twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu August 1st: జానకిపై మరింత పెరిగిన జ్ఞానాంబ కోపం.. మల్లిక ఫుల్ హ్యాపీ!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో మంచి రేటింగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కథలో భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 356 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    జానకి చదువుతో సమస్య

    జానకి చదువుతో సమస్య

    జానకి చదువు గురించి మరో నిజం తెలియడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా కంగారు పడుతుంది. చదువుకున్న కోడలు వద్దని ఆమె ఎంతో ఆలోచించి జానకిని రామచంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ జానకి కుటుంబ సభ్యులు జానకి చదువు గురించి అబద్ధం చెప్పినట్లు ఆ తర్వాత జ్ఞానాంబ నిజం తెలుసుకుంటుంది. డిగ్రీ చదువుకున్నప్పటికీ కూడా జానకి మంచితనం కారణంగా జ్ఞానాంబ ఆ తరువాత కంగారు పడకుండానే ఉంటుంది. కానీ భర్త సహకారంతో జానకి తన ఐపీఎస్ చదువుకుని కొనసాగిస్తూ ఉంటుంది. ఇక మధ్యలోనే జ్ఞానాంబ జానకి చదువుకోకూడదు అని తన సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటుంది. అంతేకాకుండా మరోసారి చదువు ప్రస్తావన తీసుకురావద్దు అని మాట కూడా తీసుకుంటుంది.

    జ్ఞానాంబ భయం ఆందోళన

    జ్ఞానాంబ భయం ఆందోళన

    తన తమ్ముడికి జరిగిన అన్యాయం తన కొడుకు విషయంలో కూడా జరగకూడదు అని చదువుకున్న అమ్మాయి భార్యగా ఉంటే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అని ఆ తర్వాత ఏవైనా పరిణామాలు చోటు చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది అని జ్ఞానాంబ ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం తన భార్య గురించి తల్లికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు జానకి ఎప్పటికీ కూడా అలా చేయదు అని కట్టుబాట్లకు అలాగే భర్తకు ఎంతో గౌరవం ఇస్తుంది అని చెబుతాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ అతని మాటలు పట్టించుకోదు.

    వరలక్ష్మి పూజ

    వరలక్ష్మి పూజ

    ఇక చివరికి తనకు తెలియకుండా రామచంద్ర జానకిని చదివిస్తున్నాడు అని తెలియడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ షాక్ లో నుంచి కోలుకోవడానికి సమయం తీసుకున్న జ్ఞానాంబ కొడుకు కూడా మాట్లాడకుండా వాళ్ళని దూరం పెడుతుంది. వరలక్ష్మి పూజ చేయాలి అని జ్ఞానాంబ ఇంట్లో అందరికీ చెబుతుంది అయితే ఈ క్రమంలో జానకి ఏమాత్రం పనిచేయడానికి వీలులేదు అని అలాగే రామచంద్రతో కూడా జ్ఞానాంబ మాట్లాడకుండా ఉంటుంది.

     మల్లిక సంబరం

    మల్లిక సంబరం

    ఇక ఇంట్లో అన్ని పనులు కూడా చిన్న కొడుకు విష్ణు చూసుకోవాలి అని అలాగే అతని భార్య మళ్ళీ పూజకు సంబంధించిన పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనలు ఇస్తుంది. మల్లికకు అధికారం రావడంతో ఎంతగానో సంతోషిస్తుంది. జానకి, జ్ఞానాంబ మధ్యలో ఎప్పటినుంచో ఇలాంటి గొడవ చూడాలని అనుకుంటున్నట్లు సంబరపడిపోతూ ఉంటుంది. ఇక కనీసం జానకి రామచంద్ర ఫోటో చూడడానికి కూడా జ్ఞానాంబ బాగా ఏ మాత్రం ఇష్టపడదు. జ్ఞాపకాలు అనేది బాధ్యతలను ప్రేమను గుర్తుచేసేలా ఉండాలి అంతేగాని మోసాలను బాధను కలిగించేలా చేయకూడదు అని అందుకే ఇంట్లో అలాంటి ఫోటోలు ఉండకూడదు అని తన పనిమనిషితో చెబుతుంది.

    జానకి ఆవేదన

    జానకి ఆవేదన


    కనీసం ఫోటోలు కూడా ఇంట్లో ఉండడానికి అత్తగారు ఇష్టపడడం లేదు అని తెలిసి జానకి ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత తన గదిలోనే తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి అవుతుంది. ఇక జానకీ బాధపడుతూ ఉండడం చూసిన రామచంద్ర కూడా మొదట్లో కాస్త భావోద్వేగానికి గురి అవుతాడు. అదేమీ పట్టించుకోకుండా ముందు మనం వెళ్లి పూజా కార్యక్రమాలు చూసుకుందామని ఈ పూజతో అయినా అమ్మ మనసు మారుతుంది అని ఆశిద్దాం అని కూడా అంటాడు. కానీ జానకి మాత్రం తన కారణంగానే మీ తల్లి కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి అని బాధపడుతూ ఉంటుంది.

    ధైర్యం చెప్పిన రామ

    ధైర్యం చెప్పిన రామ

    కానీ రామచంద్రం ఆ విషయం గురించి ఆలోచించవద్దు అని ఈ బాధలు ఎక్కువ రోజులు ఉండవు అని ధైర్యం చెబుతాడు. ఇక తర్వాత జానకి వరలక్ష్మి పూజ విషయంలో బాధ్యతలు తీసుకుంటూ అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకుంటుంది. వెన్నెల పనిమనిషి అక్కడే ఉండడంతో వారికి పూజకు సంబంధించిన పనులను కూడా చెందుతుంది. ఇక అప్పుడే మల్లికా ఆలస్యంగా అక్కడికి వస్తుంది. జానకి ఈ పనులతో మళ్ళీ అత్తగారికి దగ్గర అవుతుందేమో అని కంగారుపడుతూ మళ్లీ ఎలాగైనా ఆమెను రెచ్చగొట్టాలని అనుకుంటుంది.

    జ్ఞానాంబ ఎంట్రీ.. ఏం జరుగుతుందో?

    జ్ఞానాంబ ఎంట్రీ.. ఏం జరుగుతుందో?

    నిన్ను అత్తగారు ఏ పని చేయవద్దు అని చెప్పారు కదా మళ్లీ ఇక్కడ ఏం చేస్తున్నావని, ఆమె నిన్ను ఇలా చూసింది అంటే మళ్ళీ బాధపడుతుంది అని మల్లికా లేనిపోని అబద్ధాలు చెబుతుంది. కానీ జానకి మాత్రం మల్లిక ఎంత కోపంగా మాట్లాడినా కూడా సున్నితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుడే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. మరి మల్లిక మరోసారి జానకి గురించి అబద్ధాలు చెప్పి ఇరకాటంలో పడేస్తుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial August 1st Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X