For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 24th: బెడిసికొట్టిన మల్లిక కన్నింగ్ ప్లాన్.. బయటపడిన అసలు నిజం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 373 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  హ్యాపీ మూమెంట్

  హ్యాపీ మూమెంట్

  చిన్న కోడలు మల్లికా తల్లి కాబోతోంది అనే విషయం తెలియగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా అత్త జ్ఞానాంబ సంతోషానికి అవధులు ఉండవు. ఎంతో కాలంగా ఇంట్లో మనవడు మరవరాళ్లతో ఆడుకోవాలని ఉంది అని ఆమె కోరుకుంటుంది.

  ఇక వీలైనంత త్వరగా పెద్ద కోడలు జానకి చిన్న కోడలు మల్లిక వారసులను ఇస్తే బాగుంటుంది అని ఆమె ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే ఇదే సమయంలో చిన్న కోడలు మల్లిక నెలతప్పినట్లు తెలియడంతో ఎంతగానో ఆనందపడతారు. ఇక ఈ సంతోషాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నలుగురిని పిలిచి భోజనాలు కూడా పెట్టించాలి అని జ్ఞానాంబ ఆలోచిస్తుంది.

  అనుమానం వచ్చేలా

  అనుమానం వచ్చేలా

  అయితే అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో పక్కింటి నీలావతి మల్లిక ఆలోచన విధానం ప్రకారం ఊహించని విధంగా సూటిపోటి మాటలతో జానకిని మరింత బాధపెడుతుంది. చిన్న కోడలి కంటే పెద్ద కోడలు ముందుగా ఈ ఇంటికి వారసులను ఇవ్వాలి.. అలాంటిది చిన్న కోడలు నెల తప్పడం ఏమిటో అంటూ అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఏదైనా లోపం ఉందేమో అని మరికొందరు అంటారు. ఇక రామచంద్ర కూడా హాస్పిటల్ కి చూపించుకుంటే మంచిది అంటూ సెటైర్లు వేస్తూ ఉంటారు. దీంతో ఆ మాటలకు జానకి అలాగే అందరూ బాధపడతారు. ఇక గోవిందరాజులు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అంటాడు.

  అర్థం చేసుకున్న జ్ఞానాంబ

  అర్థం చేసుకున్న జ్ఞానాంబ

  ఇక తర్వాత తప్పకుండా జానకిని ఆమె అత్త జ్ఞానాంబ తిడుతుంది అని చిన్న కోడలు మల్లిక ఎదురుచూస్తుంది. కానీ జ్ఞానాంబ మాత్రం పరిస్థితిని అర్థం చేసుకొని జానకి చదువు కోసం తను ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటుంది కాబట్టి ఆమెని ఏమీ అనకుండా మిగతా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని అంటుంది. దీంతో ఒక్కసారిగా మల్లిక ఆశ్చర్య పోతుంది. ఎలాగైనా జానకిని తిట్టించాలి అని కోపంతో మల్లికా గర్భం దాల్చినట్లుగా అబద్ధం కూడా చెబుతోంది. ఇక ఆ వంకతో ఇంట్లో పనిలోనే కూడా చేయదు. అన్ని పనులు జానకితోనే చేయించాలి అని ఆలోచిస్తుంది.

  బాధలో జానకి

  బాధలో జానకి

  మరోవైపు జానకి ఎంతగానో బాధపడుతుంది. తన చదువు కారణంగా భర్తకు ఆనందం ఇవ్వడం లేదు అని అలాగే అత్తమామలకు వారసులను కూడా ఇవ్వలేకపోతున్నాను అని అనుకుంటుంది. అయితే రామచంద్ర మాత్రం ఇది కేవలం తన నిర్ణయం అంటూ నేను మిమ్మల్ని చదువుకోమన్నాను కాబట్టే మనం పిల్లలను వద్దని అనుకున్నాము కదా అని అంటాడు. అలాగే పిల్లలను కనడం పెద్ద సమస్య కాదు. కానీ మీరు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రుల కోసం కన్న ఐపిఎస్ కలను మాత్రం విడిచిపెట్టకూడదు అని మీ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత తప్పకుండా మనం పిల్లల గురించి ఆలోచిద్దాం అని అంటాడు. ఇక అందుకు జానకి ఎమోషనల్ అవుతుంది.

  మల్లిక అత్యుత్సాహం

  మల్లిక అత్యుత్సాహం

  ఇక తర్వాత జానకి ఇంట్లో పనులన్నీ చేస్తుంది. మల్లికా గర్భవతిగా ఉన్నందువలన ఆమె ఏ పనులు చేయకూడదు అని అత్తగారు చెప్పడంతో జానకి అని చూసుకుంటుంది. అయితే ఈ క్రమంలో మల్లిక అత్యుత్సాహం వలన ఒక్కసారిగా కింద పడిపోతుంది. నడుము నొప్పి అంటూ అరవడంతో వెంటనే జానకి డాక్టర్ని కూడా పిలిపించాలని అనుకుంటారు. ఇంక మల్లికకు ఏమైందో ఏమో అని ఇంట్లో అందరూ కూడా కంగారుపడుతూ ఉంటారు.

  బయటపడిన నిజం

  బయటపడిన నిజం

  అయితే డాక్టర్ ను పిలిపిస్తూ ఉండగా వద్దు అని మల్లికా చెబుతుంది. అయినప్పటికీ డాక్టర్ ని ఇంటికి పిలిపిస్తారు. ఇక కొద్దిసేపు మల్లికను చెక్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయితే మల్లిక డాక్టర్ కు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ డాక్టర్ మాత్రం అసలు మల్లిక గర్భవతి కాదు అంటూ ఇంట్లో అందరికీ చెబుతుంది. దీంతో మల్లిక.. జానకి డాక్టర్ కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు అని అబద్ధం చెబుతుంది. అయినప్పటికీ ఆమె మాటలు ఎవరు నమ్మరు. దీంతో జ్ఞానాంబ మల్లికపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఈ తరహా ఘటన తర్వాత మల్లిక పరిస్థితి ఏ విధంగా మారుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 373
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X