For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 19th Episode: జానకి, రామ బయటకు వెళ్లిపోవాల్సిందే.. జ్ఞానాంబ దెబ్బకు మైండ్ బ్లాక్

  |

  జానకి కలగనలేదు సీరియల్ మొత్తానికి ఒక ట్రాక్ లోకి అయితే వచ్చేసింది. కథలో అసలు ట్విస్టులు మొత్తానికి బయటపడే వాతావరణం అయితే కనిపిస్తోంది. జానకి ఐపీఎస్ చదువు కోసం ఆమె భర్త రామచంద్ర చేస్తున్న పనులు తల్లి జ్ఞానాంబకు తెలిస్తే ఇంట్లో పెద్ద వివధాలు చెలరేగడం ఖాయం. ఇక ఆ సీన్స్ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. జ్ఞానాంబకి ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంటోంది. మరోవైపు చిన్న కోడలు మల్లిక కూడా మరింత ఘాటుగా స్పందిస్తోంది. దాంతో జానకిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎంతో జాగ్రత్తగా రామచంద్ర వేస్తున్న అడుగులు ఎదో ఒక సందర్భంలో వివాదాలను క్రియేట్ చేస్తున్నాయి. అందుకు జానకి కూడా కంగారు పడుతోంది. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే పాయింట్ ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 109వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  మాట తప్పిన రామచంద్ర

  మాట తప్పిన రామచంద్ర

  ఇక ఇటీవల జానకిని కార్ఖానాకు వెళ్లమని జ్ఞానాంబ ఆదేశాలు చేసింది. అయితే ఆమెతో మూడు రోజులు రామచంద్రను దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ రామ మాట తప్పుతాడు. దీంతో మరోవైపు జానకి గుండెల్లో భయం ఎక్కువవుతోంది. మల్లిక చేస్తున్న కుట్రలకు కొన్నిసార్లు పెద్ద కోడలు జానకి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే అత్త జ్ఞానాంబ కోపానికి కూడా జానకి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ డోస్ కూడా అంతకంతకు ఎక్కువవుతోంది గాని అస్సలు తగ్గడం లేదు.

   భర్త చేస్తున్న సహాయానికి..

  భర్త చేస్తున్న సహాయానికి..

  జానకి డిగ్రీ పట్టా పొందే సమయం వచ్చిందని రామచంద్ర ఆమెకు తెలియకుండా కాలేజీకి తీసుకువెళ్లి ఆ పనులన్నీ సంతోషంగా పూర్తి చేస్తాడు. ఆ సర్ ప్రైస్ తో జానకి ఎంతో సంతోషిస్తుంది. తల్లిదండ్రి స్థానంలో ఉంటూ భర్త చేస్తున్న సహాయానికి జానకి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది అంతేకాకుండా రామచంద్ర భార్య ఎలాగైనా ఐపీఎస్ చదవాలని మెయిన్స్ పరీక్షల కోసం దరఖాస్తు కూడా చేయిస్తాడు..

   రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన జానకి రామ

  రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన జానకి రామ

  జానకి తల్లిదండ్రులు చనిపోయే సమయంలో వారి కోరిక గురించి కూడా రామచంద్ర చెప్పడంతో ఆమె ఎంతగానో రోధిస్తుంది. ఇంత గొప్ప భర్త దొరికినందుకు నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరని రామచంద్రను కౌగిలించుకొని ఏడుస్తుంది. మరోవైపు మల్లిక జ్ఞానాంబను అప్పటికే కార్ఖానా తేవడంతో రామచంద్ర జానకి రెడ్ హ్యాండెడ్ గా దొరికేస్తారు. జ్ఞానాంబను కార్ఖానా దగ్గర చూడగానే జానకి రామచంద్ర కూడా ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు.

  శిక్ష అనుభవించాల్సిందే

  శిక్ష అనుభవించాల్సిందే

  తల్లికి రామచంద్ర వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ విషయాలను మాటలను జ్ఞానాంబను ఏ మాత్రం లెక్కచేయదు. ఉదయాన్నే మీరు ఇంటికి రావాలని ఆదేశాలు జారీ చేస్తుంది. రామచంద్ర జానకి ఇంటికి రాగానే గుమ్మం ముందు రెండు సూట్కేసులను పెడుతుంది. అప్పటికే సీన్ అందరికి అర్ధమవుతుంది. అయితే తండ్రి గోవిందరాజులు రామచంద్రను ఇంట్లోకి వెళ్ళండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జ్ఞానాంబ ఏమాత్రం లెక్కచేయకుండా తన మాటలు విననందుకు వారు శిక్ష అనుభవించాల్సిందే అని చెబుతోంది. మల్లిక కూడా అందరిని సమానంగా చూడాలని అప్పుడే అత్తయ్య గారి మాటలకు విలువ ఉంటుందని ఆమె గౌరవం కూడా జాగ్రత్తగా ఉంటుంది అని సూటిపోటి మాటలతో మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.

  ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను

  ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను

  జ్ఞానాంబకి కొడుకు రామచంద్ర క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. నేను తప్పు చేయలేదు కానీ మీరు చెప్పిన మాటను వినలేదు.. కాబట్టి ఎలాంటి శిక్ష వేసినా దాన్ని అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ రామచంద్ర చెబుతాడు. అందుకు జ్ఞానాంబ కూడా కంటతడి పెడుతుంది. నేను చేసిన ప్రతి పనిలో ఒక మంచి అయితే ఉందని అది తన బాధ్యత కూడా అంటాడు. రామ వీలైనంత వరకు తల్లికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాడు కానీ అందుకు ఆమె ఏ మాత్రం ఒప్పుకోదు. నేను ఎంత చెప్పినా కూడా నా మాట ఏమాత్రం లెక్కచేయకుండా జానకి తో మాట్లాడావు అంటే నా మీద ఎంత గౌరవం ఉందొ నాకు అర్థం అవుతోంది. అందరినీ ఒకేలాగా చూడాలని నేను అనుకుంటాను. కాబట్టి ఈ విషయంలో మీరు చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి తగిన శిక్ష అనుభవించాల్సిందే ఆదేశిస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  జానకికి కాలేజ్ దగ్గరి ఏం పని?

  జానకికి కాలేజ్ దగ్గరి ఏం పని?

  వెంటనే మీరు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని జ్ఞానాంబ జానకి, రామ ఇద్దరిని హెచ్చరిస్తుంది. ఆ మాటలకు ఇంట్లో అందరు కూడా ఒక్క సారిగా షాక్ అవుతారు. మరోసారి రామచంద్ర తల్లిని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్ఞానాంబ మనసు మాత్రం కొంచెం కూడా కరగదు. మరో వైపు జానకి కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. అయితే సిటీకి ఎందుకు వెళ్లారు? 5వ తరగతి చదువుకున్న జానకికి కాలేజ్ దగ్గరి ఏం పని అని ప్రశ్నలు కూడా వేస్తుంది. దీంతో జానకి మరోసారి షాక్ అవుతుంది. నిజంగా అత్తకు ఆ విషయం తెలిసే అవకాశం ఉందని అర్ధమవుతుంది. ఇక ఆ విషయంలో రామచంద్ర తల్లికి ఎలాంటి సమాధానం ఇస్తాడు రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 109:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X