Janaki Kalaganaledu August 17th: జానకిని సర్‌ప్రైజ్‌ చేసిన జ్ఞానాంబ.. అయినా కోపం తగ్గలేదు!

జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 368 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

రాఖీ సెలబ్రేషన్స్

రాఖీ సెలబ్రేషన్స్

రాఖీ పండుగ సందర్భంగా జ్ఞానాంబ ఇంట్లో ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ముఖ్యంగా జానకి పెద్ద కోడలిగా తన బాధ్యతతో అందరిని ఒక దగ్గరికి చేర్చి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెడుతుంది. ముందుగా రామచంద్ర కు ప్రత్యేకంగా అతని చెల్లి వెన్నెల రాఖీ కడుతుంది. రాఖీ కట్టే సమయంలో వెన్నెల చాలా ఎమోషనల్ అయిపోతుంది. నా ప్రతి విషయంలో కూడా నువ్వు అండగా ఉంటావు అంటూ కంటతడి పెడుతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర కూడా చెల్లిని చూసి ఎంతగానో ఆనందపడతాడు. అయితే ఇదే సమయంలో జ్ఞానాంబ మల్లికా సోదరుడిని కూడా ఇంటికి పిలిపిస్తుంది.

 మాటలతో బాధ పెట్టిన మల్లిక

మాటలతో బాధ పెట్టిన మల్లిక


మొదట హఠాత్తుగా తమ్ముడు రావడంతో మల్లిక ఆశ్చర్యపోతుంది. పిలవకుండానే ఎలా వచ్చావు అని అడగడంతో అత్తయ్య గారు రమ్మని పిలిచారు అని చెప్పడంతో ఎమోషనల్ అయినట్లు డ్రామా చేస్తుంది. ఇక ఆ తరువాత మల్లిక ఎంతో సంతోషంగా తన తమ్ముడికి రాఖీ కడుతుంది. అయితే అదే సమయంలో ఆమె తోడికోడలు జానకిని కూడా బాధపెట్టాలని అనుకుంటుంది. ఇప్పుడు జానకి తన సోదరుడికి రాఖీ కట్టే అవకాశం లేదు కాబట్టి సూటి పోటి మాటలతో బాధపెట్టాలని అనుకుంటుంది. పాపం జానకి మాత్రమే ఈ రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయింది. గతంలో ఆమె అన్నయ్య చేసిన తప్పు కారణంగా ఇప్పుడు జానకి బాధపడి పరిస్థితి ఎదురయింది అని మల్లికా అనవసరంగా మాటలతో జానకిని మరింత బాధపెడుతుంది.

బాధలో జానకి

బాధలో జానకి

ఆ తర్వాత జ్ఞానాంబ మల్లిక నోరు మూయించి ఇంకోసారి అలా మాట్లాడావంటే బాగుండదు అని హెచ్చరిక చేస్తుంది. అయినప్పటికీ జానకి సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. జానకి బాధపడుతున్న సమయంలో భర్త రామచంద్ర వచ్చి మీ అన్నయ్య దగ్గరికి వెళ్లి రాఖీ కట్టవచ్చు కదా అని అడుగుతాడు. కానీ జానకి మాత్రం నేను ఏమీ బాధపడడం లేదు అని చెబుతుంది. మా అన్నయ్య మిమ్మల్ని గతంలో ఎంతగానో అవమానపరిచాడు ఆ విషయం నేను ఇంకా మర్చిపోలేదు అంటూ.. తనలో తానే జానకి బాధపడుతూ ఉండడంతో అమ్మతో నేను మాట్లాడతాను అని కూడా రామచంద్ర చెబుతాడు అయినప్పటికీ జానకి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోండి అని చెబుతుంది.

జెస్సితో అఖిల్

జెస్సితో అఖిల్

ఇక జ్ఞానాంబ అందరూ కూడా గుడికి రావాలి అని ఆ తర్వాత చెబుతుంది. ఈ క్రమంలో చిన్న కొడుకు అఖిల్ కు తన గర్ల్ ఫ్రెండ్ జెస్సి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అదే రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో తప్పకుండా రావాలి అని అంటుంది. ఇక అఖిల్ తన తల్లి దగ్గరికి వెళ్లి ఈరోజు నా ఫ్రెండ్ పుట్టినరోజు అని గుడికి రాలేను అని చెబుతాడు. అయితే మధ్యలో మల్లిక మాత్రం ఫ్రెండ్ అంటే లవర్ కాదు కదా అని అనుమానిస్తుంది. దీంతో జ్ఞానాంబ అలాంటి అనుమానాలు వచ్చేలాగా ఎందుకు మాట్లాడతావు అంటూ లేనిపోని ఆలోచనలు నువ్వే కలిగిస్తావు అని తిడుతుంది. కానీ మల్లిక మాత్రం తన మనసులో ఏదో ఒక రోజు అఖిల్ తన ప్రేయసి తో రావాలి అని అప్పుడు అత్తగారి తిక్క కుదురుతుంది అని అనుకుంటుంది.

గుడి వద్దకు జెస్సి

గుడి వద్దకు జెస్సి

ఇక తర్వాత అఖిల్ ఎంత బ్రతిమాలిన కూడా గుడికి రావాల్సిందే అని చెప్పడంతో తన గర్ల్ ఫ్రెండ్ కు రాలేను అని చెబుతాడు. అయితే జెస్సి మాత్రం అఖిల్ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని అనుకుంటుంది. గుడికి వెళుతున్నాడు కాబట్టి అక్కడే వారందరినీ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది అని ధైర్యం చేసి వెళుతుంది.

జ్ఞానాంబ సర్‌ప్రైజ్‌

జ్ఞానాంబ సర్‌ప్రైజ్‌

ఇక మరోవైపు గుడి దగ్గర జానకికి ఊహించని సర్ప్రైజ్ ఎదురవుతుంది. ఎందుకంటే అక్కడికి ఆమె సోదరుడు యోగి వస్తాడు. జానకి బాధపడుతుంది అని ప్రత్యేకంగా జ్ఞానాంబ అతనిని పిలిపిస్తుంది. గతంలో జరిగిన విషయాలు ఇంకా మరిచిపోలేను అని జానకి ఎంత చెప్పినా కూడా తనను క్షమించాలి అని యోగి బ్రతిమాలతాడు అయినప్పటికీ కూడా జానకి ఏమాత్రం వెనుకడుగు వేయదు. నువ్వు మొదట నా చదువు విషయాన్ని దాచిపెట్టి నన్ను ఇబ్బంది పెట్టావు. ఆ తర్వాత నా భర్తను అవమానపరిచావు ఆ విషయాలు ఎలా మర్చిపోగలను అని జానకి మొండి పట్టుదలతో ఉంటుంది. దీంతో జ్ఞానాంబ ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి తదుపరి ఎపిసోడ్లో వీరి మధ్య వాదన ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X