంగా అలోచిస్తారో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 104
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X