For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 16th Episode: భార్య కోసం డేంజర్ జోన్‌లో పడిన రామ.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా అసలు కథలోకి ఎంట్రీ ఇచ్చింది. జానకి ఐపీఎస్ చదువు కోసం రామచంద్ర వేస్తున్న అడుగులు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఆ విషయం తల్లి జ్ఞానాంబకి తెలియనివ్వకుండా రామ వేస్తున్న ప్లాన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. కానీ ఎప్పటికైనా ఆ విషయం తెలిసినప్పుడు పరిస్థితులు ఎంత భయానకంగా మారతాయో అని జానకి నిరంతరం కంగారు పడుతుంది. కానీ రామచంద్ర మాత్రం ఆ టెన్షన్ లేకుండా ముందుకు సాగుతుంటాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ప్రేమ కథగా కొనసాగుతున్న జానకి కనగలలేదు సీరియల్ ఇటీవల రేటింగ్స్ సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకుంటోంది.

  రామ జానకి మధ్యలో వస్తున్న ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. మల్లిక చేస్తున్న కుట్రలకు కొన్నిసార్లు పెద్ద కోడలు జానకి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ డోస్ కూడా అంతకంతకు ఎక్కువవుతోంది గాని అస్సలు తగ్గడం లేదు. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 106వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  బలంగా ముందుకు సాగుతున్న రామచంద్ర

  బలంగా ముందుకు సాగుతున్న రామచంద్ర

  తన భార్య జానకి చదువు కోసం రామచంద్ర మరో కీలకమైన నిర్ణయానికి వేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే జానకి చదువు కోసం పుస్తకాలు కొనడమే కాకుండా చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తాడు. ఐపీఎస్ చదవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ని కూడా కనుక్కుంటూ భార్యను ఆశ్చర్యపరుస్తున్నాడు.

  తల్లికి మాత్రం తెలియకుండా జానకిని ఐపీఎస్ గా చూడాలని రామచంద్ర ఎంతో బలంగా ముందుకు వెళ్తున్నాడు. మరోవైపు మల్లిక చేస్తున్న కుట్రలకు విషయం బయట పడే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది ఈ టెన్షన్ లో జానకి కూడా అత్తకు నిజం చెప్పాలని అనుకుంటుంది కానీ అందుకు రామచంద్ర ప్రతిసారి అడ్డుపడుతూ ఉంటాడు.

  రామచంద్ర లాంటి భర్త దొరకడం నీ అదృష్టం

  రామచంద్ర లాంటి భర్త దొరకడం నీ అదృష్టం

  ఇక మొత్తానికి గ్రాడ్యుయేషన్ డే ఉండడంతో రామచంద్ర భార్య జానకిని కాలేజీకి తీసుకువస్తాడు. అందుకు జానకి ఆనందంలో మ్యూనిగిపోతుంది. అక్కడ డిగ్రీ పట్టా పొందుతూ ఉంటే భార్యను చూడాలనే కోరికతో ఉంటాడు. ఇక అక్కడికి రాగానే జానకి తన చిన్ననాటి స్నేహితురాలు శ్రావణిని కూడా కలుస్తుంది.

  ఇద్దరు కూడా గ్రాడ్యుయేషన్ డే లో కలిసి పాల్గొంటారు. నిజంగా రామచంద్ర లాంటి భర్త దొరకడం నీ అదృష్టం జానకి అంటూ శ్రావణి వివరణ ఇస్తుంది. అందుకు జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. కాస్త ఎమోషనల్ అవుతుంది.

  జ్ఞానంబ శత్రువు వైజయంతి కూడా

  జ్ఞానంబ శత్రువు వైజయంతి కూడా

  అయితే అక్కడికి జ్ఞానంబ శత్రువు వైజయంతి కూడా వస్తుంది. కానీ మొదట రామచంద్ర, జానకి ఆమెను చూడరు. ఒకరినొకరు చూసుకోకుండానే అందరూ ఈవెంట్లో పాల్గొంటారు. ఇక మరోవైపు ఒక గుడి దగ్గర ఉండగా.. గతంలో కార్ఖానాలో పనిచేసిన ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడే రామచంద్ర మీ కోడల్ని కాలేజ్ దగ్గర చూశాను అని చెబుతాడు.

  దీంతో ఒక్కసారిగా షాక్ అయినా జ్ఞానాంబ వెంటనే డ్రైవర్ ను కాలేజీకి వెళ్లి ఇవ్వమని చెబుతుంది. ఇక డిగ్రీ పట్టా అందుకునేందుకు జానకి సిద్ధంగా ఉండటంతో రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు.

  వైజయంతిని గమనించడంతో..

  వైజయంతిని గమనించడంతో..

  ఈ కార్యక్రమంలో లో రామచంద్ర ఒక్క లైన్ లో వైజయంతి కూర్చోవాలని గమనిస్తాడు. వెంటనే జానకి కూడా ఆ విషయాన్ని చెబుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెబుతుంది. కానీ అందుకు రామచంద్ర ఏమాత్రం ఒప్పుకోడు. తప్పకుండా మీరు డిగ్రీ పట్టా అందుకునే ఇక్కడి నుంచి వెళ్లాలని అంటాడు.

  వైజయంతి తనను చూస్తే తప్పకుండా ఆ విషయాన్ని అత్త గారికి చెబుతోందని తర్వాత అనేక సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందని భర్తకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటుంది.

  చివరి నిమిషంలో..

  చివరి నిమిషంలో..

  కానీ రామచంద్ర ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని అప్పుడే బయటకు వెళ్లిపోతాడు. ఇక బయట ఒక వాచ్ మెన్ దగ్గర మొబైల్ ఫోన్ తీసుకొని తెలియని వ్యక్తి తరహాలో వైజయంతి కి ఫోన్ చేసి ప్రిన్సిపాల్ రూమ్ కి రమ్మని చెబుతాడు. ఇక వైజయంతి అక్కడికి రాగానే అప్పుడే రామచంద్ర లోపలికి వెళతాడు.

  జానకి కూడా డిగ్రీ పట్టాను అందుకునేందుకు స్టేజ్ పైకి వెళుతుంది. భర్త చూస్తుండగానే డిగ్రీ పట్టా అందుకోవాలని జానకి అనుకుంటుంది. కానీ కొంత సేపటి వరకు రామచంద్ర లోపలకి రాడు. డిగ్రీ పట్టా ఇస్తుండగా జానకి భర్త కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇక చివరి నిమిషంలో రామచంద్ర పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. అది చూసి రామచంద్ర ఎంతగానో సంతోషిస్తాడు. జానకి కూడా భర్తను చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది.

  ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ

  ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ

  డిగ్రీ పట్టా అందుకోగానే స్టేజి పై మాట్లాడిన జానకి తన భర్తకు ఐ లవ్ యూ అని కూడా చెబుతుంది. స్టూడెంట్స్ అందరిముందు తను అందుకున్న డిగ్రీ పట్టాను భర్త చేతికి అందించే ప్రయత్నం చేస్తుంది. అందరూ వారి ప్రేమను చూసి హర్షధ్వానాలు చేస్తుంటారు. ఇక అదే సమయంలో జ్ఞానంబ కూడా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. కానీ అందరూ చుట్టుముట్టి ఉండడంతో జానకి రామచంద్ర కనిపించరు. మరి ఫైనల్ గా రామచంద్ర జానకి.. జ్ఞానాంబ దృష్టిలో పడతారో లేదో తెలియాలి అంటే అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 106
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X