Janaki Kalaganaledu August 24th Episode: జానకి కోసం మాస్టర్ ప్లాన్ వేసిన రామచంద్ర.. మరో బిగ్ టాస్క్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. అత్త కోడళ్ల మధ్య గొడవల్లోనే కోపాలతో పాటు ప్రేమలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. తల్లి జ్ఞానాంబకు తెలియకుండా ఆమె కుమారుడు రామచంద్ర భార్యను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని కష్టపడుతున్నాడు. ఆ క్రమంలో వారు రోజుకో అబద్దాన్ని దాటుకుంటూ వస్తున్నారు. అయితే అబద్దాలు అంటేనే గిట్టని జ్ఞానంబ అసలు నిజం తెలిస్తే ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.

ఈ విషయంలో జ్ఞానాంబ ప్రతి క్షణం అనుమానాలు వ్యక్తం చేస్తుండగా జానకి మనసులో ఆందోళన నెలకొంది. అలాగే మరోవైపు మల్లిక కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మల్లికకు , జానకికి మధ్యలో గొడవలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. జానకి పోలీస్ అవ్వాలన్న కోరిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే పాయింట్ ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 112వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జానకి హెచ్చరికలు

జానకి హెచ్చరికలు

జానకిని అత్త మెచ్చుకోవడం ఏమాత్రం నచ్చలేదని మల్లిక తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక అదే సమయంలో వెనకాల నుంచి మల్లిక మాటలు విన్న జానకి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తనపై ఎందుకంత పగ, కక్ష్య అంటూ ప్రశ్నిస్తుంది. ఇంత మంచి కుటుంబం నుంచి బయటకు వెళ్లాలని ఎలా అనిపిస్తోందని కూడా ఆరా తీస్తుంది.

మీరు ప్రత్యేకంగా డబ్బులు దాచుకున్న విషయం తెలిసినప్పటికీ ఎవరు ఏమీ అనడం లేదు. అయినా కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోవడం బెటర్ అని జానకి హెచ్చరిక చేయడంతో మల్లిక మనసులో మరింత కోపం కలుగుతుంది.

కోచింగ్ కోసం జ్ఞానాంబ అనుమతి

కోచింగ్ కోసం జ్ఞానాంబ అనుమతి

జానకిపై కోపంతో ఉన్న మల్లిక ఎలాగైనా మరోసారి కక్ష సాధించాలని అనుకుంటుంది. ప్రతిరోజు వారు ఏం మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై కూడా నిఘా వేస్తుంది. ఇక మరోవైపు జానకి కూడా కొంత టెన్షన్ పడుతుంది నిజం చెప్పకుండా ఉండడం చాలా కష్టంగా ఉందని భర్తతో మరోసారి తన బాధను చెప్పుకుంటుంది.

అందుకు రామచంద్ర మరోసారి జానకికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఐపీఎస్ పరీక్షల కోసం ఎంతోకొంత కోచింగ్ తీసుకోవాలనే అందుకోసం రాజమండ్రి కూడా వెళ్లాలని భర్తను అడుగుతుంది. అయితే అందుకోసం అమ్మను అడగాలని అది చాలా కష్టమైన పని అని అంటాడు.

మరో ప్లాన్ వేసిన రామచంద్ర

మరో ప్లాన్ వేసిన రామచంద్ర

ఉదయాన్నే ఇంటి దగ్గరికి వెళ్లిన రామచంద్ర అదిరిపోయే ప్లాన్ వేస్తాడు. చదువు కోసం అని చెప్పకుండా జానకితో కేకులు చేయడం నేర్పిస్తే మన షాప్ కు మరింత గుర్తింపు వస్తుందని బిజినెస్ కూడా పెరుగుతుందని అందుకే ఆమెను రాజమండ్రి పంపించి కేకులు చేయడం నేర్పించాలని అనుకుంటున్నట్లు వివరిస్తాడు. కానీ అందుకు జ్ఞానాంబ మాత్రం ఒప్పుకోదు. అంతేకాకుండా తన కోడలిని అంత దూరం పంపించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని మరోసారి ఈ విషయాన్ని తన వద్దకు తీసుకు రావద్దని కూడా రామచంద్ర కు గట్టిగానే చెబుతుంది.

అత్తను ఒప్పించిన జానకి

అత్తను ఒప్పించిన జానకి

అయితే వీరిద్దరూ టెన్షన్ పడుతున్నా ఈ విషయాన్ని మరో వైపు నుంచి మల్లిక కూడా పసిగడుతుంది. కేవలం కేకులు నేర్చుకోవడానికి పంపించలేదు అంటే అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నారు అని మల్లికా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మరోసారి జానకి అత్తను రిక్వెస్ట్ చేయాలని అనుకుంటుంది.

మన వ్యాపారం పెరగాలి అంటే కేకులు చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మీరు పూతరేకులు ఎలాగైతే చేస్తారో నేను కూడా అలానే కేకులు తయారు చేయడం నేర్చుకుని మన షాపులో చేస్తాం అని అంటుంది. తప్పకుండా ఎంతోకొంత మంచిపేరు మన షాప్ కు వస్తుందని చెప్పడంతో జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. రాజమండ్రిలో తమకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళితే వాళ్లే దగ్గరుండి నేర్పిస్తారాని కూడా జానకికి సలహా ఇస్తుంది.

అసలు గుట్టు ఏదో ఉందని ..

అసలు గుట్టు ఏదో ఉందని ..

జ్ఞానాంబ ఒప్పుకోవడంతో జానకి ఎంతగానో సంతోషిస్తుంది వెంటనే ఆ విషయాన్ని వెళ్లి భర్తకు వివరిస్తుంది. అందుకు రామచంద్ర కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ఇక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాజమండ్రిలో ఎవరికి తెలియకుండా కోచింగ్ కు వెళ్లాలని రామచంద్ర భార్యకు సూచిస్తాడు.

ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మరో వైపు నుంచి మల్లిక కూడా గది తలుపు దగ్గర నిలబడి వినే ప్రయత్నం చేస్తుంది. కానీ జానకి, రామచంద్ర మాటలు ఆమెకు సరిగ్గా అర్థం కావు. కానీ ఎలాగైనా సరే జానకి కేకులు నేర్చుకోవడం వెనుక అసలు గుట్టు ఏదో ఉందని దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
మరో చాలెంజ్ ను స్వీకరించిన జానకి

మరో చాలెంజ్ ను స్వీకరించిన జానకి

ఇక అదే రోజు జ్ఞానాంబకు ఒక భారీ ఆర్డర్ వస్తుంది. ఒక ఈవెంట్ కోసం 1000 మందికి స్వీట్స్ తయారు చేయాలని, అందుకు 5 లక్షలు తప్పకుండా ఇస్తామని అంటారు. ఒక్కరోజులోనే వెయ్యి మందికి చేయాలని చెప్పడంతో, ఎంత కష్టపడినా కూడా అది ఒక్క రోజులో కుదరని పని అంటూ జ్ఞానాంబ రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుడే జానకి కలుగజేసుకుని తప్పకుండా పనిని ఒక్క రోజులో పూర్తి చేయవచ్చని ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరి జానకి తీసుకున్న చాలెంజ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X