Janaki Kalaganaledu August 18th Episode: జానకి గుండెలను పిండేసిన రామచంద్ర.. చివరికి షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు అసలైన కథలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీమతి ఐపీఎస్ చదువు కోసం రామచంద్ర ఆలోచిస్తున్న విధానం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తల్లి జ్ఞానాంబకి ఏ మాత్రం తెలియనివ్వకుండా రామచంద్ర వేస్తున్న అడుగులు ఎలాంటి గొడవలకు దారితీస్తాయో అని మరోవైపు జానకి గుండెల్లో భయం ఎక్కువవుతోంది. మల్లిక చేస్తున్న కుట్రలకు కొన్నిసార్లు పెద్ద కోడలు జానకి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ డోస్ కూడా అంతకంతకు ఎక్కువవుతోంది గాని అస్సలు తగ్గడం లేదు. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 108వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఎప్పటికైనా ఆ విషయం బ్లాస్ట్ అవ్వక తప్పదు

ఎప్పటికైనా ఆ విషయం బ్లాస్ట్ అవ్వక తప్పదు

రామ పాచికలు వర్కౌట్ అవుతున్నాయి కానీ ఎప్పటికైనా ఆ విషయం బ్లాస్ట్ అవ్వక తప్పదు అని జానకి మనోవేదనకు గురవుతోంది. పరిస్థితులు ఎంత భయానకంగా మారతాయో అని నిరంతరం కంగారు పడుతుంది. కానీ రామచంద్ర మాత్రం కంగారు లేకుండా ముందుకు వెళుతున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ప్రేమ కథగా కొనసాగుతున్న జానకి కనగలలేదు సీరియల్ ఇటీవల రేటింగ్స్ సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. రామ జానకి మధ్యలో వస్తున్న ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి.

భార్యకు సరికొత్త సర్ ప్రైజ్ లు

భార్యకు సరికొత్త సర్ ప్రైజ్ లు

జానకి చదువు కోసం భర్త రామచంద్ర మరో కీలకమైన అడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నడు. ఐపీఎస్ చదువు కోసం కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కూడా సొంతంగా తెలుసుకుంటూ భార్యకు సరికొత్త సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. పుస్తకాలు కొనడమే కాకుండా తరువాత పరీక్షల కోసం సంసిద్ధమయ్యే విధంగా చేస్తున్నాడు. మధ్యలో కొన్ని అంతరాయాలు ఏర్పడుతున్నా కూడా జానకి పోలీస్ అవ్వాలన్న కలను ఏ మాత్రం ఆపకూడదని అనుకుంటున్నాడు. జ్ఞానాంబ కట్టుబాట్లు, మల్లిక కుట్రలు మధ్య రామచంద్ర ఆలోచనలు బాగానే వర్కౌట్ అవుగున్నాయి.

అదృష్టవశాత్తు..

అదృష్టవశాత్తు..

జానకిను డిగ్రీ పట్టా అందుకుంటే చూడాలని ఎంతో కలలుకన్న రామచంద్ర మొత్తానికి భార్యను కాలేజ్ వరకు తీసుకు వెళ్తాడు. దీంతో జానకి ఎంతగానో సంతోషానికి గురవుతుంది. అయితే ఇంతలోనే జ్ఞానాంబ అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ వైజయంతి కూడా ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు రామచంద్ర జానకి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. కానీ ఎప్పటికైనా విషయం జ్ఞానము తెలుస్తుందేమో అని కోడలు జానకి ఎంత కంగారు పడుతుంది.

 మల్లికకు అవకాశం దొరకడంతో

మల్లికకు అవకాశం దొరకడంతో

ఇక మరోవైపు మల్లికకు అవకాశం దొరకడంతో జానకి కార్ఖానాలో లేని విషయాన్ని పసిగడుతుంది రామచంద్ర జానకి బయటకు వెళ్లినట్లు తెలుసుకొని ఎలాగైనా విషయాన్ని నా భర్తకు కూడా తెలియచేయాలనుకుంటున్నాడు. వెంటనే ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. ఇంతలోనే రామచంద్ర జానకి కార్ఖానాకు వెళ్లకుండా మరొక చోటికి వెళ్తారు.

రామను కౌగిలిచుకున్న జానకి

రామను కౌగిలిచుకున్న జానకి

రామచంద్ర తన భార్య జానకిని ఒక గుడికి తీసుకువెళతాడు. అక్కడ దేవత ముందు జానకిని మెయిన్స్ పరీక్షలకోసం అప్లికేషన్ ఫామ్ ను నింపాలని కోరుతాడు. రామచంద్ర చూపిస్తున్న ప్రేమకు బాధ్యతకు జానకి ఒక్కసారిగా ఎమోషనల్ కి గురవుతుంది. ఇంత మంచి భర్త తనకు దొరికినందుకు తాను ఎంతో అదృష్టవంతురాలిని అంటూ వెంటనే భర్తను కౌగిలించుకుందిమ్ రామచంద్ర కూడా అది నా బాధ్యత అంటూ భార్య ఎంతో మద్దతు గా గెలుస్తాడు.

గుండెలు పగిలేలా..

గుండెలు పగిలేలా..

అంతేకాకుండా రామచంద్ర జానకి గుండెల్ని పిండేలా గతంలో ఒక విషాదకరమైన సంఘటన గురించి చెబుతాడు దానికి తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మునిగి పోయినప్పుడు తాను కూడా వాళ్లతోనే ఉన్నానని అంటాడు. అయితే అప్పుడు మీ నాన్నగారు మీ కోరిక గురించి కూడా చెప్పారని, ఇక ఆయనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని కానీ ఫలితం దక్కలేదని అంటాడు. ఇక చివరగా తన దగ్గర కూతురి కోసం దాచిన పెన్నును ఇచ్చినట్లు చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న జానకి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నాకు అమ్మానాన్న మీరే అంటూ.. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా సరిపోవు అని ఉంటుంది.

అసలు నిజం తెలుసుకోవాలని

అసలు నిజం తెలుసుకోవాలని

ఇక మరోవైపు మల్లిక అత్త జ్ఞానం కార్ఖానాకు తీసుకువస్తుంది. మీ మర్యాద మంట కలిసి పోయింది అంటూ మీరు చెప్పిన మాటను ఏమాత్రం వినకుండా బావగారు జానకిని బయటకు తీసుకెళ్లారని మల్లిక వివరిస్తుంది. ఆ మాటలపై కాస్త అనుమానం వ్యక్తం చేసిన జ్ఞానంబ అసలు నిజం తెలుసుకోవాలని మల్లిక తో కార్ఖానా కి వెళుతుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
మరో షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

మరో షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

నిజంగానే అక్కడ రామచంద్ర జానకి లేకపోవడంతో జ్ఞానంబ ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది. దానికి తోడు మల్లిక కూడా అత్త మనసులో చిచ్చు రేగేలా డైలాగ్స్ వదులుతుంది. ఆ ఆ మాటలకు జ్ఞానాంబ కూడా ఎలాగైనా వారికి సరైన బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. రామచంద్రకి జానకి కార్ఖానాకు రాగానే జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. జ్ఞానాంబ చూసిన వెంటనే రామచంద్ర జానకి కూడా ఆశ్చర్యపోతారు.
రామచంద్ర వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా అతని మాటలను తల్లి ఏమాత్రం పట్టించుకోదు. మీరు ఉదయమే ఇంటికి రండి అప్పుడు నా నిర్ణయం ఏమిటో చెబుతాను అని మరో షాక్ ఇస్తుంది. మరి జ్ఞానాంబ తీసుకునే నిర్ణయం ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X