For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 13th Episode: జానకిపై ఆయుధం ప్రయోగించిన మల్లిక.. చివరికి అట్టర్ ఫ్లాప్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ లో కథలో ఇప్పుడిప్పుడే అసలైన మలుపులు తిరుగుతున్నాయి. రీసెంట్ గా వంద ఎపిసోడ్స్ ను దాటేసిన ఈ డైలీ సీరియల్ చూస్తుంటే ప్రస్తుతం లీడ్ లో ఉన్న టాప్ సీరియల్స్ కు ఈజీగా పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది. కథలోనే సరికొత్త ట్విస్టులు కూడా ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ప్రేమ కథగా కొనసాగుతున్న జానకి కనగలలేదు సీరియల్ ఇటీవల రేటింగ్స్ సంఖ్యను కూడా అంతకంతకు పెంచుతూనే ఉంది.

  ఈ సీరియల్ మధ్యలో కాస్త స్లో గా సాగినట్లు అనిపించినప్పటికి అనంతరం సరికొత్త అంశాలతో ఆసక్తిగా మారుతోంది. రామ జానకి మధ్యలో వస్తున్న అమయాకపు ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే చిన్న కోడలు మల్లిక చేస్తున్న కుట్రలకు కొన్నిసార్లు పెద్ద కోడలు జానకి తీవ్ర సాహిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు అత్త జ్ఞానాంబ పెడుతున్న కండిషన్స్ డోస్ కూడా అంతకంతకు ఎక్కువవుతోంది.

  భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 105వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Samantha Akkineni శాకుంతలం సెట్లో ఎమోషనల్.. చివరి రోజున ఘనంగా వీడ్కోలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

  అబద్ధం చెప్పడంతో టెన్షన్..

  అబద్ధం చెప్పడంతో టెన్షన్..

  జ్ఞానంబ కోపానికి జానకి వివిధ రకాల శిక్షలు అనుభావించాల్సి వస్తోంది. ఇక మల్లిక కూడా రోజురోజుకు తన కుళ్ళు బుద్దిని మరింత ఎక్కువగా బయటపెడుతోంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే సరికొత్త కామెడీని కూడా క్రియేట్ చేస్తున్నాయి. జానకి ఐపీఎస్ చదువు గురించి అబద్ధం చెప్పడంతో కథలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. చిన్న కోడలు మోసపూరిత పనుల వలన జ్ఞానాంబ జానకిపై కోపం తెచ్చుకుంటుంది. ఇటీవల చెప్పుల విషయంలో అబద్ధం చెప్పిందనే కారణం వలన జానకి మూడు రోజులు కార్ఖానాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

  Sonakshi Sinha మెగాస్టార్ చిరంజీవితో రొమాంటిక్‌గా.. దబాంగ్ బ్యూటీ ఫోటోలు వైరల్

   అందులో ఎలాంటి భోజనం ఉండదు

  అందులో ఎలాంటి భోజనం ఉండదు

  జ్ఞానాంబ కూతురు వెన్నెల తన వదిన జానకి కోసం టిఫిన్ తీసుకు వెళ్ళడంతో అక్కడ పరిస్థితులను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతుంది. జానకి పడుతున్న కష్టాలను చూసి వెన్నెల ఎమోషనల్ అవ్వడం అక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక జానకి కోసం తెచ్చిన టిఫిన్ తెరిచి చూడగా అందులో ఎలాంటి భోజనం ఉండదు మల్లికలే ఇలాంటి భోజనం పెట్టకుండా క్యారేజ్ లో వెన్నెల చెట్టు కనిపిస్తుంది. ఆ విషయం తెలియని వెన్నెల కాస్త కన్ఫ్యూజన్ కి గురవుతుంది.

  తొందరపడకుండా..

  తొందరపడకుండా..

  ఇక మల్లిక చేసిన పనికి భర్త విష్ణు ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు. కానీ మల్లిక ఎప్పటిలాగే తన కుళ్ళు బుద్ధిని బయట పెడుతుంది. జానకి మనం వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాము అనే విషయాన్ని కూడా పసిగట్టింది అంటూ.. అది ఎవరికి తెలియకుండా ఉండాలి అంటే అత్త, జానకి మధ్య గొడవలు క్రియేట్ చేయాలని మల్లిక మరొక ప్లాన్ వేస్తుంది ఈ క్రమంలో స్వీట్ చేస్తున్నా కార్ఖానా కి వెళ్లి జానకినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ జానకి మాత్రం కొంచెం కూడా తొందరపడకుండా మల్లికకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది.

  కొడవళ్ళుగా మారే సమయం వచ్చింది

  కొడవళ్ళుగా మారే సమయం వచ్చింది

  కోడలు అంటే కన్నీళ్ళు పెట్టుకొని ఉండకూడదు అని కొడవళ్ళుగా మారే సమయం కూడా వచ్చిందని మల్లిక తన మాటలతో రెచ్చగొడుతుంది అయినప్పటికీ తొందరపడని జానకి కూల్ చేస్తుంది. అలాగే మల్లికకు అత్త గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది.మన ఇద్దరిని కూడా ఆమె తన సొంత కూతురిలా చూసుకుంటున్నారని ఆ విషయంలో అనవసరంగా అనుమానాలు పెట్టుకోవద్దని వివరణ ఇస్తుంది ఆ మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు.

  భార్య కోసం ఒక ప్రత్యేకమైన కానుక

  భార్య కోసం ఒక ప్రత్యేకమైన కానుక

  ఇక మరోవైపు రామచంద్ర ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకుని తన భార్య కోసం ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని అనుకుంటాడు అందుకోసం తన చిన్న తమ్ముడి ని పిలిపించి తల్లి యొక్క నగలు చీర కూడా ఒక సంచిలో పెట్టి పంపిస్తాడు. ఇక వాటిని చూసిన జానకి కొంత ఆశ్చర్యానికి గురి అవుతుంది ఎందుకు పంపి ఉంటాడు అని అనుమానం వస్తుంది అయినప్పటికీ భర్త మాటకు విలువ ఇచ్చి వాటిని దరిస్తుంది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  భార్యను ఒప్పించిన రామ

  భార్యను ఒప్పించిన రామ

  ఇక ఆ తర్వాత జానకి కోసం వచ్చినా రామచంద్ర ఒక ప్రత్యేకమైన చోటుకి తీసుకెళ్తానని చెప్తాడు. కానీ అందుకు జానకి ఎంతమాత్రం ఒప్పుకోను అంటుంది. మీరు నాతో మాట్లాడే విషయం అత్తయ్య గారికి తెలిస్తే మాత్రం బాగుండదు అని తర్వాత రోజు బయటకు వేళదాం అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ భర్త స్థానంలో ఉన్న తాను తప్పకుండా నేను ఒక చోటుకి తీసుకు వెళ్లాలని అది ఎంతమాత్రం తప్పుకాదు అని రామ తన మాటలతో భార్యను ఒప్పిస్తాడు.

  భార్యని తీసుకొని ఆమె కాలేజీ కి తీసుకు వేసిన రామ అక్కడ జానకి గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందగానే ఎంతగానో సంతోషిస్తాడు. అక్కడ జానకి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక సంతోషంతో ఉండగా ఇంతలో జ్ఞానంబ ఎక్కడికి ఎంట్రీ ఇస్తుంది. మరి కాలేజీలో ఆమె తన కొడుకు కోడలును చూసిందో లేదో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 105
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X