For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 19th: అఖిల్ ప్రేయసితో మరో కొత్త టెన్షన్.. జానకి అనుమానం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 369వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

   హ్యాపీగా ఉన్న సమయంలో..

  హ్యాపీగా ఉన్న సమయంలో..

  అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో చిన్న కోడలు మల్లిక మాత్రం ఏదో ఒక గొడవ సృష్టించాలని అనుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన తోడికోడలు జానకి పై ఏదో ఒక నింద వేసి దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. అత్తగారు ఎక్కువగా పెద్దకోడలిని మాత్రమే ప్రేమగా చూస్తున్నారు అని అసూయ చెందుతుంది. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని కూడా అనుకుంటుంది. ఈ క్రమంలో లేనిపోని ఆలోచనలతో జానకి పై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే జానకి కొన్నిసార్లు తన తెలివితో మల్లిక మోసాల నుంచి ఈజీగా బయటపడుతుంది. అంతేకాకుండా పరిస్థితులు కూడా మల్లికకు విరుద్ధంగా మారుతున్నాయి.

   మల్లిక ప్లాన్ డిజాస్టర్

  మల్లిక ప్లాన్ డిజాస్టర్


  ఇక రాఖీ పండుగ సందర్భంగా అందరూ గుడికి వెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా మల్లికా జానకి పై ఒక నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంతో నిబద్ధతతో అమ్మవారికి నైవేద్యం చేయాలి అని చెప్పినప్పటికీ కూడా కొన్ని పాలను ఒక పిల్లవాడు ఏడుస్తుంటే పోసింది అని మల్లిక నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంగిలి పాలు నైవేద్యంగా పెట్టకూడదు కదా అని మల్లికా తన అత్త ముందు చెబుతుంది అయితే చిన్నపిల్లవాడు ఆకలికి పాల కోసం ఏడుస్తూ ఉంటే పోసాను అని జానకి ఆ తర్వాత సమాధానం ఇస్తుంది. ఇక జానకి చేసిన మంచి పనికి అక్కడ ఉన్న పూజారి కూడా మెచ్చుకుంటాడు. మానవసేవే మాధవసేవ అని ఒక పసిపిల్లాడికి పాలు పోయడంలో ఎలాంటి తప్పులేదు అని అమ్మవారి ఆశీర్వాదం కూడా మీ కుటుంబం పై నిండుగా ఉంటుంది అని పూజారి చెప్పడంతో జ్ఞానాంబ కూడా సంతోషిస్తుంది.

  జానకి, రామ ఎమోషనల్

  జానకి, రామ ఎమోషనల్

  ఇక జానకినీ గుడి దగ్గర ఉన్న ఒక చెట్టుకి ముడుపు కట్టాలి అని అత్తగారు చెబుతారు. అక్కడికి వెళ్లిన జానకి తన పాత రోజులను గుర్తుచేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. దేవతను మనసులో ఆరాధిస్తూ గతంలో నేను ఐపీఎస్ కావాలి అని ఇక్కడ ముడుపు కట్టాను అందుకు తగ్గట్టుగానే నా భర్త సహకారంతో ఇప్పుడు ఐపిఎస్ చదువుతున్నాను. ఇంత మంచి కుటుంబంలో నన్ను కోడలిగా తీసుకు వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని జానకి దైవానికి మొక్కుతుంది. ఇక తర్వాత ముడుపు కట్టే సమయంలో జానకిని భర్త రామచంద్ర ఎత్తుకొని ముడుపు కట్టేలా చేస్తాడు. ఇక ఆ తర్వాత భర్త ప్రేమను చూసి ఎంతగానో సంతోషిస్తుంది. మీరు లేకపోతే నేను లేను ఎన్నో కలలు కన్న ఐపిఎస్ కలను మీవల్లే సాధ్యం చేస్తున్నారు అని జానకి తన ప్రేమను తెలియజేస్తుంది.

   టెన్షన్ లో పడేసిన జెస్సి

  టెన్షన్ లో పడేసిన జెస్సి

  మరోవైపు జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆ గుడికి అతని ప్రేయసి జెస్సి వస్తుంది. ఎప్పటినుంచో అఖిల్ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని అనుకుంటున్న జెస్సి ఈరోజు గుడిలో తన పుట్టినరోజు సందర్భంగా కలుసుకొని ప్రత్యేకంగా ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఇక అఖిల్ హఠాత్తుగా ఆమెను చూసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆ తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకుని మా అమ్మకు నిన్ను పరిచయం చేస్తాను అని కంగారుపడుతూ చెబుతాడు. ఎంత చెప్పినా కూడా జెస్సి మాత్రం అక్కడ నుంచి వెళ్లదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులను కలుసుకోవాల్సిందే అని జేసీ చెబుతుంది.

   జెస్సి షాక్

  జెస్సి షాక్

  ఇక అప్పుడే జానకి అటువైపుగా వస్తుంది. అఖిల్ జెస్సి మాట్లాడుకోవడం చూసినా జానకి వారి దగ్గరికి వెళుతుంది. కానీ అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జెస్సిని అడగడంతో అతను నా బాయ్ ఫ్రెండ్ అని జెస్సి చెబుతుంది. ఒకే కాలేజీలో చదువుకోవడం వలన జెస్సికి జానకి ముందే పరిచయం అవుతుంది. ఇక జానకి జెస్సి మాట్లాడుకోవడం చూసిన జ్ఞానాంబ మరింత సీరియస్ అవుతుంది. ఎందుకంటే గతంలో జెస్సి పొగరుబోతు తనాన్ని జ్ఞానాంబ కల్లారా చూస్తుంది. ఇక ఇలాంటి మనుషులతో మాట్లాడకూడదు అంటూ జానకిని తన దగ్గర నుంచి తీసుకు వెళుతుంది. అఖిల్ జ్ఞానాంబ కొడుకు అని తెలియడంతో జెస్సి కూడా షాక్ అవుతుంది.

  జ్ఞానాంబ అసంతృప్తి

  జ్ఞానాంబ అసంతృప్తి


  ఇక తర్వాత అఖిల్ జెస్సి విషయంలో మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. జానకి ప్రత్యేకంగా అడిగినప్పటికీ కూడా అతను నిజం చెప్పడు. ఆమె నార్మల్ ఫ్రెండ్ అంటాడు. ఇక ఆ విషయాన్ని మర్చిపోయే జానకి తన చదువును కొనసాగిస్తుంది. బయట కూర్చుని చదువుకుంటూ ఉండడంతో అక్కడే రామచంద్ర కూడా ఆమెకు తోడుగా ఉంటాడు. రామచంద్ర మెల్లగా నిద్రలోకి జారుకుని సోఫా మీద పడుకుంటాడు. అయితే వీరిని చూసిన జ్ఞానాంబ కొంత అసంతృప్తి చెందుతుంది. జానకి చదువు విషయంలో పడి తన భర్తను చూసుకోవడం లేదు అని అనుకుంటుంది. మరి తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial August 19th Episode 370
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X