For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 22nd: జానకికి మరో షాక్ షాక్ ఇచ్చిన జెస్సి.. గుడ్ న్యూస్ చెప్పిన మల్లిక

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథ ఎంతో ఆసక్తికరంగా.కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 369వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  అత్త నుంచి గ్రీన్ సిగ్నల్

  అత్త నుంచి గ్రీన్ సిగ్నల్

  మొన్నటి వరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగించిన జానకి ఇప్పుడు అత్తగారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధైర్యంగా తన చదువు కొనసాగిసుకుంటుంది. అయితే పరీక్షలు కూడా దగ్గర దగ్గరపడుతుండటంతో కాస్త ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం ఉందని తన భర్తకు చెబుతోంది.

  అయితే రామచంద్ర కూడా సపోర్ట్ చేసే విధంగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇంట్లో పనులు చేయకూడదు అని అవసరం అయితే అమ్మతో మాట్లాడతాను అని రామచంద్ర చెబుతాడు. అయినప్పటికీ జానకి మొదట ఆ విషయంలో విభేదిస్తుంది. నేను రెండు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించగలనని నమ్మకంగా తెలియజేస్తుంది. ఆ తరువాత అనుకోకుండా జ్ఞానాంబ పరిస్థితిని అర్థం చేసుకునే నీ పరీక్షలు పూర్తయ్యేలోపు ఇంట్లో ఏ పని చేయవద్దు అని హ్యాపీగా చదువుకోవచ్చు అని చెబుతుంది.

  జ్ఞానాంబ అసహనం

  జ్ఞానాంబ అసహనం

  ఇక జానకి చదువుకుంటూ ఉండటంతో ఇంట్లో పనులన్నీ కూడా చిన్న కోడలు మల్లికకు చెబుతారు. ఆ విషయంలో మల్లిగా తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉంటుంది. ఎన్నిసార్లు జానకి పై నిందలు వేయాలని ప్రయత్నించినా కూడా ఎలాంటి ప్లాన్ వర్కౌట్ కావడం లేదు అని.. ఇంట్లో అందరికీ నేను కామెడీ అయిపోయాను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది.

  ఇక మల్లిక ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా మరొకవైపు జ్ఞానాంబ తన పెద్ద కోడలు జానకి విషయంలో కొంత అసంతృప్తిగా ఉంటుంది. చదువుకోమ్మని చెప్పాను కదా అని ఇంట్లో భార్యగా నీ భర్తను పట్టించుకోకుండా ఉండడం ఏమాత్రం బాగోలేదు అని జ్ఞానంబ చెబుతుంది. నువ్వు చదువుకునే ముందు ఎంతో జాగ్రత్తగా చెప్పాను నీ చదువు నీ భర్తకు ఆటంకం కాకూడదు అయినా కూడా నువ్వు నా మాటను లెక్క చేయడం లేదు ఈ విషయంలో నేను బాధపడడం తప్ప మరి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది అని జ్ఞానాంబ బాధపడుతుంది.

  జ్ఞానాంబ మరో హెచ్చరిక

  జ్ఞానాంబ మరో హెచ్చరిక

  అయితే అలాంటిదేమీ లేదు అని మధ్యలో వచ్చిన రామచంద్ర చెబుతాడు. జానకి గారు నిరంతరం కష్టపడి చదివితేనే పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించగలరు. నేనే తనను బాగా చదువుకోమ్మని చెప్పాను అని సపోర్ట్ చేయడంతో మధ్యలో అప్పుడే మల్లికా ఎంట్రీ ఇస్తుంది. ఏదేమైనా కూడా జానకి తప్పు చేస్తోంది అని మీరు పెట్టిన ఐదు షరతులలో జానకి ఒక తప్పు చేసింది అని కాబట్టి మీరు ఒక అంకెను కొట్టేయాలి అని అంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో మల్లికా మాటలు పెద్దగా పట్టించుకోదు. ఇక తర్వాత మరొకసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అని తర్వాత నేను చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాను అని జ్ఞానాంబ చెబుతుంది.

  షాక్ ఇచ్చిన జెస్సి

  షాక్ ఇచ్చిన జెస్సి

  జెస్సి జానకి తన మనసులో అఖిల్ జెస్సిల గురించి ఆలోచించుకుంటూ ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయో అని ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇక తర్వాత జానకి కాలేజీ దగ్గరకు వెళుతుంది. అక్కడ జెస్సి దీనంగా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. ఇక ఆమెను పలకరించిన జానకి అసలు విషయం అడిగి తెలుసుకుంటుంది.నేను అఖిల్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అతను లేకపోతే నేను బ్రతకలేను.. నా జీవితం అతనితోనే అంటూ జెస్సి చాలా ఎమోషనల్ గా మాట్లాడడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

  జెస్సి మొండితనం

  జెస్సి మొండితనం

  కొన్ని కట్టుబాట్లు ఆచారాలు మా అత్తగారు చాలా కఠినంగా పాటిస్తారు. ఆ విషయంలో ఎవరి మాట కూడా వినరు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు అనవసరంగా ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ముందు నీ చదువుపై దృష్టి పెడితే మంచిది అని జానకి తన వైపు నుంచి సలహా ఇస్తుంది. నేను చదువుతాను కానీ పెళ్లి చేసుకుంటే అఖిల్ గా చేసుకుంటాను అని జెస్సి మొండిగా చెబుతుంది.

   మల్లిక ద్వారా గుడ్ న్యూస్

  మల్లిక ద్వారా గుడ్ న్యూస్

  ఇక తర్వాత మల్లిక నుంచి ఇంట్లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఆమె తల్లి కాబోతోంది అని తెలియడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ప్రత్యేకంగా ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని కూడా జ్ఞానాంబ అనుకుంటుంది. అయితే అప్పుడే ఆమె భర్త గోవిందరాజులు ఒక మాట చెబుతాడు. మొదట నువ్వు పెద్ద కోడలు జానకి కడుపు పండితే బాగుంటుంది కదా అని అనుకున్నావు అయితే ఇప్పుడు అందరిని పిలిచి సంబరాలు చేస్తే తోటి వాళ్ళు జానకిని మాటలతో ఏ విధంగా బాధపడతారో ఊహించవచ్చు అని గోవిందరాజులు అంటాడు. అయినా కూడా ఆ విధంగా ఆలోచించి మల్లికా ఆనందాన్ని దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు అని జ్ఞానాంబ వివరిస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 371
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X